»   » రామ్ చరణ్ తేజ, పిసి శ్రీరామ్ కాంబినేషన్లో...

రామ్ చరణ్ తేజ, పిసి శ్రీరామ్ కాంబినేషన్లో...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ ఛాయాగ్రాహకుడు పి.సి.శ్రీరామ్...రామ్ చరణ్ తేజ తదుపరి చిత్రానికి కెమెరామెన్ గా పనిచేయనున్నారు. సెలెక్టివ్ గా సినిమాలు చేసే శ్రీరామ్...తమిళ దర్శకుడు చెప్పిన ఏక్షన్ లవ్ స్టోరీ విని చేయటానికి ముందుకు వచ్చారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అదే దేవి, రామ్ చరణ్ కలసి చేస్తున్న మొదటి చిత్రం. ఇంకా టైటిల్ పెట్టని ఏప్రియల్ 30న లాంఛనంగా మొదలై మే మొదటి వారం నుంచీ షూటింగ్ జరుగుతుంది. మెగా సూపర్ గుడ్ వారు నిర్మించే ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్ గా చేస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ తేజ ..బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఆరెంజ్ చిత్రంలో చేస్తున్నారు. జెనీలియా హీరోయిన్ గా చేస్తోంది. ఇక పి.సి.శ్రీరామ్ గతంలో ఖుషి, గీతాంజలి వంటి అధ్బుత ప్రేమకథలకు పనిచేసారు. ఇక తెలుగులో రెండేళ్ళ క్రిందట తేజ దర్శకత్వంలో వచ్చిన కేక చిత్రానికి పనిచేసారు. కేక..భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అలాగే దర్శకుడు ధరణి ఇంతకుముందు పవన్ కళ్యాణ్ తో బంగారం అనే చిత్రాన్ని రూపొందించారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu