For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మహేష్ గెస్ట్ గా ‌: 'అఖిల్‌' ఆడియో విడుదల (ఫొటోలు)

  By Srikanya
  |

  హైదరాబాద్‌: ''అఖిల్‌ సినిమా వేడుకలో నాన్నగారు ఉండుంటే బాగుండేదని అంటున్నారంతా. ఆయన ఎప్పుడూ నాతోనే, మనతోనే ఉంటారు. అభిమానుల కేరింతల్లోనూ, సంతోషంలోనూ నాన్నగారిని చూసుకొంటుంటా'' అన్నారు అక్కినేని నాగార్జున.

  అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ హీరోగా నిఖితారెడ్డి సమర్పణలో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై హీరో నితిన్ నిర్మిస్తున్న చిత్రం 'అఖిల్'. సాయేషా సైగల్ హీరోయిన్. తండ్రి అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా తనయుడు అఖిల్ తొలి చిత్రం ఆడియో వేడుకను జరపాలని నాగార్జున నిర్ణయించుకున్నారు. ఆ మేరకు ఆదివారం 'అఖిల్' ఆడియో వేడుకను పలువురు సినీ రంగ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో జరిపారు.

  ఈ సందర్బంగా ఈ చిత్రం ధియోటర్ ట్రైలర్ ని విడుదల చేసారు. ఆ ట్రైలర్ ని ఇక్కడ చూడండి.

  ఆడియో విడుదల ఫొటోలు ఇక్కడ స్లైడ్ షోలో...

  ఆవిష్కరణ

  ఆవిష్కరణ

  తొలి సీడీని నాగార్జున, అమల, నాగచైతన్య ఆవిష్కరించారు.

  విడుదల

  విడుదల

  ముఖ్య అతిథిగా హాజరైన మహేష్‌బాబు ట్రైలర్ విడుదల చేశారు.

  పెద్ద హీరో వచ్చాడు..

  పెద్ద హీరో వచ్చాడు..

  '''మనం' సినిమా చూశాక, నాగార్జునగారికి ఫోన్ చేసి అఖిల్ తెరపై వెలిగిపోయాడని చెప్పాను. అతనికి టెర్రిఫిక్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది. మన తెలుగు సినిమాకు మరో పెద్ద హీరో వచ్చాడు'' అని మహేశ్‌బాబు అన్నారు.

  అఖిల్‌ అక్కినేని మాట్లాడుతూ....

  అఖిల్‌ అక్కినేని మాట్లాడుతూ....

  ''ప్రేక్షకుల్ని ఎలా సంతృప్తిపరచాలా అని ఎప్పుడూ ఆలోచిస్తుంటా. నా సినిమా పాటల విడుదల వేడుక గురించి ఒక చిన్న మాట చెప్పాలని మహేష్‌ని అడిగా. వేడుకకి నేనే వస్తా అన్నారు. చాలా సంతోషమనిపించింది. సరిగ్గా ఎనిమిది నెలల క్రితం ఒక గొప్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తా అని చెప్పా. ఆ మాట నిజం చేయబోతున్నా.

  అఖిల్ కంటిన్యూ చేస్తూ...

  అఖిల్ కంటిన్యూ చేస్తూ...

  వినాయక్‌గారు ఇదివరకు చేసిన సినిమాలతో పోలిస్తే ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది. అనూప్‌, తమన్‌లకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నా. అన్నయ్య, నేను బయట పెద్దగా మాట్లాడుకోం. కానీ నా గురించి వేదికలపై చాలా బాగా చెబుతుంటాడు. ఆ మాటల్ని చాలా ఇష్టపడుతుంటా'' అన్నారు.

  వీడియో బైట్ కోసం ఫోన్ చేసా...

  వీడియో బైట్ కోసం ఫోన్ చేసా...

  ''8 నెలల క్రితం బ్లాక్‌బస్టర్‌తో వస్తానన్నా. అదే ఈ సినిమా. ఓ వీడియో బైట్ కోసం నేను మహేశ్‌బాబుగారికి ఫోన్ చేశాను. కానీ ఆయనే స్వయంగా వస్తానన్నారు. నన్ను బ్లెస్ చేయడానికి వచ్చిన మహేశ్‌బాబుగారికి స్పెషల్ థ్యాంక్స్.'' అని అఖిల్ చెప్పారు.

