»   » ఫోటోలు : బన్నీ-శృతిలపై రొమాంటిక్ సాంగ్ షూటింగ్

ఫోటోలు : బన్నీ-శృతిలపై రొమాంటిక్ సాంగ్ షూటింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్, సెక్సీ హీరోయిన్ శృతి హాసన్ జంటగా 'రేస్ గుర్రం' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. కిక్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రం షూటింగ్ ప్రస్తుతం యూరఫ్ లో జరుగుతోంది. ఇటీవల ఇటలీలోని మిలన్‌ పర్యాటక ప్రాంతాల్లో ఈ ఇద్దరిపై రొమాంటిక్ సాంగ్ చిత్రీకరించారు. అందుకు సంబంధించి ఫోటోలను స్లైడ్ షోలో వీక్షించండి.

దర్శకుడు సురేందర్ రెడ్డి 'రేస్ గుర్రం' చిత్రాన్ని సరికొత్త కాన్సెప్టుతో తెరకెక్కిస్తున్నారు. బన్నీ బాడీలాంగ్వేజ్, స్టైల్‌కు తగిన విధంగా ఈచితంలో అతని పాత్రను పవర్ ఫుల్‌గా ప్లాన్ చేసారు. ఈ చిత్రం బన్నీ నటించిన గత చిత్రాలన్నింటికంటే విభిన్నంగా ఉంటుందని అంటున్నారు యూనిట్ సభ్యలు.

అయితే గత చిత్రాల మాదిరి ఈచిత్రంలోనూ అల్లు అర్జున్ డాన్స్‌ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. బన్నీ వేసుకునే కాస్ట్యూమ్స్ విషయంలో చాలా మార్పులు కనిపించనున్నాయి. స్లైడ్ షోలో సినిమాకు సంబంధించిన వివరాలు, ఫోటోలు....

మిలన్‌లోని ఓ అందమైన ప్రదేశంలో పాట చిత్రీకరిస్తున్న దృశ్యం. ఈ ఫోటోలో అల్లు అర్జున్, శృతి హాసన్ హావ భావాలు చూస్తుంటే ఇదొక రొమాంటిక్ లవ్ సాంగ్ అని స్పష్టం అవుతుంది. బన్నీ ఆమె వెంట పడుతుండటం, ఆమె దూరం దూరంగా వెళ్లడం లాంటి సీన్లను బట్టి ఇదో సరదా సాంగ్ అని తెలుస్తోంది.

గతంలో ‘ఏమాయ చేసేవె' లాంటి చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన మనోజ్ పరమహంస ఈచిత్రానికి పని చేస్తుండటం విశేషం. ఆయన ఫోటోగ్రఫీలో ఇదో మంచి దృశ్యకావ్యంగా ఉండనుందని అంటున్నారు యూనిట్ సభ్యలు.

రేస్ గుర్రం చిత్రాన్ని నల్లమలుపు బుజ్జి, కె. వెంకటేశ్వరరావు సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలీవుడ్లో మంచి అభిరుచి ఉన్న నిర్మాతలుగా పేరు తెచ్చుకున్నారు. గతంలో పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించి ట్రాక్ రికార్డు వీరికుంది.

ఈ చిత్రానికి కథ : వక్కతం వంశీ, సంగీతం : తమన్, సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస, ఎడిటింగ్ : గౌతం రాజు, నిర్మాతలు : నల్లమలుపు శ్రీనివాస్, వెంకటేశ్వర రావు, దర్శకత్వం : సురేందర్ రెడ్డి.

ఇప్పటికే పలు చిత్రాల్లో ఎక్స్ ఫోజింగుకు అడ్డు చెప్పకుండా నటించిన శృతి హాసన్ ఈచిత్రంలోనూ హాట్ హాట్ గా అందాలు ఆరబోయనుందని తెలుస్తోంది. అభినయం, అందాల ప్రదర్శనతో ప్రస్తుతం తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ మారింది శృతి.

కిక్‌తో హిట్ కొట్టి స్టార్ దర్శకుడిగా మారిన సురేందర్ రెడ్డి, ఆ తర్వాత ఊసరవెల్లితో బోల్తా పడ్డాడు. అయితే ఈచిత్రంతో ఎలాగైనా హిట్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. అందుకు తగిన విధంగా పక్కా ప్రణాళికతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

ఈ చిత్రంలో అల్లు అర్జున్ బైక్ రేసర్‌గా కనిపించనున్నారని తెలుస్తోంది. బన్నీ ఆ సీన్స్ కోసం బైక్ రేస్ ట్రైనింగ్ అయ్యినట్లు తెలుస్తోంది. ఈ సన్నివేశాలు చాలా ఉత్కంఠ భరితంగా ఉంటాయని యూనిట్ సభ్యులు అంటున్నారు.

ఒక్కసారి రేసు గుర్రం పరిగెట్టడం మొదలుపెట్టిందంటే విజయం సాధించేదాకా పరిగెడుతూనే ఉంటుంది. అటువంటి వేగంగా పరిగెత్తే గుర్రాన్ని చూస్తే ఎవరికైనా దాన్న ఎక్కి అందరికన్నా ముందు అనుకున్న చోటికి చేరాలని వుం టుంది. ఇదే అంశాన్ని దర్శకుడు సురేందర్‌రెడ్డి తన చిత్రంలో చూపబోతున్నారు అని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.

బన్నీ నటించిన ‘ఇద్దరమ్మాయిలతో' చిత్రం ఇటీవల విడుదలై ఫర్వాలేదనే టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంతో మంచి కమర్షియల్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు బన్నీ. అందుకు తగిన విధంగా బాగా కష్ట పడుతున్నాడు.

ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు ఈ సంవత్సరాంతంలోగానీ, లేక వచ్చే ఏడాది సంక్రాంతికిగా విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

English summary
Bunny's Race Gurram Songs Schedule in Milan Working Still released. directed by Surender Reddy and Nallamalapu Srinivas (Bujji) and Dr. Venkateshwara Rao are producing this film under Lakshmi Narasimha production and S. Thaman provides the music. The cinematography is handled by Manoj Paramahamsa.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu