»   » తప్పకుండా చూడండి: అవగాహన కై పవన్ కళ్యాణ్ (వీడియో)

తప్పకుండా చూడండి: అవగాహన కై పవన్ కళ్యాణ్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ రోజు డిసెంబర్ 1, ఎయిడ్స్‌డే‌ను పురస్కరించుకుని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ వ్యాధిపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకు ఆయన తన పవన్ క్రియేటివ్ వర్క్స్ పై ఓ వీడియోని విడుదలే చేసారు. ఆ వీడియోని మీరూ చూడండి.

ఇక పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఈ వీడియోని సోషల్ నెట్వర్కింగులో సైట్లలో అభిమానులు షేర్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే ట్విట్టర్లో చేరి తన అభిప్రాయాలను వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ఆయన సపరేట్‌గా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ చేయబోతున్నట్లు సమాచారం. పవన్‌.. సినిమాలు. రాజకీయ విషయాలు అన్నీ ఇందులో వుంటాయట.

రాజకీయాలకు సంబంధించి ఏదైనా విషయాన్ని ప్రజలకు చెప్పాలనుకున్నప్పుడు.... పవన్ కళ్యాణ్ నేరుగా యూట్యూబ్ వీడియో రూపంలో తన సందేశాన్ని తీసుకెళతారని, అందుకే సొంతగా తనకంటూ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఉండాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

English summary
PawanKalyan message about Child who's born to Aids affected Parents
Please Wait while comments are loading...