  నెక్స్ట్ సినిమా మీతోనే చేస్తా..

  నెక్స్ట్ సినిమా మీతోనే చేస్తా..

  వీవీ వినాయక్‌గారు నన్ను కొడుకుగా, ఓ ఫ్యామిలీ మెంబర్‌లా చూసుకున్నారు. 'నెక్ట్స్ సినిమా కూడా నేను మీతో (వినాయక్) నే చేస్తాను. మీరు మాట కూడా ఇచ్చారు అని అఖిల్ అన్నారు.

  కాలర్ పట్టుకుని అడిగాడు

  కాలర్ పట్టుకుని అడిగాడు

  నన్ను లాంచ్ చేయడానికి అందరూ చాలా కష్టపడ్డారు. నా ముందు వినాయక్‌గారు, నా వెనక మా నిర్మాత సుధాకర్ రెడ్డిగారు ఉన్నారన్న కాన్ఫిడెన్స్‌తోనే ఈ సినిమా చేశాను. నితిన్ నా కాలర్ పట్టుకుని ఈ సినిమా చేసి ఫ్యాన్స్‌కు బ్లాక్ బస్టర్ ఇవ్వమని అడిగాడు అని అఖిల్ చెప్పుకొచ్చారు.

  హీరోయిన్ సాయేషా మాట్లాడుతూ....

  హీరోయిన్ సాయేషా మాట్లాడుతూ....

  ''అఖిల్‌తో కలిసి వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. డాన్స్, ఫైట్స్ అన్నీ అదరగొట్టాడు. ఏఎన్నార్‌గారి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి. వీవీ వినాయక్‌గారు చాలా ఓపిగ్గా, నాకు నటనలో మెలకువలు నేర్పారు. ఆయన ఎప్పటికీ నా గురువు'' అని అన్నారు.

  మహేశ్‌బాబు మాట్లాడుతూ-

  మహేశ్‌బాబు మాట్లాడుతూ-

  ''ఏఎన్నార్ లివ్స్ ఆన్. ఆయన అఖిల్ రూపంలో మనముందున్నారు. ఆయన ఎక్కడున్నా గర్వపడతారు'' అని చెప్పారు.

  నాగార్జున మాట్లాడుతూ...

  నాగార్జున మాట్లాడుతూ...

  ''నాన్నగారి పుట్టిన రోజు సందర్భంగా 'అఖిల్' ఆడియో లాంచ్‌కు వచ్చిన అందరికీ నా థ్యాంక్స్. అఖిల్ అంత బాగా కనడుతున్నాడంటే దాని వెనుక చాలా మంది కృషి ఉంది.

  మహేష్ కు ధాంక్స్

  మహేష్ కు ధాంక్స్

  కృష్ణగారి వారసుడు నా వారసుడి ఆడియో లాంచ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. యువతరాన్ని ప్రోత్సహించడానికి వచ్చిన మహేశ్‌బాబుకు మరోసారి కృతజ్ఞతలు చెబుతున్నాను అని నాగార్జున అన్నారు.

  గుండె వెనుక...

  గుండె వెనుక...

  మన బంధం (అభిమానులతో) 75 సంవత్సరాల క్రితం మొదలయింది. అఖిల్‌ను సునామీ కెరటం మీద పైకి ఎక్కించి తీసుకెళుతున్నారు. నాన్నగారు నా జేబు వెనక గుండె లో ఎప్పుడూ ఉంటారు. మీ ఆనందంలో నాన్నగారిని చూసుకుంటూ ఉంటాం అని నాగ్ అన్నారు.

  విడుదల ఎప్పుడంటే...

  విడుదల ఎప్పుడంటే...

  సాయేషాకు ఆల్ ద బెస్ట్. నితిన్‌కు థ్యాంక్స్. విజయదశమి సందర్భంగా అక్టోబర్ 22న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం'' అని నాగార్జున చెప్పారు.

  వీవీ వినాయక్ మాట్లాడుతూ...

  వీవీ వినాయక్ మాట్లాడుతూ...

  ' 'ఈ సినిమా హిట్ అవుతుందని ముందు నాగార్జునగారికి ప్రామిస్ చేశాను. అఖిల్ కచ్చితంగా సూపర్‌స్టార్ అవుతాడు. బ్యాక్‌బోన్‌గా నిలిచిన సుధాకర్‌రెడ్డిగారికి థ్యాంక్స్. ఈ సినిమా అంత బాగా వచ్చిందంటే అదంతా ఆయన కష్టమే'' అన్నారు.

