twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రముఖ గాయకుడు పీబీ శ్రీనివాస్‌ కన్నుమూత

    By Srikanya
    |

    PB Srinivas
    చెన్నై: ప్రఖ్యాత సినీ, శాస్త్రీయ సంగీత గాయకుడు, సంగీత దర్శకుడు, రచయిత, కవి, బహుభాషా కోవిదుడు.. ప్రతివాదిభయంకర శ్రీనివాస్ (పీబీ శ్రీనివాస్, 83) చెన్నైలో కన్నుమూశారు. శనివారం సాయంత్రం స్వల్ప అనారోగ్యంతో ఇబ్బంది పడ్డ ఆయన.. ఆదివారం మధ్యాహ్నం 1 గంట సమయంలో గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు. ఆయనకు నలుగురు కుమారులు.. ఫణీందర్, విజయ్, నందకిషోర్, రాజగోపాల్, కుమార్తె లత ఉన్నారు.

    పీబీ శ్రీనివాస్ మరణంతో ఆయన సతీమణి జానకి (80), కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తండ్రికి గడ్డం గీసి, స్నానం చేయించి భోజనం పెట్టేందుకు కుర్చీలో కూర్చోబెట్టారు. మరునిమిషంలోనే పీబీ శ్రీనివాస్ తుదిశ్వాస విడిచారు. శ్రీనివాస్ అంత్యక్రియలు సోమవారం ఉదయం చెన్నైలోని కన్నమ్మపేట శ్మశానవాటికలో నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు.

    అనేక భాషల్లో వందలాది పాటలు పాడిన పీబీ శ్రీనివాస్‌ మరణవార్త తెలియగానే నగరంలోని తమిళ, తెలుగు సినీ పరిశ్రమకు చెందిన సినీ ప్రముఖులు రాజకీయ నేతలు ఆయన ఇంటికి తరలి వచ్చి నివాళులర్పించారు. ఆయన అంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నం చెన్నైలో జరుగుతాయని కుటుంబ సభ్యులు చెప్పారు.

    దక్షిణాది భాషల్లో, హిందీలోనూ తన గాత్రంతో అలరించిన ప్రతివాద భయంకర శ్రీనివాస్‌ సెప్టెంబరు 22, 1930లో తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జన్మించారు. ఆయన గాత్ర మాధుర్యాన్ని గుర్తించిన నిర్మాత నాగేంద్రరావ్‌ పీబీఎస్‌కు సినిమాలో పాడే అవకాశం కల్పించారు.

    ప్రేమపాశంతో ఆయన సినీ గళప్రస్థానం ఆరంభమైంది. అందులో పి.సుశీలతో కలిసి తొలిపాట పాడారు. కన్నడంలో కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌, తమిళంలో జెమినీ గణేశన్‌ సినిమాల్లో ఆయన ఎక్కువగా పాటలు పాడారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ సినిమాల్లో దాదాపు 3 వేలకుపైగా పాటలు పాడారు.

    ఆయన కేవలం గాయకుడే కాదు. మంచి గేయ రచయిత కూడా. ఆకలిరాజ్యం సినిమా హిందీలో 'తూహైరాజా..' లాంటి జనాదరణ పొందిన పాటలు ఆయన రాశారు. ఉర్దూలో గజల్స్‌ రచనా చేశారు. ఆంగ్లంలో కొన్ని కవితలు కూడా రాశారు. నీల్‌ఆర్మ్‌స్ట్రాంగ్‌ చంద్రుడిపై కాలుమోపినప్పుడు ఆయన ఆంగ్లంలో రాసిన కవిత ఆర్మ్‌స్ట్రాంగ్‌ను సైతం మెప్పించింది. చిత్రసీమలో ఆయన ఒకప్పుడు అగ్రశ్రేణి గాయకుడిగా రాణించారు.

    తమిళ చిత్రసీమలో ఆయన ఆరాధ్య గాయకుడిగా వెలుగొందారు. ఎంతోమంది తమిళ సినీ గీతాభిమానులు ఆయన సొంతం. వెంకటేశ్వర సుప్రభాతం, ముకుందమాల, శ్రీమల్లికార్జున స్తోత్రం లాంటి భక్తి పాటలు ఆలపించారు. తమిళనాడు ప్రభుత్వం కళాకారులకు ఇచ్చే ప్రతిష్ఠాత్మక 'కలైమామణి' బిరుదుతో సత్కరించింది. ధట్స్ తెలుగు ఆయన మృతికి సంతాపం తెలియచేస్తోంది.

    English summary
    Veteran playback singer PB Srinivas who rendered more than 3,000 songs in eight languages is no more. Srinivas breathed his last at his Saidapet residence in Chennai on Sunday afternoon. He was 82 and survived by two sons and daughter.It was said that Srinivas was not keeping well for the last few days. Srinivas was born in Kakinada on September 22, 1930 to Phanindra Swamy and Seshagiryamma. He rendered 3,000 songs in eight languages including Kannada, Tamil, Telugu, Malayam, Hindi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X