»   »  ‘బాహుబలి’ గురించి పి.సి. శ్రీరామ్ ఇలా....

‘బాహుబలి’ గురించి పి.సి. శ్రీరామ్ ఇలా....

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌:రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘బాహుబలి' . ఈ సినిమా మరో రేపటి రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ నేపధ్యంలో సినీ ప్రపంచం మొత్తం ఈ చిత్రం గురించే చర్చిస్తోంది. ముఖ్యంగా టెక్నిషియన్స్ అంతా ఈ చిత్రం విడుదల కోసం ఆసక్తిగా చూస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి.సి శ్రీరామ్ సైతం ఈ చిత్రం గురంచి ఇలా రాసుకొచ్చారు.ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఇక ఈ చిత్రం లేటెస్ట్ అప్ డేట్స్ కు వస్తే...


తెలుగుతో పాటు తమిళం, మళయాలం, హిందీ భాషల్లోనూ రేపు...(జూలై 10) నే విడుదల కానుంది. ఈ సినిమా, దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా కావడం, ట్రైలర్, పోస్టర్లు సినిమాపై విపరీతమైన అంచనాలను క్రియేట్ చేసాయి.


PC Sreeram calls Baahubali an EXPERIENCE

ఈ చిత్రానికి నిన్నటి ఉదయం నుంచే ప్రధాన థియేటర్లలో, మల్టీప్లెక్స్‌లలో టికెట్ బుకింగ్‌ను మొదలుపెట్టేశారు. ఆన్‌లైన్‌లో నిమిషం కూడా టికెట్లు అందుబాటులో లేకుండా అమ్ముడైపోవడం సంచలనమైంది. అలాగే..., మల్టీప్లెక్సుల్లో ఈ సినిమా బుకింగ్స్ కోసం అభిమానులు భారీ సంఖ్యంలో హాజరు అయ్యారు.


ముఖ్యంగా హైద్రాబాద్‌తో పాటు మరికొన్ని ప్రధాన నగరాల్లోని మల్టిప్లెక్సుల్లో టికెట్ల బుకింగ్ మొదలుకాగా, బుకింగ్ కౌంటర్ల వద్ద అభిమానులు బారులు తీరి కనిపించారు. చాలా చోట్ల కిలోమీటర్ మేర క్యూ ఉండడం జరిగింది.


మరో ప్రక్క ముందు రోజు అంటే ఈ రోజు (గురువారం) అర్థరాత్రి ప్రదర్శితమయ్యే బెనిఫిట్ షోలకు కనీవినీ ఎరుగని రీతిలో టిక్కెట్ పెట్టారు. వీటి అమ్మకాలు ప్రారంభమయ్యాయి.


English summary
PC Sreeram tweeted: "BAAHUBALI the beginning of many more such films to come, will definitely be experience to watch . Waiting to watch this spectacle".
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu