»   » ఫోటో: ధూమ్-3 కోసం అమీర్ కలర్ చేంజ్

ఫోటో: ధూమ్-3 కోసం అమీర్ కలర్ చేంజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్‌కు మిస్టర్ పర్ ఫెక్ట్ అనే పేరుంది. సినిమాలో పాత్రకు తగిన విధంగా పర్ ఫెక్ట్‌గా కనిపించడానికి ఎంత కష్టమైనా పడతాడు అమీర్. ప్రస్తుతం అమీర్ ఖాన్ నటిస్తున్న చిత్రం ధూమ్-3. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈచిత్రం డిసెంబర్ 20న విడుదలకు సిద్ధం అవుతోంది.

ఈ చిత్రంలో అమీర్ ఖాన్ సరికొత్త లుక్‌తో కనిపించబోతున్నాడు. ఇందుకోసం అతని మేకప్ విషయంలో ప్రత్యేకం శ్రద్ద తీసుకుంటున్నారు. అందుకు సంబంధించిన ఓ దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు. పూర్తి రాగి రంగు జుట్టుతో అమీర్ ఖాన్ డిఫరెంటుగా కనిపిస్తున్నాడు కదూ!

అమీర్ ఖాన్, కత్రినా కైఫ్, అభిషేక్ బచ్చన్, ఉదయ్ చెప్రా ప్రధాన పాత్రలో యష్ రాజ్ ఫిలింస్ తెరకెక్కిస్తున్న 'ధూమ్-3' చిత్రంలో ఓ పాటకు ఏకంగా రూ. 5 కోట్లు ఖర్చు పెట్టారు. ఇండియన్ సినిమా చరిత్రలో ఓ పాటకు ఇంత ఖర్చు పెట్టడం ఇదే తొలిసారి. కత్రినా, అమీర్‌లపై చిత్రీకరించిన ఈ పాటలో 200 మంది జిమ్నాస్టిక్ కళాకారులను అమెరికా నుంచి తీసుకొచ్చారట. కళ్లు చెదిరేలా వేసిన సెట్లో 20 రోజుల పాటు ఈ పాట చిత్రీకరించారని, సినిమాకు ఈ పాట హైలెట్ అవుతుందని అంటున్నారు.

ధూమ్, ధూమ్-2 చిత్రాలు భారీ విజయం సాధించి నేపథ్యంలో దానికి సీక్వెల్‌గా రూపొందుతున్న 'ధూమ్-3' చిత్రంపై మొదటి నుండీ భారీ అంచనాలే ఉన్నాయి. పైగా అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరో ఈచిత్రంలో నటిస్తుండటం కూడా మరో కారణం. భారీ యాక్షన్ సన్నివేశాలు, కళ్లు చెదిరే సాహసాలు ఈచిత్రంలో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నాయి. ధూమ్ చిత్రం మొదటి భాగంలో జాన్ అబ్రహం నటించగా....దానికి సీక్వెల్ గా వచ్చి ధూమ్-2 చిత్రంలో హృతి రోషన్ ప్రేక్షకులను మెప్పించాడు. ఇప్పుడు అమీర్ ఖాన్ 'ధూమ్-3' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈచిత్రానికి విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్నారు.

English summary
We are sure you have all seen Aamir Khan's look in the upcoming movie Dhoom 3. He is sporting a hat for quite a lot of scenes and glimpses we have seen so far. What most of you don't know is that the actor had almost finalised a blond look for the movie. We stumbled upon a few pictures where Aamir had gone changed the colour of his hair from black to blonde.
 
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu