»   »  ‘గుడ్ ఫ్రైడే’ గిఫ్టుగా పవనిజం సాంగుతో ‘రేయ్’

‘గుడ్ ఫ్రైడే’ గిఫ్టుగా పవనిజం సాంగుతో ‘రేయ్’

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘రేయ్' సినిమా విడుదల ముందే ‘పవనిజం'సాంగు, ‘గోలీ మార్' సాంగు అంటూ హడావుడి చేసారు. ఈ రెండు సాంగులు ఉంటాయనరి ఆశపడి థియేటర్లకు వెళ్లిన అభిమానులకు కేవలం ‘గోలీమార్' సాంగ్ మాత్రమే కనిపించింది. దీంతో ఫ్యాన్స్ కాస్త డిస్సప్పాయింట్ అయ్యారనే చెప్పాలి.

అయితే అభిమానులను మళ్లీ మళ్లీ థియేటర్లకు రప్పించాలనే ప్లాన్ వేసిన దర్శక నిర్మాత వైవిఎస్ చౌదరి....రెండో వారం నుండి ‘పవనిజం' సాంగ్ సినిమాలో యాడ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అంటే ఏప్రిల్ 3( గుడ్ ఫ్రైడే) నుండి రేయ్ సినిమాలో ఈ పాటను ప్రదర్శించబోతున్నారు.


 Pawanism song in 'Rey' from Good Friday

చిరంజీవి ‘గోలీమార్', పవనిజం సాంగ్ సినిమాలో వాడటంపై సాయి ధరమ్ తేజ్ స్పందిస్తూ....‘పెద్ద మావయ్య ఓసారి నాతో మాట్లాడుతూ...ప్రతి టెక్నీషియన్‌ని గౌరవించాలని చెప్పారు. మన రియల్ లైఫ్ క్యారెక్టర్ చాలా ముఖ్యమని చెప్పారు. దర్శకుడి హీరోగా ఉంటూనే నిర్మాతకు భారం కలిగించకుండా చూడాలి అని చెప్పారు. అందుకే ఆయన మాటలను ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాను. సినిమాలో గోలిమార్ సాంగ్ చాలా బాగా వచ్చింది అన్నారు.


పవనిజం సాంగ్ సాంగ్ చాలా రోజుల క్రితమే కంపోజ్ చేసాము. ఓ రోజు నేను పవన్ మావయ్య ఈవిషయమై అడిగాను. ఆయన ఎప్పటిలాగే ఓ చిరు నవ్వు నవ్వి ఓకే చెప్పారు. ‘మీకు నిజంగా అవసరం అయితే చేయండి' అని సమాధానం ఇచ్చారు అని తెలిపారు.

English summary
Sai Dharam Tej's 'Rey', directed by YVS Chowdary, was released on March 27th. The team says that the openings for the film are extraordinary and the collections are increasing day by day with positive talk of mouth. The Pawansim song, which was shot recently, will be added to the film from tomorrow (April 3rd) on the eve of Good Friday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu