కేటీఆర్‌ను కలిసిన చక్రి తల్లి, తోబుట్టువులు (ఫోటోస్)
హైదరాబాద్: చక్రి మరణం తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలు తెలుగు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ అయ్యాయి. చక్రిది సహజ మరణం కాదని...ఆయన విష ప్రయోగం వల్లనే చనిపోయాడనే వాదన తెరపైకి వచ్చింది. చక్రి భార్య....చక్రి తల్లి, తోబుట్టువులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో చక్రి మరణంపై విచారణ జరిపించాల్సిందిగా మంత్రి కేటీఆర్‌ను కలిసారు చక్రి తల్లి, తోబుట్టువులు. అనంతరం చక్రి సోదరి కృష్ణప్రియ మీడియాతో మాట్లాడుతూ చక్రి మరణంపై అనుమానాలు ఉన్నాయన్నారు. చక్రి మరణంపై త్వరగా విచారణ జరిపించాలని మంత్రి కేటీఆర్‌ను కోరామని కృష్ణప్రియ చెప్పారు.
స్లైడ్ షోలో ఫోటోలు...

చక్రి భార్య అలా...
చక్రి మరణానికి అత్తింటి వారే కారణమని చక్రి భార్య శ్రావణి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చక్కి తల్లి ఇలా
ఆ మరునాడే చక్రి తల్లి సైతం పోలీసుస్టేషన్ మెట్లెక్కారు. చక్రి మృతికి ఆయన భార్య శ్రావణి కారణమని ఫిర్యాదు చేశారు.

కేటీఆర్ వద్దకు పంచాయితీ
ఈ నేపథ్యంలో చక్రి తల్లి, సోదరుడు, సోదరీమణులు మంత్రి కేటీఆర్‌ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

కేటీఆర్ జోక్యం చేసుకంటారా?
ఈ వ్యవహారంలో కేటీఆర్ జోక్యం చేసుకుంటారా? లేదా? అనేది చర్చనీయాంశం అయింది.


Click it and Unblock the Notifications











