»   » ఫొటో: మాజీ హీరోయిన్ రంభ ఫ్యామిలీ

ఫొటో: మాజీ హీరోయిన్ రంభ ఫ్యామిలీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హాట్ అండ్ సెక్సీ అంద చందాలతో పాటు ఆకట్టుకునే అభినయంతో ఒకప్పుడు దక్షిణాదిని ఓ ఊపు ఊపిన తార రంభ. కొన్నాళ్ల క్రితం పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. ఇదిగో ఇక్కడ ఆమె ఫ్యామిలీ ఫొటో మీరు చూడవచ్చు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

కెనడాలో సెటిలైన ఎన్నారై బిజినెస్‌మేన్ ఇంద్రన్ పద్మనాథన్‌ను రంభ ఏప్రిల్ 8, 2010లో వివాహ మాడింది. తిరుపతిలో వీరి వివాహం అంగరంగ వైభంగా జరిగింది. పెళ్లి తర్వాత ఆమె భర్తతో కలిసి టోరంటో వెళ్లి పోయింది. ఈ దంపతుల దాంపత్యానికి గుర్తుగా జనవరి 14, 2011న ఆడ పిల్ల జన్మించింది.

Photo: Actress Rambha Family Photo!

రాజేంద్ర ప్రసాద్ సరసరన సూపర్ హిట్ చిత్రం ‘ఆ ఒక్కటి అడక్కు' చిత్రంతో 1993లో సినీ పరిశ్రమలో అరంగేట్రం చేసింది. తెలుగులో స్టార్ హీరోలతో నటించి మంచి గుర్తింపు తెచ్చకుంది.

ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ‘బొంబాయి ప్రియుడు' చిత్రంలో నటించింది. ‘బావగారు బాగున్నారా' చిత్రంలో చిరంజీవి సరసన నటించిన రంభ స్టార్హీరోయిన్‌గా ఎదిగింది.

తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లోనే కాక, బాలీవుడ్‌తో పాటు భోజ్‌పూరిలో కూడా నటించిన అనుభవం రంభకు ఉంది.

English summary
Actress Rambha who quit acting post marriage delivered her second child two months ago. She named her second daughter as 'Sasha' and here is the lovely family photo.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu