అనురాగ్య కశ్యప్‌ ఎన్టీఆర్ గురించి నీచంగా మాట్లాడాడట.. అసలు విషయం చెప్పిన పాయల్ ఘోష్

లాక్ డౌన్‌లో కొందరు తారలు ఎంతగా ఫేమస్ అయ్యారో అందరికీ తెలిసిందే. అనూహ్యమైన రీతిలో పాపులార్టీని తెచ్చుకున్నారు. లాక్ డౌన్ కంటే ముందు మీరా చోప్రా, పాయల్ ఘోష్‌లు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. మీరా చోప్రా ఎన్టీఆర్‌ను ఏకిపారేస్తే.. మీరా చోప్రాను పాయల్ ఘోష్ ఏకిపారేసింది. అప్పటి నుంచి పాయల్ ఘోష్ ట్విట్టర్‌లో దూసుకుపోతూనే ఉంది. అనురాగ్ కశ్యప్ చేసిన కామెంట్స్‌తో దేశ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది.

అనురాగ్‌పై ఆరోపణలు..

అనురాగ్‌పై ఆరోపణలు..

అనురాగ్ కశ్యప్‌పై క్యాస్టింగ్ కౌచ్, మీటూ ఆరోపణలు చేసిన పాయల్.. ఇంటికి పిలిచి ఎలా ప్రవర్తించాడో వివరించింది. అనురాగ్ చేసిన చేష్టలను వాటి గురంచి పాయల్ చెప్పిన వాటిని రాయడానికి కూడా అభ్యంతరకరంగా ఉన్నాయి. అయితే ఈ వ్యవహారంలో కొందరు పాయల్‌ను సమర్ధిస్తే.. ఇంకొందరు అనురాగ్ కశ్యప్‌ను సపోర్ట్ చేశారు. ఈ వ్యవహారం అలా ఉండగా తాజాగా పాయల్ చేసిన ట్వీట్స్ ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి.

సతీ సావిత్రిలా..

సతీ సావిత్రిలా..

అనురాగ్ కశ్యప్ తనపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఎన్టీఆర్‌పైనా నీచమైన కామెంట్స్ చేశాడని తెలిపింది. ఎన్టీఆర్ కూడా నిన్ను వాడాడు.. సతీ సావిత్రిలా ఎక్కువగా నటించకు.. నాతో పని చేసిన ప్రతీ ఒక్కరూ కాల్ చేస్తే వస్తారు అని అనురాగ్ నీచంగా మాట్లాడాడు. కానీ ఈ ప్రపంచానికి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఎన్టీఆర్ నాతో ఎప్పుడూ కూడా తప్పుగా ప్రవర్తించలేదు. అతను చాలా మంచి వాడు.

ఊసరవెళ్లి సినిమా..

ఊసరవెళ్లి సినిమా..

అసలు అనురాగ్ కశ్యప్‌కు నాకు ఎన్టీఆర్ గురించి ఎందుకు చర్చి వచ్చిందో తెలుసా అని నాడు జరిగిన ఘటన గురించి పాయల్ చెప్పుకొచ్చింది. హసీతో ఫసి సినిమా గురించి అనురాగ్‌తో చర్చించేందుకు వెళ్లిన సమయంలో టీవీలో ఊసరవెళ్లి సినిమా వస్తోంది.. రిఫరెన్స్ కోసం ఆ సినిమాను అనురాగ్‌కు చూపించమని నా మేనేజర్ చెప్పాడు. అలా ఎన్టీఆర్ విషయం చర్చకు వచ్చిందని పాయల్ చెప్పుకొచ్చింది.

ఎంతో బాగా..

ఎంతో బాగా..

జూ ఎన్టీఆర్ నాతో ఎంతో బాగా ఉండేవాడు.. అంతేకాదు దక్షిణాదిలో పెద్ద స్టార్స్‌ చాలా మందితో చేశాను. అక్కడే నాకు రక్షణ ఉందని అనిపించింది.. హ్యాపీగా ఉన్నాను.. అంటూ పాయల్ ఘోష్ అసలు విషయాలను బయటకు చెప్పేసింది. ప్రస్తుతం పాయల్ చేసిన ఈ ట్వీట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X