»   » పదేళ్లు పది క్షణాల్లా గడిచాయి, అదే జోరుతో వస్తున్నా.... (ఖైదీ పంక్షన్లో చిరంజీవి)

పదేళ్లు పది క్షణాల్లా గడిచాయి, అదే జోరుతో వస్తున్నా.... (ఖైదీ పంక్షన్లో చిరంజీవి)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా స్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'ఖైదీ నెం 150' ఫంక్షన్ శనివారం సాయంత్రం హాయ్ లాండ్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి సుదీర్ఘ ప్రసంగం ఇచ్చారు. డైలాగులతో ఆకట్టుకున్నారు. తనలో జోరు హుషారు ఇంకా తగ్గలేదని చెప్పారు.

చిరంజీవి మైకు అందుకోగానే అభిమానులు ఈలలు, చప్పట్లతో హోరెత్తించారు. చిరంజీవి తన ప్రసంగం మొదలు పెడుతూ....'ఈలలు.. చప్పట్లు విని చాలా సంవత్సరాలు అయింది. వీటికి ఎంత శక్తి ఉన్నది అనుభవపూర్వకంగా తెలిసిన వాడిని. మీ నుంచి మరింత ఉత్సాహం కావాలి. దాని కోసం చాలా సంవత్సరాలు ఎదురు చూసి ఇప్పుడు మీ ముందుకు వచ్చాను. ఇక్కడ ఉన్న అభిమానులను చూస్తుంటే విజయవాడ కృష్ణానది పక్కన ఉన్నానా? విశాఖ సముద్రతీరం పక్కన ఉన్నానా అనిపిస్తోంది. తుపాను సందర్భంగా సముద్రం చేసే కోలాహలం ఇక్కడ ప్రతి ధ్వనిస్తోంది. 'బాస్‌ కమ్‌ బ్యాక్‌' అంటూ పెద్ద ఎత్తున మీరు పిలుస్తుంటే ఆనందంగా ఉంది అన్నారు.

దాసరి గారే ఈ సినిమాకు టైటిల్ పెట్టారు

దాసరి గారే ఈ సినిమాకు టైటిల్ పెట్టారు

మీతో పాటు ఆత్మీయత, అభినందనలు పంచుకోవడానికి వచ్చిన ముఖ్య అతిథి దాసరి నారాయణరావుగారికి ధన్యవాదాలు. ఈ సినిమాలో ఖైదీ డ్రస్‌తో ఉన్న నా ఫస్ట్‌లుక్‌ వచ్చినప్పుడు జేబుపై ఉన్న 150 నంబర్‌ చూసి దాసరి నాకు ఫోన్‌ చేశారు. సినిమాకు ‘ఖైదీ నంబర్‌ 150' పెట్టుకోవాలని సూచించింది ఆయనే అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

పదేళ్లు పది క్షణాల్లా

పదేళ్లు పది క్షణాల్లా

ఈ పది సంవత్సరాలు 10 క్షణాల్లా గడిచిపోయాయి. ఆ సమయం తెలియకుండా జరగడానికి లోపల నన్ను నడిపించిన శక్తి ఏమిటి? అని నాలో ఓ ప్రశ్న ఉదయించింది. పది సంవత్సరాల తర్వాత కూడా 25 సంవత్సరాల ముందున్న వూపు, ఉత్సాహం నాలో నింపిన ఆ శక్తి ఏమిటి? ఈ పది సంవత్సరాల వ్యవధిలో నన్ను మీ గుండెలకు అతి దగ్గరగా ఉంచుకుని అక్కున చేర్చుకుని ఇంత ప్రేమ చూపిన ఆ శక్తి పేరు.. ఆ అభిమానం పేరు.. నా తమ్ముళ్లు.. సోదరులు.. వారు చూపిన ఆత్మీయత, ప్రేమ అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

