»   »  తెలుగు టీవీ నటిపై పెట్రోల్‌ దాడి

తెలుగు టీవీ నటిపై పెట్రోల్‌ దాడి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌ : టీవీ ఆర్టిస్టుపై పెట్రోలు పోసిన సంఘటన ఇప్పుడు అందరినీ షాక్ కు గురిచేసింది. ఈ దాడికి కారణం .స్నేహ బంధం కావటం విషాదం. హైదరాబాద్ లో ఉంటున్న ఆమె ఓ టీవీ నటి. ఆమెపై దాడి చేసిన అతడో అర్చకుడి కుమారుడు. ఇద్దరి మధ్యా కొన్నాళ్లు సాఫీగా సాగిన స్నేహబంధంలో వివాదాలు రేగాయి. దీంతో.. ఆ యువకుడు ఆమెపై పెట్రోల్‌ పోసి నిప్పంటించే ప్రయత్నం చేశాడు. ఆదివారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ ప్రాంతంలో జరిగిందీ ఘటన.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

వివరాల్లోకి వెళితే.... కరీంనగర్‌ జిల్లాకు చెందిన కార్తీక్‌ అలియాస్‌ శేఖర్‌ హైదరాబాద్‌లో చదువుకుంటున్నాడు. వరంగల్‌ జిల్లాకు చెందిన యువతి కూడా హైదరాబాద్‌లోనే చదువుకుంటూ ఓ టీవీ సీరియల్‌లో నటిస్తోంది. కొన్నాళ్లుగా స్నేహంగా ఉంటున్న వీరి మధ్య ఇటీవల గొడవలు మొదలయ్యాయి.

Petrol attack on telugu Tv artist

ఈ నేపథ్యంలో ఆదివారం కార్తీక్‌ ఆమెతో మాట్లాడాలని చెప్పి, జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ సమీపానికి రావాల్సిందిగా కోరాడు. ఆమె వచ్చాక వారి మధ్య వాగ్యుద్ధం జరిగింది. కార్తీక్‌ తన వద్ద సిద్ధంగా ఉంచుకున్న పెట్రోలును ఆమెపై పోసి నిప్పంటించడానికి ప్రయత్నించాడు. స్థానికులు దీన్ని గమనించి అతణ్ని పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చి ఇద్దరినీ వారికి అప్పగించారు.

English summary
A frined named karthik attacked tv artist in hyderabad yesterday.
Please Wait while comments are loading...