Just In
- 3 hrs ago
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- 3 hrs ago
ఆస్కార్ బరిలో ‘ఆకాశం నీ హద్దురా’.. సూర్య కష్టానికి ప్రతిఫలం లభించేనా?
- 4 hrs ago
అప్డేట్ ఇస్తావా? లీక్ చేయాలా?.. ఆచార్యపై కొరటాలను బెదిరించిన చిరంజీవి
- 5 hrs ago
నిద్రలేని రాత్రులెన్నో.. ఇప్పుడు నవ్వొస్తుంటుంది.. ట్రోల్స్‌పై సమంత కామెంట్స్
Don't Miss!
- News
కువైట్‌లో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ నేతలు
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Automobiles
కొత్త సఫారి ఎస్యూవీ ఆవిష్కరించిన టాటా మోటార్స్; లాంచ్ ఎప్పుడంటే ?
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఐటెమ్ సాంగ్‌తో ఊపేయనున్న అనసూయ.. రంగమ్మత్తను మించేలా డిజైన్ చేసిన డైరెక్టర్
కృష్టవంశీ సినిమాలంటే తెలుగుదనం ఉట్టిపడుతుంది. ఏ సినిమా తీసినా అందులో ఎమోషన్స్ ఉండేలా చూసుకోవడం, అచ్చ తెలుగు బంధాలను చూపించడమే ఆయన ప్రత్యేకత. అలాంటి కృష్ణవంశీ.. తన సినిమాలోని నటీనటులను ఏవిధంగా నటింపజేస్తారో అందరికీ తెలిసిందే. అంతకు ముందెన్నడూ చూడని కొత్త నటులను చూపిస్తాడు కృష్ణవంశీ. ఆయన సినిమాలో చిన్న పాత్రనైనా చేయాలని అందరూ కోరుకునే విలక్షణ దర్శకుడు ఆయన. అయితే గత కొంత కాలం నుంచి విజయాల లేక వెనకబడ్డ కృష్ణవంశీ.. తన పనితనాన్ని చూపేందుకు సిద్దమవుతున్నాడు.

స్నేహితుడు, భార్యను ప్రధాన పాత్రలో చూపెడుతూ.
కృష్ణవంశీ-ప్రకాష్ రాజ్ క్లోజ్ ఫ్రెండ్స్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. మధ్యలో ఏవో గొడవలు జరిగి.. కొన్ని రోజులు దూరంగా ఉన్నారు. మళ్లీ ఒక్కటయ్యారనుకోండి అది వేరే సంగతి. తాజాగా ప్రకాశ్ రాజ్‌తో పాటు తన భార్య రమ్యకృష్ణను ప్రధాన పాత్రలో చూపెడుతూ ఓ చిత్రాన్ని ప్లాన్ చేశాడు.

మరాఠి చిత్రానికి రీమేక్..
‘నట సామ్రాట్' అనే మరాఠి సినిమా ఆధారంగా రంగమార్తాండను తెరకెక్కించబోతోన్నాడు కృష్ణవంశీ. ఈ సినిమాలో కీలక పాత్రలో రమ్యకృష్ణ.. ప్రకాష్ రాజ్.. బ్రహ్మానందం.. రాహుల్ సిప్లిగంజ్, అలీ రెజాలు నటిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాలో అనసూయ కూడా నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

రంగమ్మత్తగా అదరగొట్టిన అనసూయ..
బుల్లితెరపై గ్లామర్‌ను వొలకబోయడమే కాదు.. వెండితెరపై నటనతో కంటతడి పెట్టించగలదు కూడా. అనసూయలో అంతటి నటనను ఉందని రంగస్థలంలోని రంగమ్మత్త పాత్రను పోషించిన తరువాతే అందరికీ తెలిసింది. అంతకుముందు క్షణం లాంటి సినిమాలో అద్భుతమైన నటనను కనబర్చినా.. రంగమ్మత్త ఆమె కెరీర్‌లో ఎప్పటికీ నిలిచిపోయేలా నటించింది.

తాజాగా కృష్ణవంశీ చేతిలో..
అలాంటి ఓ అద్భుత నటి కృష్ణవంశీ లాంటి దర్శకుడి చేతిలో పడితే.. అది ఇంకో రేంజ్‌లో ఉంటుంది. ఈ పాత్ర రంగమ్మత్తను మించేలా ఉంటుందని సమాచారం. అప్పట్లో నాటకాల్లో నటించే నటీ నటులు పడ్డ ఇబ్బందులు మరియు ఇతరత్ర విషయాలను అనసూయ పాత్ర ద్వారా కృష్ణవంశీ చూపించబోతున్నాడని తెలుస్తోంది. అనసూయపై ఓ అదిరిపోయే ఐటెం సాంగ్ కూడా ఉంటుందని టాక్. ఇక ఇన్ని ప్రత్యేకతలతో వస్తోన్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఏర్పడుతున్నాయి.