»   »  తాప్సీ కి కాలుకి దెబ్బ... ఇదిగో (ఫొటో)

తాప్సీ కి కాలుకి దెబ్బ... ఇదిగో (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : "కొన్ని చాలా కష్టమైన డాన్స్ రిహాల్సల్స్ చేసాను ...సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డుల నిమిత్తం... ", అంటూ ఈ ఫొటో షేర్ చేసింది తాప్సీ. ఆ ఫొటోలో ఏముందో మీరే చూడండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇక కొద్ది రోజుల క్రితం తాప్సీ తెలుగు సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది. తాప్సీ మాట్లాడుతూ ‘‘ఏ నటినైనా తెలుగు సినిమా స్పాయిల్‌ చేస్తుంది. ఎందుకంటే టాలీవుడ్‌లో హీరోయిన్లను మహారాణుల్లా చూస్తాను. కేర్‌వ్యాన్‌ నుంచి నాయిక దిగడమే ఆలస్యం.. అందరూ అటెన్షన్‌గా ఉంటారు. లేచి నిలబడతారు. షాట్‌ పెట్టిన చోటుకి నాయిక వెళ్లేవరకు ఎవరూ కూర్చోరు. అంతటి ఆరాధనను కనబరుస్తారు. నిజంగా ఐ లవ్‌ దట్‌ అటెన్షన్‌. ఐ మిస్‌ దట్‌ ఆల్సో'' అని చెప్పుకొచ్చింది.

Photo : Scariest share by Taapsee Pannu

హృతిక్‌ రోషన్‌తో నటించాలని, మణిరత్నం దర్శకత్వంలో పనిచేయాలని ఉందని, తన కల త్వరలోనే నెరవేరాలని కోరుకుంటున్నట్టు వివరించిందీ సుందరి.

టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ అనిపించుకోవాలని విశ్వప్రయత్నం చేసి విసుగెత్తిపోయిన తాప్సీ... ప్రస్తుతం కోలీవుడ్, బాలీవుడ్‌లలో బిజీగా ఉంటోంది. ఇటీవలే తమిళంలో కాంచన3 చిత్రంతోనూ, హిందీలో బేబీ సినిమాతోనూ హిట్స్ అందుకుని మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ సొట్టబుగ్గల సుందరి.. ఇకపై అయినా కాస్త పుంజుకుంటుందని అనుకున్నారు. కానీ, అమ్మడు ఉన్నట్లుండి బిజినెస్ చేసేస్తానంటూ జనాలకు షాక్ ఇచ్చింది.

అనడమే కాదు.. తన ఆలోచనను వెంటనే ఆచరణలో పెట్టేసి... సక్సెస్‌ను కూడా అందుకుందట అమ్మడు. ఈ విషయాన్ని తాప్సీనే స్వయంగా వెల్లడించడం మరో విశేషం. ఇటీవలే వెడ్డింగ్ ఈవెంట్ ప్లానర్‌గా కొత్త అవతారం ఎత్తిన తాప్సీ... చెల్లితో కలసి ఓ పెళ్లిని ఘనంగా నిర్వహించిందట. అయితే దీనికి అందరూ అభినందనలు తెలపాల్సింది పోయి.. సినిమాల్లో అమ్మడు జోరు తగ్గడం వల్లే సైడ్ బిజినెస్ స్టార్ట్ చేసిందని సెటైర్లు వేస్తుండటంతో.. తాప్సీకి అరికాలి మంట నెత్తికెక్కిందట.

ఇక అసలే అమ్మడి నోటికి కాస్త దురుసు ఎక్కువేమో... వెంటనే దీనిపై ఓ స్టేట్మెంట్ ఇచ్చేసింది. సినీ కెరీర్ పట్ల తనకు ఎటువంటి ఇన్ సెక్యూరిటీ ఫీలింగ్ లేదని స్పష్టం చేసిన తాప్సీ... కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచనతోనే వ్యాపారంలోకి అడుగుపెట్టానని క్లారిటీ ఇచ్చేసింది. అంతేకాదు.

ప్రస్తుతం తనకు సినిమా ఆఫర్లు కూడా బాగానే వస్తున్నాయని తెలిపింది. ఏమైనా... మన క్యూట్ బ్యూటీ రెండు పడవల ప్రయాణాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్లాలనే నిర్ణయించుకుందట. మరి.. తాప్సీ ప్లానింగ్ ఎలాంటి ఫలితాలకు దారితీస్తుందో చూడాలి.

English summary
“Some real hard core dance rehearsals going on for Filmfare south. Stage is my best and oldest companion”, Taapsee says.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu