»   » తన పిల్లలిద్దరిని ముద్దు,గారం చేస్తూ మహేష్(ఫొటో)

తన పిల్లలిద్దరిని ముద్దు,గారం చేస్తూ మహేష్(ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తన పిల్లలంటే మహేష్ కు విపరీతమైన ఇష్టం. ఎంత బిజి షెడ్యూల్ లో అయినా కుటుంబానికి,పిల్లలకు తగినంత ప్రయారిటీ ఇస్తూంటాడు. ఏ ఇతర హీరో కూడా తన కుటంబంతో ఇంతలా గడపడేమో అనిపిస్తుంటుంది. తన కూతురు సితారని భుజాలపై ఎక్కించుకుని, తన కొడుకు గౌతమ్ కృష్ణ ప్రక్కనే నడుస్తున్న ఈ ఫొటో చూడండి మీకే అర్దం అవుతుంది.

ఇక మహేష్ తాజా చిత్రం విశేషాలకు వస్తే...

మహేష్ బాబు - ‘మిర్చి' ఫేం కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలు మరియు రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. తాజాగా ఈ చిత్ర టీం యాక్షన్ ఎపిసోడ్ షూట్ లో బిజీగా ఉన్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Photo: Mahesh Babu with his Kids!

ఇక ఇటీవలే ఈ చిత్ర టీం రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసింది. ఈ సినిమాని జూలై 17న రిలీజ్ చెయ్యడానికి సన్నాహలు చేస్తున్నారు. కుటుంబ అనుబంధాల నేపథ్యంలో సాగే కథల్లో ఇట్టే ఇమిడిపోతారు మహేష్‌. 'మురారి', 'దూకుడు', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రాలతో ఆ విషయం రుజువైంది. అలా మరోసారి ఇంటిల్లిపాదినీ అలరించేలా ఓ చిత్రం చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఆ చిత్రాన్ని మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది.

మహేష్‌ సరసన శ్రుతి హాసన్‌ హీరోయిన్ గా నటిస్తోంది. భారీ హంగులతో రూపొందుతున్న ఆ పోరాటాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని చిత్రబృందం చెబుతోంది. శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. రాజేంద్ర ప్రసాద్‌, జగపతిబాబు, సుకన్య, అలీ, వెన్నెల కిషోర్‌, సితార, తులసి తదితరులు నటిస్తున్నారు.

ఇంకా టైటిల్ ఇంకా ఖరారు కాని ఈ సినిమాకి ‘శ్రీ మంతుడు' అనే వర్కింగ్ టైటిల్ ప్రచారంలో ఉంది. త్వరలోనే ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేయనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.మహేష్ బాబుతో మొదటి సారి శృతి హాసన్ జోడీ కట్టిన ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ఫ్రాన్స్ లో ఉంటుందని సమాచారం.

Photo: Mahesh Babu with his Kids!

అలాగే మరోప్రక్క...

శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో ‘బ్రహ్మోత్సవం' సినిమాలో నటించటానికి కమిటైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం మే 31న అంటే మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టిన రోజున ప్రారంభం కానుందని సమాచారం. ఈ మేరకు ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి. దర్శకుడు ఇప్పటికే స్క్రిప్టు వర్క్ ఫినిష్ చేసి ఓ వెర్షన్ వినిపించి గ్రీన్ సిగ్నల్ పొందాడని తెలుస్తోంది.

గతంలో మహేష్, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్‌లో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు' చిత్రం తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దాంతో మరోసారి ఈ క్రేజీ కాంబినేషన్‌లో ‘బ్రహ్మోత్సవం' రూపొందుతూండటంతో బిజినెస్ కూడా బాగా జరుగుతుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి.సినిమాస్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌ నిర్మిస్తున్నారు.

Photo: Mahesh Babu with his Kids!

అయితే పి.వి.పి సంస్థ ఈ సినిమా కోసం కాస్టింగ్‌ కాల్‌ ఇచ్చింది. ఈ చిత్రంలో నటించడానికి 15 నుంచి 50 సంవత్సరాల వయస్సులోపు మేల్‌, ఫీమేల్‌ ఆర్టిస్టులు కావాలని ప్రకటించారు. ఆసక్తి కలవారు ఫుల్ సైజ్, క్లోజప్ ఫోటోతో కాంటాక్ట్ చేయాల్సిందిగా ప్రకటించారు. పైన ఫొటోలో ఉన్న మెయిల్ ఐ.డికి ఫోటోలు పంపించవచ్చు. ఈ సినిమా మహేష్ బాబుతోనే అయితే... తనతో తెరపంచుకునే అవకాశం కొత్త వారికి కలుగుతుంది.

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' తర్వాత మరోసారి సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘బ్రహ్మోత్సవం'. పివిపి సినిమాస్ పతాకంపై ప్రముఖ నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

‘బ్రహ్మోత్సవం'లో మహేష్ సరసన హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ఎంపికైనట్టు వార్తలు వచ్చాయి. వాటిని చిత్ర బృందం ఇంకా ఖరారు చేయలేదు. ఈ సినిమాలో రావు రమేష్ కీలక పాత్రలో నటించనున్నారు. మిగతా వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

English summary
In this picture, Mahesh was seen carrying his Daughter Sitara as Gautham Krishna stands beside him.
Please Wait while comments are loading...