»   » అనుష్క...ఫ్యామిలీ టూర్...ఫన్నీ ఫొటో

అనుష్క...ఫ్యామిలీ టూర్...ఫన్నీ ఫొటో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సినిమా చిత్రీకరణల నుంచి కాస్త విరామం దొరికితే చాలు ఇంటికి ప్రయాణం కట్టేస్తుంటుంది అనుష్క. ఆదివారం కాస్త సమయం చిక్కడంతో తన కుటుంబ సభ్యులతో అలా సరదాగా షికారుకెళ్లింది. ఈ సందర్భంగా తన కుటుంబ సభ్యులు వినూత్నంగా దిగిన ఈ ఫొటోను ఫేస్‌ బుక్‌లో పెట్టింది అనుష్క.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

''నేను దర్శకుల నటిని. వాళ్లేం చెబితే అదే చేస్తా. సొంత తెలివితేటలు వాడను...'' అంటోంది అనుష్క. గత రెండేళ్లుగా నిర్విరామంగా పనిచేస్తోంది జేజమ్మ. చేతిలో పెద్ద సినిమాలున్నాయి. మరోవైపు తనకోసం కొత్త కథలు సిద్ధం అవుతున్నాయి. అందుకే తీరిక లేకుండా కష్టపడుతోంది. ''అవకాశాలు ఉన్నప్పుడే కష్టపడాలి.. చేద్దామనుకొన్నా సినిమాలు రానప్పుడు ఎలాగూ ఖాళీగా కూర్చోవాలి కదా..'' అంటోంది.

Photo: Anushka happy with her family

పరిశ్రమకొచ్చి పదేళ్లయిపోయింది. సీనియారిటీ వచ్చేసిందా? అని అడిగితే ''పదేళ్లకే సీనియర్‌ అనుకొంటే ఎలా..? నాకంటే ముందు నుంచీ ఉన్నవాళ్లు ఇంకేమనుకోవాలి..?'' అంటూ నవ్వేస్తోంది.

దర్శకులకు సలహాలేమైనా ఇస్తారా? అని అడిగితే.. ''నేను అలాంటి పొరపాటు కల్లో కూడా చేయను. ఎందుకంటే సినిమాను ఎలా తీర్చిదిద్దాలో, ఏ పాత్రకు ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలో దర్శకులకు బాగా తెలుసు. నేను కలుగజేసుకొని చెప్పేంత అవసరం లేదు.. నాకు అన్ని విషయాలూ తెలియవు. అలాంటప్పుడు ఇంకెందుకు.. నాపనేదో నేను చేసుకోక...'' అంటోంది అనుష్క.

''సినీ పరిశ్రమలో ఎవరి స్థానం శాశ్వతం కాదు... మనకు చోటు లేదనుకొన్న క్షణంలో తట్టా బుట్టా సర్దేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి'' అంటోంది అనుష్క. 'బాహుబలి', 'రుద్రమదేవి', 'సైజ్‌ జీరో' చిత్రాలతో బిజీగా ఉంది అనుష్క. తెలుగునాట హీరోయిన్స్ ల్లో అగ్రస్థానం నిస్సందేహంగా అనుష్కదే అని చెప్పొచ్చు. పారితోషికంలోనూ, క్రేజ్‌ విషయంలోనూ అనుష్కకు ఎవరూ సాటిరారు. అయితే అనుష్క మాత్రం 'పరిశ్రమలో శాశ్వత స్థానాలు ఎవ్వరికీ ఉండవు' అంటోంది.

అనుష్క చెబుతూ ''నేనే సినిమా చేసినా.. అదే నా చివరి అవకాశం అనుకొంటా. అలా అనుకొన్నప్పుడే కష్టపడగలం. నేను ఎలా నటించినా, ఈ సినిమా ఏమైపోయినా.. నాకొచ్చే అవకాశాలు నాకు వచ్చేస్తాయి కదా అనుకొంటే వంద శాతం ప్రతిభ ప్రదర్శించలేం. చిత్ర పరిశ్రమలోనే కాదు.. ఏ రంగంలో అయినా అలసత్వానికి చోటివ్వకూడదు. కుందేలు, తాబేలు కథ తెలుసు కదా. మనల్ని దాటుకొని వెళ్లిపోవడానికి ఎవ్వరికీ అవకాశం ఇవ్వకూడదు'' అని హితోపదేశం చేస్తోంది.