కత్తి కథను తీసుకోవడంపై

కత్తి కథను తీసుకోవడంపై

నేను 150వ సినిమా చేయాలనుకున్నప్పుడు కొన్ని కథలు విన్నాను. అప్పుడు షడ్రుచోపేతమైన భోజనం అందించేలా కనిపించిన చిత్రం ‘కత్తి'. ఇందులో కామెడీ, యాక్షన్‌, లవ్‌, అంతకుమించి సందేశం ఉంది. ఈ కథ మీరు చేస్తానంటే దగ్గరుండి రైట్స్‌ ఇప్పిస్తానని తమిళ నటుడు విజయ్‌ అన్నారు. ఆయనకు ధన్యవాదాలు అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

వినాయక్ మాత్రమే గుర్తొచ్చాడు

వినాయక్ మాత్రమే గుర్తొచ్చాడు

కత్తి రీమేక్ ఆలోచన రాగానే నాకు వెంటనే వి.వి.వినాయక్‌ మాత్రమే గుర్తొచ్చారు. వినాయక్‌ను ఎంచుకోవడమే మాకు తొలి విజయం. నిజంగా చరణ్‌ చెప్పినట్లు నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకున్నాడు. అని చిరంజీవి తెలిపారు.

రాననుకున్నారా? రాలేననుకున్నారా?

రాననుకున్నారా? రాలేననుకున్నారా?

మిమల్ని చూస్తుంటే ‘ఇంద్ర' సినిమాలో ఓ డైలాగ్‌ గుర్తొస్తోంది. ‘‘రాననుకున్నారా? రాలేననుకున్నారా? దిల్లీకి పోయాడు. డ్యాన్స్‌లకు దూరమైపోయాడు. హస్తినాపురానికి పోయాడు హాస్యానికి దూరమైపోయాడు.. ఈ మధ్య కాలంలో మా మధ్యన లేడు.. అందుకు మాస్‌కు దూరమైపోయాడు.. అనుకున్నారా? అదే మాస్‌.. అదే గ్రేస్‌.. అదే హోరు.. అదే జోరు. అదే హుషారు. మిమ్మల్ని రంజిపచేయడానికి...అంటూ చిరంజీవి అభిమానులను ఉత్సాహ పరిచారు.

దేవిశ్రీ గురించి

దేవిశ్రీ గురించి

దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన ఒక్కోసాంగ్‌ ఆణిముత్యంలా శ్రోతల్లోకి వెళ్లిపోయింది. మీతో కేరింతలు కొట్టేలా సాంగ్‌ చేయడం నాకు ఎనలేని ఉత్సాహాన్ని ఇచ్చింది. ప్రతీ టెక్నిషియన్‌ నన్ను కొత్తగా చూపించడానికి ప్రయత్నించారని చిరంజీవి చెప్పుకొచ్చారు.

రామ్ చరణ్ గురించి

రామ్ చరణ్ గురించి

రామ్‌చరణ్‌ సమర్థ నిర్మాతగా అవతారం ఎత్తుతాడని వూహించలేదు. చరణ్‌కు నటుడిగా హద్దులూ తెలుసు.. నిర్మాతగా పద్దులూ తెలుసు. భవిష్యత్‌లో మంచి నటుడిగానే కాకుండా నిర్మాతగా స్థిరపడతాడనే నమ్మకం ఉంది అన్నారు చిరంజీవి.

కాజల్ గురించి

కాజల్ గురించి

ఈ చిత్రంలో కాజల్‌ నాతో పోటీ పడి నటించింది. కాజల్‌ది ఓ ప్రత్యేక రికార్డు. గతంలో తండ్రితో చేసి కుమారుడితోనూ చిత్రాలు చేశారు. కానీ కాజల్‌ ఓ కుమారుడితో హిట్‌ సినిమాలు చేసి తండ్రితో కూడా సినిమా చేసిన ఘనత ఆమెది అని చెప్పుకొచ్చారు.

సంక్రాంతి సినిమాలన్నీ ఆడాలి

సంక్రాంతి సినిమాలన్నీ ఆడాలి

సంక్రాంతికి వచ్చే ప్రతీ సినిమా ఆడాలి. నా సోదరుడు బాలకృష్ణ సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి', శర్వానంద్‌ ‘శతమానం భవతి' చిత్రాలు విజయం సాధించాలని కోరుకుంటున్నా' అని చిరంజీవి ఆకాంక్షించారు.

