twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినీ సమస్యలపై ఎవరెవరో ఏదేదో మాట్లాడినా.. మెగాస్టార్ మాత్రం అలా.. పేర్ని నాని ఆసక్తికర కామెంట్లు!

    |

    ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ ముగిసింది. అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వివరాలు వెల్లడించారు. ఈ భేటీలో జరిగిన అన్ని విషయాలను పేర్ని నాని వెల్లడించారు. అలాగే చిరంజీవి మీద ప్రసంసల వర్షం కురిపించారు. ఆ వివరాలు..

    Recommended Video

    Tollywood Meets CM YS Jagan, 20 శాతం షూటింగ్ AP లోనే..!| Filmibeat Telugu
    జగన్‌ దృష్టికి

    జగన్‌ దృష్టికి

    ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ ముగిసింది. సుమారు గంటకు పైగా జరిగిన సమావేశంలో.. చిరంజీవి, ప్రభాస్‌, మహేశ్‌బాబు, రాజమౌళి, కొరటాల శివ, పోసాని కృష్ణమురళి, ఆర్‌ నారాయణ మూర్తి, నిరంజన్‌ రెడ్డి, అలీ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పేర్ని నాని మెగాస్టార్ చిరంజీవి సినీ పరిశ్రమ సమస్యలన్నీ సీఎం జగన్‌ దృష్టికి తీసుకువచ్చారని పేర్కొన్నారు.

    ప్రత్యేక స్థానం ఉండేలా

    ప్రత్యేక స్థానం ఉండేలా

    ఆంధ్రప్రదేశ్‌లో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని సినిమాటోగ్రఫీశాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని సినిమాటోగ్రఫీశాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. చిన్న సినిమాకు కూడా ప్రత్యేక స్థానం ఉండేలా చూడాలని సినీ ప్రముఖులని జగన్ కోరారని దానికి సినీ ప్రముఖులు అందరూ ముక్త కంఠంతో త్వరలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని అన్నట్టు వెల్లడించారు.

    జగన్‌తో చర్చించారు

    జగన్‌తో చర్చించారు


    కోరినట్లు తెలిపారు. సినీ పరిశ్రమకు అండగా ఉంటానని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీచ్చారని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి ఏం కావాలన్నా సహకారం అందిస్తామని సీఎం జగన్‌ చెప్పారని తెలిపారు. మెగాస్టార్‌ చిరంజీవి అందర్నీ సమన్వయం చేశారని, సినీ సమస్యలపై ఎవరెవరో ఏదేదో మాట్లాడినా.. మెగాస్టార్ మాత్రం సమస్య పరిష్కారానికి తీవ్ర కృషి చేశారని ఆయన పేర్కొన్నారు. సినీ పరిశ్రమ ప్రముఖులు అందురూ కూడా ప్రతి సమస్యను సీఎం వైఎస్‌ జగన్‌తో చర్చించారని పేర్కొన్నారు.

     చిన్న సినిమాల అంశంలో

    చిన్న సినిమాల అంశంలో

    సినీ పరిశ్రమ సమస్యలపై కమిటీ కూడా వేశామని గుర్తుచేశారు. ఇక చిన్న సినిమాల గురించి తన ఆవేదనను నటుడు నారాయణమూర్తి సీఎంకు వివరించారని సీఎం కూడా స్పందించి చిన్న సినిమాలకూ అవకాశం ఉండాలని సినీ ప్రముఖులను కోరారన్నారు. అయితే దానికి సినీ ప్రముఖులంతా స్పందించి మాట్లాడారని చిన్న సినిమాలు బతకాలని వారూ చెప్పారని, దానికి ఏమి చేయాలి అనే విషయం మీద ఒక నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఇక చిన్న సినిమాల అంశంలో తామంతా మాట్లాడుకుంటామని ఒక నిర్ణయంతో ముందుకు వస్తామని చెప్పారని వెల్లడించారు.

     నెలాఖరు లోగా

    నెలాఖరు లోగా


    ఏపీలోనూ సినిమా షూటింగులు జరపాలని సినీ ప్రముఖులను సీఎం జగన్‌ కోరారని మరీ ముఖ్యంగా విశాఖలో పెద్ద ఎత్తున షూటింగులు జరిగేలా చూడాలని సీఎం కోరారని దానికి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు అని అన్నారు. రాష్ట్రంలో తెలుగు సినిమాల షూటింగులు పెద్ద ఎత్తున జరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం కోరగా దానికి సినీ ప్రముఖులు స్పందిస్తూ తమకు హైదరాబాద్‌ ఎంతో ఏపీ కూడా అంతేనని ఏపీలో కూడా షూటింగులు జరుపుతామని సీఎంకు చెప్పారని పేర్ని నాని వివరించారు. అలాగే ఈ రోజు చర్చలో ఉన్న అంశాలు అన్నిటి మీదా నెలాఖరు లోగా ఒక కార్యరూపం దాల్చే అవకాశం ఉందని వెల్లడించారు.

    English summary
    Perni Nani praises chiranjeevi after meeting with ap cm ys jagan
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X