»   » హాట్ లుక్ :'మీరా' గా తమన్నా (ఫొటో)

హాట్ లుక్ :'మీరా' గా తమన్నా (ఫొటో)

Written By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: రవితేజ, తమన్నా, రాశీ ఖన్నా, బొమన్‌ ఇరానీ ప్రధాన పాత్రల్లో సంపత్‌ నంది దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'బెంగాల్‌ టైగర్‌'. ఈ సినిమా సరికొత్త పోస్టర్లను చిత్ర యూనిట్ సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేసింది. అందులో భాగంగా తమన్నా ఫస్ట్ లుక్ ఫొటోని వదిలింది.

ఈ ఫొటో చూసిన వారు ఇంత హాట్ గానా అన్నట్లు మాట్లాడుకుంటున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె రాధామోహన్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆ ఫొటోని ఇక్కడ చూడండి.

ర‌వి తేజ స‌ర‌స‌న త‌మన్న, రాశి ఖ‌న్నాలు ఆడిపాడ‌ునున్నారు. సంప‌త్ నంది రెండ‌వ సినిమా ర‌చ్చ‌లో కూడా త‌మ‌న్న‌నే హీరోయిన్ కావ‌డం విశేషం. ఏమైంది ఈ వేళ‌తో ప్ర‌తిభ గ‌ల ద‌ర్శ‌కునిగా పేరు తెచ్చుకున్నాడు. రెండ‌వ సినిమాతోనే రామ్ చ‌ర‌ణ్ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం చేశాడు. ర‌చ్చ త‌రువాత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌బ్బ‌ర్ సింగ్‌2 కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవ‌కాశం వ‌చ్చింది.

ఆ సినిమా స్రిప్టు త‌యారు చేసే ప‌నిలో దాదాపు 2 సంవ‌త్స‌రాలు గ‌డిచిపోయాయి. కార‌ణం ఏంటో తెలియ‌దు కాని ఆ సినిమా నుంచి సంప‌త్ నంది త‌ప్పుకున్నాడు. అనూహ్యంగా ర‌వితేజాను డైరెక్ట్ చేసే అవ‌కాశం వ‌చ్చింది. ర‌వితేజకు త‌మ‌న్న‌తో తొలి సినిమా. త‌మ‌న్న త‌న అంద‌చందాల‌తో మురిపించ‌బోతోంది.

tamanna1

తమన్నా కెరీర్ కు వస్తే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓ హీరోయిన్ పదేళ్లు చిత్రసీమలో కొనసాగిందంటే నిస్సందేహంగా ఓ రికార్డే. రోజుకో కొత్త అందం వెలుగులోకి వస్తున్న పరిస్థితుల్లో ఆ పోటీని తట్టుకొని అవకాశాలు చేజిక్కించుకోవడం ఆషామాషీ కాదు. ఆ విషయంలో దటీజ్‌ మహాలక్ష్మి అనిపించుకొంది తమన్నా. 'శ్రీ'తో ప్రయాణం మొదలుపెట్టిన ఆమె అటు అందంతోనూ, ఇటు నటనతోనూ అలరించింది. తిరుగులేని హీరోయిన్ గా వరుస విజయాలు అందుకొంది.

ఇప్పటికీ క్లిష్టమైన పాత్ర అంటే తమన్నానే గుర్తుకొస్తుంది దర్శకులకు. ఈ మధ్యనే 'బాహుబలి'తో సందడి చేసిన ఆమె 'బెంగాల్‌టైగర్‌', నాగ్‌-కార్తీల చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.

tamanna2

తమన్నా మాట్లాడుతూ...ఇప్పుడంతా నన్ను సీనియర్‌ హీరోయిన్స్ జాబితాలో చేరుస్తున్నారు...వాళ్లు చేర్చడం సంగతేమో కానీ... ఆ విషయం గుర్తొచ్చినప్పుడు, ఎవరైనా గుర్తు చేసినప్పుడు 'అప్పుడే అంత పెద్దదాన్నైపోయానా?' అనిపిస్తుంటుంది. కానీ నేను ఇప్పటికీ చిన్నమ్మాయినేనండీ. పద్నాలుగేళ్లకే పరిశ్రమకొచ్చా. ఇప్పుడు పదేళ్ల కెరీర్‌ని పూర్తి చేసుకొన్నా. ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది.

English summary
Now Bengal Tiger team have come up with first look of heroine Tamanna from the film. She is playing role of Meera and the look of actress is an eye feast for fans. Tamanna is for the first time paired opposite raviteja.
Please Wait while comments are loading...