Photo: Anushka happy with her family

అరుంధతి నుంచి అనుష్క స్టేచర్ మారిపోయింది. దాంతో పాటే ఆమెకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. ఈ నేపధ్యంలో ఆమె మరింత కష్టపడుతూ విభిన్నమైన పాత్రలు ఎంపికచేసుకుంటోంది. అంతేకాదు.. పాత్రల ఎంపికలో తన పంథాను మార్చుకుంటోంది అనుష్క. చారిత్రక చిత్రాలు, అభినయ ప్రధాన పాత్రలవైపు మొగ్గుచూపుతోంది. వైవిధ్యమైన కథాంశాలతో విజయాల్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

ఈ నేపద్యంలో అనుష్క సుందరి హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం సైజ్ జీరో. ఇటీవలే ఈ సినిమా ముహూర్తాన్ని జరుపుకుంది. భారీకాయురాలైన ఓ యువతి ఉన్నతమైన లక్ష్యం కోసం తన శరీర బరువును తగ్గించుకునేందుకు చేసే ప్రయత్నాల నేపథ్యంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో 100 కేజీల బరువుండే బొద్దుగుమ్మ, జీరోసైజ్ యువతిగా అనుష్క పాత్ర చిత్రణ రెండు భిన్న పార్శాల్లో సాగనుందని తెలిసింది. ఆమె పాత్ర స్ఫూర్తివంతంగా, సవాలుతో కూడుకొని ఉంటుందని చిత్ర బృందం వెల్లడించింది.

మొదట బొద్దుగుమ్మపై వచ్చే సన్నివేశాల్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ పాత్రలో సహజత్వం కోసం అనుష్క బరువు పెరిగేందుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఇందుకోసం ప్రత్యేకంగా కొన్ని వ్యాయామాలు, కసరత్తుల్ని ప్రారంభించిందట ఈ భామ. ఆహార నియమాల్లో కూడా మార్పులు చేసుకోనున్నట్లు తెలిసింది.

అంతవరకూ బాగానే ఉంది. హఠాత్తుగా వంద కేజీల బరువు పెరిగి, తగ్గటమంటే మాటలు కాదు..ఆరోగ్యపరంగా సమస్యలు వస్తాయి అంటున్నారు ఆమె అభిమానులు. యాభై నుంచి అరవై కేజీలు ఉండే ఈమె ..తన బరువుని వంద దాటిస్తే సమస్యలు ఖచ్చితంగా వస్తాయంటున్నారు. అయితే రోజూ యోగా చేసి,బాడీని స్టిఫ్ గా ఉంచుకునే ఆమెకు ఈ విషయం తెలియదంటారా..

Photo: Anushka happy with her family

అనుష్క మాట్లాడుతూ....నా కెరీర్‌లో మరో భిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాను. భవిష్యత్‌లో గొప్ప సినిమాలో నటించానని గర్వంగా చెప్పుకునే విధంగా నా క్యారెక్టర్ ఉంటుంది అని తెలిపింది. ఆర్య హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఓ ప్రత్యేక పాత్రలో శృతిహాసన్ కనిపించనుంది.

అనుష్క సరసన తమిళ నటుడు ఆర్య హీరోగా నటిస్తున్నారు. ‘వర్ణ' తర్వాత వీరి కలయికలో వస్తున్న సినిమా ఇది. శృతి హాసన్ అతిథి పాత్ర ‘సైజ్ జీరో'కు ప్రత్యేక ఆకర్షణ. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ప్రసాద్ వి పోట్లురి నిర్మిస్తున్నారు. యం.యం.కీరవాణి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో సినిమాను నిర్మించనున్నారు.

రొమాంటిక్‌ కామెడీ నేపథ్యంలో సాగే చిత్రమిది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తారు. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. ఛాయాగ్రహణం: నిర్వాషా, కళ: ఆనంద్‌సాయి, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: సందీప్‌ గుణ్ణం

English summary
Anusha very much happy to spend a day with her family . This is the fun photo of her Family.
Please Wait while comments are loading...