»   » దారుణం: పెళ్ళి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ చనిపోయాడంటూ వదంతులు

దారుణం: పెళ్ళి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ చనిపోయాడంటూ వదంతులు

Posted By:
Subscribe to Filmibeat Telugu

పెళ్ళి చూపులు సినిమాతో తరుణ్ భాస్కర్ ఒక్కసారి టాక్ ఆఫ్ టాలీవుడ్ అయిపోయాడు. చిన్న సినిమా అని తేలిగ్గా తీసుకోవద్దంటూ టాలీవుడ్ లో యువదర్శకుల అవసరం ఎంత ఉందో ఒక్క సినిమాతోనే చెప్పాడు తరుణ్ భాస్కర్. పెళ్ళి చూపులు వచ్చినప్పుడు ఎన్టీఆర్‌లాంటి టాప్ రేంజ్ స్టార్ కూడా ఓపెన్‌గా పెళ్ళి చూపులు సినిమా గొప్పదనం గురించి మాట్లాడి ఆ సినిమాకు హెల్ప్ అయ్యాడు. అయితే ఆ తర్వాత అనుకోకుండానే ఎన్టీఆర్‌ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు తరుణ్ భాస్కర్.

తరుణ్ భాస్కర్

తరుణ్ భాస్కర్

‘పెళ్లిచూపులు' సినిమాను ఐఫా అవార్డుల వాళ్లు గుర్తించకపోవడంపై కొంత కాలం కిందట తరుణ్ భాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఇటీవలే జాతీయ అవార్డుల్లో ఈ చిత్రం రెండు పురస్కారాలు దక్కించుకుంది.ఈ సందర్భంగా ఓ టీవీ ఛానెల్ కు ఇంటర్వ్యూలో ఇచ్చిన తరుణ్.. ఇంతకుముందు తాను చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశాడు.


టీఆర్పీల కోసం

టీఆర్పీల కోసం

తనకు అవార్డు వేడుకలకు సంబంధించి పెద్దగా అవగాహన లేదని.. ఐతే కొంతమంది ఇండస్ట్రీ వాళ్లు ఫోన్ చేసి వాటి గురించి వివరించారని.. తన లాంటి వాళ్లకు అవార్డులిస్తే జనాలు చూడరని.. కాబట్టి టీఆర్పీల కోసం స్టార్ల సినిమాలకు అవార్డులు ఇవ్వక తప్పదని తనకు నచ్చ జెప్పారని అన్నాడు.


ఆ గొడవకు తెర పడినట్టే

ఆ గొడవకు తెర పడినట్టే

ఐతే ఎన్టీఆర్ మూవీ ‘జనతా గ్యారేజ్'కు టీఆర్పీ కోసమే అవార్డు ఇచ్చారన్న ఉద్దేశం వచ్చేలా మాట్లాడాడంటూ దీన్ని పెద్ద వివాదం చేశారు సోషల్ మీడియాలో. దీంతో తరుణ్ వాళ్లకు సారీ చెబుతూ పెద్ద ఫేస్ బుక్ పోస్టు పెట్టాడు. అక్కడితో ఆ గొడవకు తెర పడినట్టే అనుకున్నారు కానీ ఇప్పుడు దారుణమైన తప్పిదం జరిగింది.


తెలుగు వికీ పీడియా

తెలుగు వికీ పీడియా

తెలుగు వికీ పీడియాలో తరుణ్ భాస్కర్ పేజ్ లో పర్సనల్ లైఫ్ కాలమ్ లో తరుణ్ భాస్కర్ చనిపోయినట్లుగా చేసి అక్కడితో ఆగకుందా దాన్ణి స్క్రీన్ షాట్ తీసి మరీ ఫేస్బుక్ లో పెట్టారు. అయితే ఇది ఎవరి పని అన్నది ఇంకా ఖచ్చితంగా తెలియరాలేదు. కానీ జరిగింది మాత్రం దారుణం.


ఏదైనా ఎడిట్ చేయొచ్చు

ఏదైనా ఎడిట్ చేయొచ్చు

అసలింతకీ ఎలా జరిగిందంటే తెలుగు వికీపీడియాలో ఎవరైనా ఏదైనా ఎడిట్ చేయొచ్చు. కొత్త సమాచారాన్నీ, తేడా గా ఉన్న విషయాలను ఎడిట్ చేయటానికి ఆ అవకాశం కల్పించారు. కానీ తర్వాత వికీ టీం ఏవైనా తప్పులుంటే సరి చేస్తుంది. అయితే ఈ ఎడిట్ ఆప్షన్ ని ఇలాంటి పనులకు వాడుకోవటం మాత్రం సరికాదు.English summary
Death Rumours spreding in social meadia, some body changed tarun bhaskar marphed photo in telugu Wikipeadia
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu