»   » కెమెరాకు చిక్కిన కమల్ కూతురు అక్షర హాసన్ (ఫోటోలు)

కెమెరాకు చిక్కిన కమల్ కూతురు అక్షర హాసన్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ నటుడు కమల్ హాసన్ నటవారసురాలిగా శృతి హాసన్ ఇప్పటికే తెరంగ్రేటం చేసి బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినిమా రంగాల్లో తన సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కమల్ హాసన్ చిన్న కూతురు అక్షర హాసన్ కూడా తెరంగ్రేటం చేయబోతోంది. బాలీవుడ్ దర్శకుడు ఆర్ బాల్కి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ద్విబాషా చిత్రంతో అక్షర హాసన్ తెరంగ్రేటం చేస్తోంది.

ఈ చిత్రంలో అక్షర హాసన్ ధనుష్ సరసన నటిస్తోంది. బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఈ మూవీలో ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ఆన్ లొకేషన్ స్టిల్స్ ఎక్స్ క్లూజివ్‌గా అందాయి. అందుకు సంబంధించిన ఫోటోలు, వివరాలు స్లైడ్ షోలో....

సెట్స్‌లో అక్షర హాసన్ ఇలా కెమెరాకు చిక్కింది

సెట్స్‌లో అక్షర హాసన్ ఇలా కెమెరాకు చిక్కింది


హీరోయిన్‌గా పరిచయం కాబోతున్న అక్షర హాసన్ సెట్స్‌లో ఇలా కెమెరాకు చిక్కింది. తన కారావాన్ వద్ద ఇలా కాఫీ తాగుతూ కనిపించింది.

అక్షర హాసన్-ధనుష్ మూవీ సెట్స్‌లో గౌరీ షిండే, కరణ్ జోహార్

అక్షర హాసన్-ధనుష్ మూవీ సెట్స్‌లో గౌరీ షిండే, కరణ్ జోహార్


అక్షర హాసన్, ధనుష్ కలసి నటిస్తున్న మూవీ సెట్లో బాలీవుడ్ ప్రముడు కరణ్ జోహార్, ఇంగ్లిష్ వింగ్లిష్ దర్శకురాలు గౌరీ షిండే.

కరణ్ జోహార్, గౌరీ షిండేలతో కలిసి ధనుష్

కరణ్ జోహార్, గౌరీ షిండేలతో కలిసి ధనుష్


ఈ చిత్ర దర్శకుడుడైన ఆర్ బాల్కీ సతీమని గౌరీ షిండే, కరణ్ జోహార్‌లతో కలిసి హీరో ధనుష్ సెట్లో ఇలా.....

ధనుష్‌కు సీన్ వివరిస్తున్న బాల్కీ

ధనుష్‌కు సీన్ వివరిస్తున్న బాల్కీ


దర్శకుడు బాల్కీ ధనుష్‌కు సీన్ వివరిస్తున్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

ఇంకా టైటిల్ ఖరారు కాలేదు

ఇంకా టైటిల్ ఖరారు కాలేదు


ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. ధనుష్ కి ఇది రెండవ హిందీ సినిమా. ఇటీవలే ఆయన 'రాంజానా' చిత్రం ద్వారా బాలీవుడ్ కి పరిచయమయ్యాడు. ఆ చిత్రం అక్కడ మంచి విజయం సాధించింది.

English summary
As we all know, Kamal Hassan's daughter Akshara Hassan is making her debut in R Balki's directorial bilingual movie starring Dhanush and Amitabh Bachchan. Here, we have got some exclusive photos from the sets.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu