»   » వేషం అడిగితే సెక్స్ కోరాడంటూ డైరక్టర్ పై ఆరోపణ

వేషం అడిగితే సెక్స్ కోరాడంటూ డైరక్టర్ పై ఆరోపణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఖోస్లా కా గోస్లా, లవ్ సెక్స్ అవుర్ ధోకా, లక్కీ ఓయ్ లక్కీ చిత్రాల దర్శకుడు దివాకర్ బెనర్జీపై బాలీవుడ్ లో మంచి పేరు ఉంది. విభిన్నమైన చిత్రాల ఈ దర్సకుడు ఇప్పుడు ఓ కొత్త వివాదంలో ఇరుక్కున్నాడు. బాలీవుడ్లో బి గ్రేడ్ సినిమాలు చేసుకునే పాయిల్ రోహత్గీ అనే నటి తనను సెక్స్ వల్ గా వేధించాడంటూ ఆరోపణ చేసింది. అలాగే తనకు దివాకర్ చాలా కాలంగా ప్రెండ్ అని, అయితే అతను ఇలా సినిమాలో ఆఫర్ అడిగేసరికి ఇలా హెరాస్ మెంట్ కి దిగాడంటోంది. అయితే దివాకర్ వెర్షన్ వేరేగా ఉంది. ఆమె ఎంత స్నేహితురాలైనా ఆడిషన్లో ఫెయిల్ అయిందని, అలాంటప్పుడు ఆమెకు ఎలా ఛాన్స్ ఇవ్వగలుగుతానని, ఆ విషయాన్ని ఆమె పాజిటివ్ గా తీసుకోకుండా నానా యాగీ చెయ్యటాన్ని తాను ఊహించలేకపోతున్నాని వాపోతున్నాడు. దివాకర్ ప్రస్తుతం సాంఘై అనే చిత్రం రూపొందిస్తూ అందుకోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నాడు. అందులో మెయిన్ క్యారెక్టర్ కోసం అతన్ని ఆమె సంప్రదించింది. అయితే ఆమె ఫెయిల్యూర్ అయింది. కాస్టింగ్ కోచ్ వివాదంలో ఈసారి దివాకర్ బెనర్జీ ఇరుక్కోవటం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. పాయిల్ గురించి తెలిసిన వారంతా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవటం లేదు. దాంతో ఆమె మీడియా ముందు తన ఆక్రోశం వెల్లబుచ్చుతోంది.

English summary
Payal Rohatgi who also starred in Bigg Boss is back in news for, ‘LSD’ director Dibakar Banerjee asked for sleep together favor from her in return for a role in his upcoming film titled ‘Shanghai’.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu