'పెద్దాయన' టైటిల్ తో వైఎస్ జీవిత చరిత్ర
ఇక గతంలో హీరో రాజశేఖర్ తో లోకనాయకుడు అనే చిత్రం చేస్తానని,అది రాజశేఖర్ రెడ్డి బయోగ్రఫీగా ఉంటుందని పూరీ ప్రకటించారు. అయితే వైయస్ మూడో డెత్ ఏనవర్శరీ వస్తున్నా ఆ ప్రాజెక్టు గురించి ఎక్కడా ప్రస్తావన తేవటం లేదు. రెండు మూడు సార్లు జగన్ ఈ విషయమై జగన్నాద్ తో ప్రస్తావించాడని వార్తలు సైతం వచ్చాయి. అయితే ఎందుకనో కార్యరూపం దాల్చటం లేదు.
పూరీ జగన్నాధ్ సోదరుడు గణేష్... వైయస్ఆర్సీలో యాక్టివ్ మెంబర్, పూరీ ఇంటి పంక్షన్ లకు సైతం వైయస్ జగన్ వచ్చి వెళ్తుంటారు కానీ అతి ముఖ్యమైన ఈ ప్రాజెక్టు మాత్రం కార్య రూపం దాల్చటం లేదు. ఈ ప్రాజెక్టు కోసం వైయస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు ఎదురుచూస్తున్నారన్నది మాత్రం నిజం. ఆ మధ్యన ప్రచారంలో భాగంగా షర్మిల, విజయమ్మ కూడా వచ్చి పూరీ జగన్ ఇంట బస కూడా చేసారు. కానీ ఈ సినిమా విషయం మాత్రం ముందుకు వెళ్లలేదు. రాజశేఖర్ తో కాకపోతే మరో హీరోతో అయినా ఈ సినిమా పూర్తి చేయవచ్చు కదా అన్నది అభిమానులు మాట.


Click it and Unblock the Notifications












