»   » హన్సికకి కేరళ స్వీట్ అనుభవాలు

హన్సికకి కేరళ స్వీట్ అనుభవాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హాట్ హన్సిక రీసెంట్ గా ఓ మై ప్రెండ్ చిత్రం కోసం కేరళలోని కొచ్చి వెళ్ళింది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో సిద్దార్ధ, శృతిహాసన్, హన్సిక నటిస్తున్నారు. వీరందరికి అక్కడ ఓ రిసార్ట్ లో కొద్ది రోజులు ఉన్నారు. అయితే హన్సిక అక్కడకి అరవై కిలోమీటర్లు దూరంలో ఉన్న భగవతి దేవి దేవాలయానకి వెళ్ళాలని నిర్ణయించుకుంది. శుక్రవారం బ్రేక్ తీసుకుని అక్కడికి వెళ్ళింది. అయితే అక్కడ ఆమె ఎవరూ గుర్తు పట్టరనుకుందిట. కానీ అక్కడ జనం హన్సికని గుర్తుపట్టి అలా చూస్తుండిపోయారట. కొంతమందైతే వచ్చి షేక్ హ్యాండ్ లు ఇచ్చారట.

మరికొంతమంది ఆటో గ్రాఫ్ లు అడిగారట. దేవస్ధానం వాళ్ళయితే ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసి పూజలు చేసారట. ఇవన్నీ చూసిన హన్సిక షాక్ అయిపోయిందిట. తనకీ ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నారని ఊహించలేదంటోంది.ఆమె నటించిన చిత్రాలు అక్కడ అతి కొద్దిగా మాత్రమే రిలీజ్ అయ్యాయి. పూరీ దర్సకత్వంలో ఆమె ఎప్పుడో చేసిన దేశముదురు చిత్రం మాత్రం అక్కడ బాగా ఆడింది.అది గుర్తు పెట్టుకున్నారో ఏమో గానీ హన్సికకు మాత్రం అక్కడ ఘన స్వాగతం లభించందిట. ఈ విషయం చెప్తూ హన్సిక మురిసిపోయింది. అవన్నీ స్వీట్ ఎక్సపీరియన్స్ లనీ, వాటిని అప్పుడప్పుడూ గుర్తుచేసుకుంటే ఆనందం లభిస్తుందని అంటోంది.

English summary
Speaking to Media Hansika said, 'My earlier film has been released here in Kerala. A lot of people recognized me when I got down from my car and women came forward to shake hands. It was a pleasant surprise.'
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu