»   » అప్పటి హీరోయిన్స్ తో ఇప్పటి రజినీకాంత్‌ (ఫొటో)

అప్పటి హీరోయిన్స్ తో ఇప్పటి రజినీకాంత్‌ (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: అలనాటి సినీ తారల నడుమ రజినీకాంత్‌ ఉన్న ఫొటోను నటి రమ్యకృష్ణ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. స్నేహితులతో తీపి జ్ఞాపకాలు అంటూ... రజినీకాంత్‌, ఖుష్బు, సుహాసినీ, నదియా, రాధిక, శోభనా, రాధ, అంబికా, పూర్ణిమ, లిస్సిలతో ఆమె దిగిన ఓ ఫొటోను పోస్ట్‌ చేశారు. ఆ ఫొటోను ఇక్కడ చూడండి.

#ThrowbackSaturday #PhotoMemorySuperstar with his heroines :) A photo to be treasured :) #Khushboo #Suhasini #Nadhiya...

Posted by Ramya Krishnan on 25 September 2015

సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ‘కబాలి' పేరుతో ఓ గ్యాంగ్‌స్టర్ జీవితం నేపథ్యంలో చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. అట్టకత్తి, మద్రాస్ సినిమాలతో తమిళనాట పాపులర్ అయిన యువ దర్శకుడు పా రంజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రజనీ సరసన రాధికా ఆప్టే, ఇతర ప్రధాన పాత్రల్లో ప్రకాశ్ రాజ్, కిషోర్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్.థాను నిర్మిస్తున్నారు.

వినాయక చవితి పర్వ దినాన ఈ చిత్ర షూటింగ్ ప్రారంభించారు. చిత్ర షూటింగ్ నిర్విరామంగా 20 రోజుల పాటు చెన్నైలో జరుపుకోనుంది. చెన్నై నుంచి జీవనోపాధి కొరకు మలేషియా వెళ్ళిన వారి సమస్యల చుట్టూ కథ తిరుగుతుందని సమాచారం. తెల్లని మీసం, గెడ్డం, కోటు, సూటుతో వీల్‌చైర్‌లో కూర్చున్న స్టిల్, ఇనుప గొలుసులతో పోరాడే సన్నివేశంలోని మరో స్టిల్‌తో రజనీ కాంత్ ఆకట్టుకున్నారు.

photo:Superstar Rajanikanth with his heroines

రెండు వరుస పరాజయాల తర్వాత రజనీ కెరీర్‌కు ప్రతిష్టాత్మకంగా మారిన ఈ సినిమాపై అనౌన్స్ అయిన రోజునుంచే విపరీతమైన అంచనాలు బయలుదేరాయి.ఇక ఈ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా తనదైన స్టైల్ సినిమాను రూపొందించేందుకు రంజిత్ ఓ పక్కా స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకుని,షూట్ చేస్తున్నట్లు సమాచారం.

English summary
Over the years Rajinikanth has romanced so many heroines.Now Ramyakrishna bring this photo and share it in FB.
Please Wait while comments are loading...