  నితిన్ మాట్లాడుతూ...

  నితిన్ మాట్లాడుతూ...

  ''అక్కినేని ఫ్యాన్స్‌కి, మహేశ్‌బాబుగారికి థ్యాంక్స్. మా బ్యానర్‌ను, వినయ్‌గారిని నమ్మినందుకు చాలా థ్యాంక్స్. మీకిచ్చిన (అభిమానులు) ప్రామిస్‌ను ఫుల్‌ఫిల్ చేశామనే అనుకుంటున్నాం. '' అన్నారు.

  దెబ్బ తగిలినా..

  దెబ్బ తగిలినా..

  అఖిల్ మెచ్యూరిటీ, కాన్ఫిడెన్స్ లెవల్స్ సూపర్. ఫస్ట్ సినిమాకే చాలా క్లారిటీతోనే ఉన్నాడు. అఖిల్ కాలికి ఓ ఫైట్‌లో దెబ్బ తగిలింది. ఆ తర్వాత రోజు చేయాల్సిన పాటను వాయిదా వేయకుండా నొప్పి ఉన్నా సరే డ్యాన్స్ చేశాడు. ఇంత కమిట్‌మెంట్‌తో ఉంటే అతను మంచి హైట్స్‌కు వెళతాడు అని నితిన్ అన్నారు.

  విషెష్...

  విషెష్...

  అఖిల్‌కు అతిరథ మహారథుల విషెస్ అమితాబ్‌బచ్చన్, కమల్‌హాసన్, వెంకటేశ్, ప్రభాస్, రానా, అలాగే క్రికెటర్ సచిన్ టెండూల్కర్, తమిళ హీరో సూర్య, శ్రుతీహాసన్ ఇలా పలువురు ప్రముఖులు వీడియో బైట్స్ ద్వారా అఖిల్‌కు తమ విషెస్ అందజేశారు.

  ఈ వేడుకలో...

  ఈ వేడుకలో...

  సుమంత్, సుశాంత్, నాగసుశీల, నిమ్మగడ్డ ప్రసాద్, కొరటాల శివ, నాగచైతన్య, రచయిత కోనా వెంకట్, నిర్మాతలు బెల్లంకొండ సురేశ్, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, గేయ రచయిత భాస్కరభట్ల తదితరులు పాల్గొన్నారు.

  ట్రైలర్ చూసి...

  ట్రైలర్ చూసి...

  యాక్షన్ సీన్లు మాత్రమే కాదు...డాన్స్ విషయంలో అఖిల్ కేక పెట్టించబోతున్నాడు అని నమ్మకం వచ్చేసింది.

  వారసత్వం..

  వారసత్వం..

  టాలీవుడ్లో అక్కినేని నాగేశ్వరరావు అప్పట్లో మంచి డాన్సర్ గా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఆ తర్వాత వచ్చిన నాగార్జున, నాగ చైతన్య మాత్రం తమ పోటీ స్టార్లతో పోలిస్తే డాన్స్ విషయంలో ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకున్నారు. అయితే అఖిల్ అక్కినేని మాత్రం డాన్స్ విషయంలో ఇరగదీస్తుండటంపై ప్యాన్స్ హ్యాపీగా ఉన్నారు.

  నిర్మాణం

  నిర్మాణం

  శ్రేష్ఠ్ మూవీస్ బేనర్లో యాక్టర్ నితిన్, ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

  తెర ముందు

  తెర ముందు

  అఖిల్‌ అక్కినేని, సాయేషా సైగల్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, మహేష్‌ మంజ్రేకర్‌, వెన్నెల కిషోర్‌, సప్తగిరితోపాటు మరి కొంతమంది ప్రముఖ నటీనటులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

  తెర వెనుక...

  తెర వెనుక...

  ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, సినిమాటోగ్రఫీ: అమోల్‌రాథోడ్, ఎడిటింగ్: గౌతంరాజు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్.

  English summary
  Akhil akkineni's Akhil audio released. Starring Akhil Akkineni, Sayyeshaa Saigal in lead roles, Anup Rubens & S. Thaman together composed the music. Written by Veligonda Srinivas and Directed by VV Vinayak, Produced jointly by actor Nithiin and his father Sudhakar Reddy on Sreshth Movies banner.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X