»   » త్రిష కి ఎక్కడైతే టట్టూ ఉందో అక్కడే అనసూయ కూడా... (ఫొటో)

త్రిష కి ఎక్కడైతే టట్టూ ఉందో అక్కడే అనసూయ కూడా... (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : యాంకర్ నుంచి నటిగా టర్న్ అయిన అనసూయ...ఎప్పుడు ఏదో విషయంలో మీడియాని ఎట్రాక్ట్ చేస్తూనే ఉంటుంది. జబర్దస్ద్ కామెడీ షోతో అంతులేని పేరు తెచ్చుకున్న ఆమె తన కాంట్రావర్శి స్టేట్ మెంట్లలతో తర్వాత కూడా వార్తల్లో ఉండిపోయింది. ఇప్పుడు ఆమె తాజాగా డైనమైట్ చిత్రం ఆడియో పంక్షన్ కు హాజరైంది. అక్కడ యాంకరింగ్ చేసింది. అప్పుడు అందరి దృష్టీ ఆమె ఛాతిపైన ఉన్న టట్టూ పైనే ఉండటం విశేషం. ఇంతకీ ఆ టట్టూ మీద ఏం రాసుందీ అంటారా..నీలూ అని.. అలాగే త్రిష ఎక్కడైతే టట్టూ వేయించుకుందో అదే ప్లేసులో ఆమె టట్టూ వేయించుకోవటం మరో విశేషం.

డైనమైట్ విషయానికి వస్తే...


మంచు విష్ణు హీరోగా దేవా కట్టా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం డైనమేట్. మోహన్‌బాబు సమర్పణలో 24 ఫ్రేమ్స్ పతాకంపై మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రణీత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమిళ చిత్రం అరిమనంబి ఆధారం. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆడియో విడుదలైంది. ఈ సందర్భంగా చిత్రం టీజర్ ని విడుదల చేసారు. ఈ ట్రైలర్ ఓ రేంజిలో పేలింది.


Photo:Hot Anchor’s Anasuya Tatoo

మంచు విష్ణు మాట్లాడుతూ .....డైనమేట్ లాంటి ఓ యువకుడి కథతో తెరకెక్కుతున్న చిత్రమిది. కథకు తగ్గ టైటిల్ కుదిరింది. కథ డిమాండ్ మేరకు కొత్త లుక్ కోసం పాత్ర పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఇందులో నా పై చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు కొత్తగా వుంటాయి. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని త్వరలో ... ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నాంఅన్నారు.


మంచు విష్ణు హీరోగా డిఫరెంట్ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఒక ఇమేజ్ సొంతం చేసుకున్నారు. 2014లో పాండవులు పాండవులు తుమ్మెద, రౌడీ, అనుక్షణం, ఎర్రబస్సు చిత్రాల్లో నటించిన ఈ డైనమిక్ హీరో ప్రతి సినిమాలోనూ డిఫరెంట్ లుక్, స్టయిల్‌తో ఆకట్టుకున్నారు.ప్రస్తుతం దేవా కట్టా దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం తమిళంలో మంచి విజయాన్ని సాధించిన ‘అరిమ నంబి' చిత్రానికి రీమేక్‌గా రూపొందుతోంది.


Photo:Hot Anchor’s Anasuya Tatoo

ఆ మధ్యన ఈ సినిమాకి సంబంధించి హీరో విష్ణు లుక్ చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ లుక్ కి అమేజింగ్ రెస్పాన్స్ వస్తుంది. అలాగే ఈ సినిమాలో విష్ణు డిఫరెంట్ గా చెవిపోగులతో కనిపించనున్నాడు. హీరో కొత్త లుక్ లో కనబడితే బావుంటుందని భావించిన డైరెక్టర్ దేవాకట్టా తన ఆలోచనని విష్ణుకి తెలియజేయడం, సినిమాల్లో తన పాత్ర, లుక్ పరంగా భిన్నంగా కనబడాలనుకునే హీరో మంచు విష్ణు దానికి సరేననడం జరిగింది.


విష్ణు పోషిస్తున్న పాత్ర, ఆయన అభినయం, ఆహార్యానికి తగినట్లుగానే ‘డైనమైట్‌' టైటిల్‌ను నిర్ణయించినట్లు దేవా కట్టా చెప్పారు. ‘‘చెవిపోగు, చేతి పొడవునా టాటూతో డిఫరెంట్‌ లుక్‌తో విష్ణు కనువిందు చేయనున్నారు. ఇందులో యాక్షన్‌ సన్నివేశాల కోసం ఆయన స్పెషల్‌ ట్రైనింగ్‌ కూడా తీసుకున్నారు. ప్రేక్షకులు, అభిమానులను అలరించే విధంగా ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను రూపొందిస్తున్నాం'' అని తెలిపారు.

English summary
The other day Anasuya hosted Dynamite audio event and what attracted many is the tattoo on her chest which reads as Neelu.
Please Wait while comments are loading...