»   » షాకిచ్చే లుక్ : లండన్ కి వెళ్తూ ఎయిర్ పోర్ట్ లో ఎన్టీఆర్ (ఫొటో)

షాకిచ్చే లుక్ : లండన్ కి వెళ్తూ ఎయిర్ పోర్ట్ లో ఎన్టీఆర్ (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్ లో ఓ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు షూటింగ్ మొత్తానికి ప్రారంభమవుతోంది. ఈ మేరకు అందరికీ వీసా సమస్యలు తీరటంతో యూనిట్ అంతా కలిసి ...షూటింగ్ కు బయిలు దేరారు. వారితో పాటు ఎన్టీఆర్ కూడా బయిలు దేరాడు. ఎన్టీఆర్ ఎయిర్ పోర్ట్ లో ఉండగా తీసిన ఫొటో ఇది. ఇక్కడ ఎన్టీఆర్ లుక్ చాలా డిఫెరెంట్ గా ఉండటం మీరు గమనించవచ్చు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ సినిమాకు ‘నాన్నకు ప్రేమతో..' అన్న టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ఎన్టీఆర్ సరసన హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్ నటించనుంది. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేసే అవకాశం కనిపిస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. ‘అత్తారింటికి దారేది' లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాను అందించిన బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Photo:NTR on the way to London

ముఖ్యంగా సుకుమార్ గత చిత్రం 1,నేనొక్కిడినే గ్లోబల్ మార్కెట్ లోనే మనకు ఇక్కడ లోకల్ కన్నా ఎక్కవ కలెక్టు చేయటం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవటానికి ఓ కారణం అని చెప్తున్నారు. అలాగే అక్కడ ఓ తెలుగు చిత్రం లాంచింగ్ అనేది ఇప్పటివరకూ జరగలేదు కాబట్టి హైలెట్ గా నిలుస్తుంది...అంతేకాకుండా అక్కడ ఉండే మన తెలుగు వారికీ ఆనందం కలిగించినట్లు ఉంటుందని ఎన్టీఆర్ భావించి,గ్రీన్ సిగ్నల్ ఇచ్చిట్లు చెప్తున్నారు.

దీంతో ఓవర్ సీస్ మార్కెట్ లో సైతం ఎన్టీఆర్ కు క్రేజ్ పెరిగే అవకాసం ఉంది. జనవరి 8,2016న సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. నవంబర్ దాకా రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్ గా చేయనుంది. జగపతిబాబు కీలకమైన పాత్రలోనూ, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తారు. ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిపోనుంది. ఎన్టీఆర్, సుకుమార్ తొలి కాంబినేషన్ లో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా పతాకంపై భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ... ఎన్టీఆర్ తో ఫస్ట్ టైమ్ వర్క్ చేయటం చాలా ఎక్సైటింగ్ గా ఉంది. తారక్ లో ఎంతో ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీని ఎలివేట్ చేసే స్కోప్ ఉన్న సబ్జెక్ట్ ఇది. ఇది ఓ రివేంజ్ డ్రామా. డిఫెరెంట్ స్టైల్ లో ఉంటుంది అన్నారు. నిర్మాత మాట్లాడుతూ... ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఎన్టీఆర్ కు డిఫెరెంట్ మూవి అవుతుంది. సబ్జెక్టు చాలా ఎక్సట్రార్డనరీగా ఉంది అన్నారు.

English summary
NTR left for London on Saturday and above is the picture of NTR at airport.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu