»   » ఎక్సక్లూజివ్ ఫొటో: 'బ్రూస్‌లీ' సెట్స్ పై చిరంజీవి

ఎక్సక్లూజివ్ ఫొటో: 'బ్రూస్‌లీ' సెట్స్ పై చిరంజీవి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: రామ్‌చరణ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌లు ప్రధాన పాత్రల్లో శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'బ్రూస్‌లీ'. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డి.వి.వి దానయ్య ఈ చిత్నాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి గెస్ట్ రోల్ లో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు షూటింగ్ గత రెండు రోజులుగా జరిగింది. చిత్రంలో ఆయన మూడు నిముషాలు పాటు కనిపించనున్నారు. ఆయన సెట్స్ లో ఉండగా తీసిన ఫొటో మీ కోసం...ఎంజాయ్ చేయండి.

ఇక అక్టోబర్‌ 2న 'బ్రూస్‌లీ' గీతాలను విడుదల చేయనున్నారు. అలాగే ఈ ఆడియో వెన్యూ కూడా ఫైనలైజ్ అయ్యింది. హైదరాబాద్ ..హైటెక్స్ గ్రౌండ్ లో ఘనంగా జరగనుంది. టాప్ టాలీవుడ్ సెలబ్రెటీలు ఈ ఫంక్షన్ కు హాజరవనున్నారని సమాచారం.


photo: Megastar Chiranjeevi On Bruce Lee Sets

తాజాగా చిత్రంలోని 'పోయే...' అనే గీతం మేకింగ్‌ వీడియో విడుదలైంది. ఈ విషయాన్ని చిత్ర సంగీత దర్శకుడు థమన్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా తెలిపారు.అలాగే..రామ్ చరణ్ అలుపెరగకుండా ఏకధాటిగా 17 గంటలపాటు షూటింగ్‌లో పాల్గొన్నాడు. 'బ్రూస్‌లీ'లో ఫైటర్‌గా రామ్‌చరణ్‌ ఎలాంటి పోరాటాలు చేశాడో తెలియదు కానీ అనుకొన్న సమయానికి ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు పెద్ద పోరాటమే చేస్తున్నాడని అంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే...రామోజీ ఫిల్మ్‌ సిటీలో 'మెగా మీటర్‌...' అనే పాటని తెరకెక్కించారు. ఆ పాట కోసమే రామ్‌చరణ్‌ ఏకధాటిగా 17 గంటలపాటు చిత్రీకరణలో పాల్గొన్నాడు. ఆ విషయాన్ని చిత్ర యూనిట్ తెలిపింది.


ఈ పాటలో రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఆడిపాడుతోంది. డ్యాన్స్‌ చేస్తూ గాయపడ్డప్పటికీ చిత్రీకరణలో పాల్గొందట రకుల్‌. 'బ్రూస్‌లీ' పాటల్ని వచ్చే నెల 2న, సినిమాని 16న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఇందులో ఓ కీలక పాత్రలో కనిపించనున్న చిరంజీవి త్వరలో సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నారు.


photo: Megastar Chiranjeevi On Bruce Lee Sets

నిర్మాత మాట్లాడుతూ ''బ్రూస్‌లీకి వీరాభిమాని అయిన ఓ యువకుడి కథ ఇది. తనకు ఎదురైన ఓ సమస్యపై ఎలా పోరాటం చేశాడన్నది తెరపైనే చూడాలి. వినోదం, కుటుంబ అనుబంధాలకు పెద్దపీట వేస్తూ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు. రామ్‌చరణ్‌ చేసే యాక్షన్‌, డ్యాన్సులు అభిమానుల్ని అలరించేలా ఉంటాయి. ఇటీవల విడుదలైన 'లే చలో...' పాటకి మంచి స్పందన లభిస్తోంది. పాటల్ని వచ్చే నెల 2న, చిత్రాన్ని 16న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము'' అన్నారు.


చిరంజీవి గెస్ట్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి బిజినెస్ ఓ రేంజిలో జరుగుతోంది. ప్రీ రిలీజ్ బిజినెస్ ...56.45 కోట్ల వరకూ జరగటంతో ట్రేడ్ లో ఇదే చర్చనీయాంశంగా మారింది. నిర్మాతకు టేబుల్ ఫ్రాఫిట్స్ తెచ్చిపెడుతున్న ఈ చిత్రం.


"వేట ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. మొదలుపెట్టాక, పూర్తయ్యేవరకూ రిక్వెస్ట్‌లు వినపడవ్! రియాక్షన్‌లు కనపడవ్! ఓన్లీ రీసౌండ్!" అంటూ చరణ్ చెప్తూ విడుదల చేసిన ఆయన తాజా చిత్రం డైలాగ్ టీజర్ కు అభిమానులకు పండగే చేసుకున్నారు.


photo: Megastar Chiranjeevi On Bruce Lee Sets

చిత్రం ఆడియో రైట్స్ ని జీ మ్యూజిక్ వారు తీసుకున్నట్లు సమాచారం. మరో ప్రక్క ఈ ఆడియో పంక్షన్ ని సింపుల్ గా లాగించేయాలని హీరో,దర్శకుడు నిర్ణయించినట్లు సినివర్గాల సమాచారం. అలాగే చిరంజీవి తప్ప మరెవరూ స్పెషల్ గెస్ట్ లుగా ఇన్వైట్ చేయలేదని చెప్తున్నారు.


ఈ చిత్రానికి కథ: కోన వెంకట్‌, గోపీమోహన్‌, మాటలు: కోన వెంకట్‌, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస, కూర్పు: ఎ.ఆర్‌. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్‌: అణల్‌ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్క్రీప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.

English summary
This is the Photo of Megastar Chiranjeevi On Bruce Lee Sets. Ram Charan, Rakul Preet Singh's ‘Bruce Lee’ directed by Srinu Vytla is progressing at brisk pace. Stage is set for ‘Bruce Lee’ audio launch on Oct, 2nd on Gandhi Jayanthi, event scheduled at Hitex Grounds, Hyderabad.
Please Wait while comments are loading...