»   » ఫొటో: హీరోయిన్ అదా శర్మ ఐదో పెళ్లి

ఫొటో: హీరోయిన్ అదా శర్మ ఐదో పెళ్లి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : కుర్రాళ్లకు తన ఒంపుసొంపులతో హార్ట్ ఎటాక్ తెప్పించిన అదాశర్మ... ఆ మధ్యన బన్నీ సన్నాఫ్ సత్యమూర్తిలోనూ కనిపించి అలరించింది. అందులో పెళ్లి కూతురు అలంకరణతో అందరి మనస్సులూ దోచుకుంది. ఈ 26 సంవత్సరాల ముద్దుగుమ్మ ఐదోసారి పెళ్లికి రెడీ అయ్యింది. షాక్ అవకండి..ఈ పెళ్లి వెండితెర కోసమే. ఈ విషయాన్ని ఆమె తెలియచేస్తూ...ట్వీట్ చేసింది. మీరే ఓ లుక్కేయండి.

అదాశర్మ...క్షణం, గరం కూడా ఆమె పెళ్లి కూతురు గా కనిపిస్తుంది. అలాగే హరీష్ శంకర్...సుబ్రమణ్యం ఫర్ సేల్ చిత్రంలోనూ ఆమె పెళ్లికూతురుగా కనిపించనుంది. ఇందులో ఆమె గెస్ట్ రోల్ లో కనిపించనుంది.

మహేష్‌భట్ రూపొందించిన హారర్ సినిమా 1920తో నటిగా కెరీర్ ప్రారంభించింది. హార్ట్ ఎటాక్‌తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈ ముద్దుగుమ్మ ఇటీవల విడుదలైన సన్నాఫ్ సత్యమూర్తిలో అతిథి పాత్రలో మెరిసింది. నటిగా వైవిధ్యానికే నా తొలి ప్రాధాన్యం అంటూ ప్రత్యేకతను చాటుకుంటోంది.

photo:Fifth marriage of Adah Sharma

అదా శర్మ మాట్లాడుతూ.... పుట్టింది... కేరళలోని పాలక్కాడ్. అక్కడి నుంచి మా కుటుంబం ముంబైకి మకాం మారింది. అక్కడే పెరిగాను. నాన్న నేవీలో కెప్టెన్. అమ్మ ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, తాతయ్య, నానమ్మ ప్రొఫెసర్లు, మామయ్య సైంటిస్ట్. చదపవంతా...ముంబై యూనివర్సిటీలో మానసిక శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశాను. గోపీకృష్ణా డ్యాన్స్ అకాడమీలో కథక్‌లో గ్రాడ్యుయేషన్ చదువుతున్నాను. జిమ్నాస్టిక్స్‌లోనూ నాకు మంచి ప్రవేశముంది అంది.

ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు గురించి చెప్తూ....ఆది హీరోగా రూపొందుతున్న గరమ్ చిత్రంలో నటిస్తున్నాను. హరీష్ శంకర్ దర్శకత్వంలో సాయిధరమ్‌తేజ్ నటిస్తున్న సుబ్రమణ్యం ఫర్ సేల్‌లో కీలకమైన అతిథి పాత్రలో కనిపించబోతున్నాను అన్నారామె.

English summary
Adah Sharma posted a picture on her official Twitter page by tweeting “Getting married today…again!! 5th time bride”.
Please Wait while comments are loading...