బాలయ్య హీరోయిన్ ‘ఫోబియా’ (ట్రైలర్)
హైదరాబాద్: లెజెండ్, లయన్ చిత్ల హీరోయిన్ రాధిక ఆప్టే ప్రస్తుతం హిందీలో 'ఫోబియా' అనే ఓ సైకలాజికల్ థ్రిల్లర్ లో నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదల చేసారు. ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉండటంతో అందరి దృష్టి ఈ సినిమా వైపు మళ్లింది.
ఇంతవరకూ ఎవరూ చేయని విభిన్నమైన పాత్రలో రాధిక ఆప్టే కనిపించబోతోంది. ఒక యాక్సిడెంట్ కు గురైన ఆమె జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందనే ఆసక్తికరమైన కథనంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో రాధిక ఆప్టే తన చుట్టూ ఉన్న పరిసరాలను, మనుషులను చూసి తీవ్రంగా భయపడే పాత్రలోనటిస్తోంది.

ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇప్పటి వరకు ఇలాంటి సినిమా ఇండియాలో రాలేదు. హాలీవుడ్ సినిమాలను ఇన్స్‌స్పిరేషన్‌గా ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కృపలాని డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఈరోస్ సంస్థ నిర్మిస్తోంది. రాధికా ఆప్టే, సత్యదీప్ మిశ్రా, అంకుర్ వికల్, యశస్విని దయామ, నవేది భట్టాచార్య తదితరులు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











