Don't Miss!
- News
ఫిబ్రవరి 10నుండి తెలంగాణా వీధుల్లో బీజేపీ జజ్జనకరి జనారే!!
- Finance
Stock Market: ఒడిదొడుకుల్లో స్టాక్ మార్కెట్లు.. ఇక ఒక్కరోజే టైమ్.. జాగ్రత్త ట్రేడర్స్
- Sports
INDvsNZ : ఇదేం ఆట? అంటూ.. హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న ఫ్యాన్స్..
- Automobiles
కుర్రకారుని ఉర్రూతలూగించే 'అల్ట్రావయోలెట్ F77 రీకాన్' రివ్యూ.. ఫుల్ డీటైల్స్
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Akhanda: బడా సంస్థ చేతికి హిందీ డబ్బింగ్ రైట్స్.. బాలయ్య పాత్రను బాలీవుడ్‌లో ఎవరు చేస్తారంటే!
చాలా కాలంగా హిట్‌ను తన ఖాతాలో వేసుకోలేక తెగ ఇబ్బందులు పడుతున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. అయినప్పటికీ వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూనే వచ్చారు. కానీ, విజయం మాత్రం ఆయనకు అందకుండానే ఉండిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి గట్టిగా కొట్టాలని ఫిక్స్ అయ్యారాయన. ఇందులో భాగంగానే తనకు గతంలో రెండు సూపర్ డూపర్ హిట్లు ఇచ్చిన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో జత కట్టి 'అఖండ' అనే మూవీ చేశారు. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ సక్సెస్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ డబ్బింగ్ హక్కులను ప్రముఖ సంస్థ తీసుకుందని తెలుస్తోంది. దీన్ని ఓ బడా హీరో రీమేక్ చేయబోతున్నాడట. ఆ వివరాలు మీకోసం!

‘అఖండ’గా వచ్చేసిన బాలయ్య
నటసింహా బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన సినిమానే 'అఖండ'. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ మూవీని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించాడు. ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా చేసింది. శ్రీకాంత్ నెగెటివ్ రోల్ చేశాడు. ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇది డిసెంబర్ 2న గ్రాండ్‌గా రిలీజ్ అయింది.
బ్రా కూడా లేకుండా కనిపించిన ఈషా: మరీ దారుణమైన ఫోజులతో.. ఆమెనిలా చూస్తే షాక్ అవుతారు!

తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దులిపి
క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'అఖండ' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో స్పందన వస్తోంది. చాలా కాలంగా మాంచి మాస్ మూవీ కోసం చూస్తున్న ప్రేక్షకులకు ఈ సినిమా ఫుల్ మీల్స్ పెట్టేసింది. దీంతో ఈ చిత్రానికి ఆరంభం నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే కలెక్షన్లు భారీగా వచ్చాయి. దీంతో రెండో వారంలోనే బ్రేక్ ఈవెన్‌ను చేరుకుందీ మూవీ.

ప్రపంచ వ్యాప్తంగా బాలయ్య హవా
సీనియర్ హీరో బాలకృష్ణకు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. అందుకే 'అఖండ' మూవీని అమెరికా, ఆస్ట్రేలియాతో పాటు పలు సినిమాల్లో విడుదల చేశారు. అక్కడ కూడా ఈ సినిమా ప్రదర్శితం అయ్యే థియేటర్లు కళకళలాడిపోయాయి. ఫ్యాన్స్ హంగామాతో మోత మోగిపోయాయి. దీంతో కలెక్షన్లు కూడా భారీ స్థాయిలో వస్తున్నాయి.
Disha Patani: దారుణమైన సెల్ఫీతో షాకిచ్చిన హీరోయిన్.. ఏకంగా షార్ట్‌ను కిందకు జరిపి మరీ!

సెంచరీని పూర్తి చేసేసిన అఖండ
రెండు భారీ హిట్ల తర్వాత నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన 'అఖండ' మూవీకి కలెక్షన్లు వెల్లువెత్తాయి. దీంతో రూ. 54 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో వచ్చిన ఈ చిత్రం ఎనిమిది రోజుల్లోనే హిట్ స్టేటస్‌ను అందుకుని లాభాల బాట పట్టింది. పది రోజులకు ఈ మూవీ రూ. 56 కోట్లకు పైగా షేర్‌తో పాటు వంద కోట్ల రూపాయల గ్రాస్‌ను అందుకుంది.

బడా సంస్థ చేతికి డబ్బింగ్ రైట్స్
హిందుత్వం గొప్పదనాన్ని వివరిస్తూ మాస్ ఎలిమేంట్స్‌తో తీసిన 'అఖండ' మూవీ సూపర్ డూపర్ హిట్ అవడంతో అన్ని ఇండస్ట్రీలూ దీనిపై ఫోకస్ చేశాయి. ఇందులో భాగంగానే ఈ సినిమా రీమేక్ హక్కులకు పోటీ నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో 'అఖండ' హిందీ డబ్బింగ్ హక్కులను పెన్ ఇండియా లిమిటెడ్ (పెన్ స్టూడియోస్' తాజాగా సొంతం చేసుకుందని తెలుస్తోంది.
Bigg Boss: షణ్ముఖ్‌కు మరో దెబ్బ.. శ్రీరామ్ ఫ్యాన్స్ ఓట్లు ఆ కంటెస్టెంట్‌కు.. మరింత పడిపోయిన ర్యాంక్
Recommended Video

బాలయ్య పాత్రలో బాలీవుడ్ స్టార్
'అఖండ'ను హిందీలో డబ్బింగ్ చేయడానికి పెన్ ఇండియా సంస్థ ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈ హక్కులను ఇద్దరు హీరోలను దృష్టిలో పెట్టుకుని కొనుగోలు చేసినట్లు ఓ న్యూస్ వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. ఈ చిత్రాన్ని అక్షయ్ కుమార్‌తో కానీ, అజయ్ దేవగణ్‌తో కానీ రీమేక్ చేసే అవకాశాలు ఉన్నాయని బీ టౌన్ సమాచారం.