దాసరి మాట్లాడుతూ...

దాసరి మాట్లాడుతూ...

దాసరి మాట్లాడుతూ.. ‘చిరంజీవి మళ్లీ ఎప్పుడు మేకప్‌ వేసుకుంటారా? ఎప్పుడు కథను ఫైనలైజ్‌ చేస్తారా? ఎప్పుడు చూస్తామా? అని ఎదురు చూసిన అభిమానులకు సమాధానం ‘ఖైదీ నంబర్‌ 150'. కేవలం కృషి, పట్టుదలతో పైకి వచ్చిన వ్యక్తి చిరంజీవి. ‘ఖైదీ' కోసం ఎంత కష్టపడ్డారో మీకు తెలుసా? ఇప్పుడు ఎనిమిదేళ్ల తర్వాత చిరంజీవి నటిస్తుంటే జనం చూస్తారా? డ్యాన్స్‌ చేస్తాడా? ఫైట్స్‌ చేస్తాడా? అనుకున్న వారందరికీ ఇదే సమాధానం. చిరంజీవి 25ఏళ్లు కుర్రాడిగా కనిపించబోతున్నారు అంటే ఏడాదిగా ఆయన చేసిన కృషి అనిర్వచనీయం అని దాసరి వ్యాఖ్యానించారు.

చిరంజీవి ఇరగదీశాడు అంటారు

చిరంజీవి ఇరగదీశాడు అంటారు

ఈ సినిమా బిగినింగ్‌లో ఓ పాటను చూశా. ఆ పాట చూసిన తర్వాత నటించింది చిరంజీవా.. రామ్‌చరణా.. అల్లుఅర్జునా.. అనిపించింది. వారు కూడా సరిపోరు అంటారు మీరు. ఈ సినిమాలో ఇంట్రెవల్‌ ఫైట్‌ ఉంది. బయటకు వచ్చి తర్వాత చిరంజీవి ఇరగదీశాడు అంటారు మీరంతా. 11వ తేదీనే సంక్రాంతి వచ్చినట్టు లెక్క. ఈ చిత్రం సమాజానికి ఓ సందేశాన్ని ఇవ్వడానికి వస్తోంది అని దాసరి అన్నారు.

బ్యాగ్రౌండ్ లేకుండా

బ్యాగ్రౌండ్ లేకుండా

పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.... ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఒక సాధారణ వ్యక్తిగా వచ్చిన చిరంజీవి మెగాస్టార్ గా ఎదిగాడని అన్నారు. గతంలో ఖైదీ సినిమాకు తాము మాటలు రాశామని, ఆ సినిమా చిరుతోపాటు తమకు కూడా బ్రేక్ ఇచ్చిందని అన్నారు. చిరంజీవి సినిమాల్లో మూడో వంతు సినిమాలకు మాటలు రాసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు.

మెగాస్టార్ అనే చెట్టుకి

మెగాస్టార్ అనే చెట్టుకి

పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ....దేవుడికోసం భక్తుడు ఎదురు చూసినట్టు ఈ సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారన్నారు. ఇండస్ట్రీలో చిరంజీవి ఇంతింతై వటుడింతై అన్నట్టు ఆయన ఆకశమంత ఎత్తు ఎదిగాడని అన్నారు. మెగాస్టార్ అనే చెట్టుకి నాగబాబు, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరన్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, అల్లు శిరీష్, నిహారిక అనే కొమ్మలు వచ్చాయని, ఈ కొమ్మలన్నీ తమ వారసత్వాన్ని కాపాడుతున్నాయని ఆయన తెలిపారు.

రామ్ చరణ్ మాట్లాడుతూ

రామ్ చరణ్ మాట్లాడుతూ

ఖైదీ నెంబర్ 150 సినిమాకి వీవీ వినాయక్ కేవలం దర్శకుడు మాత్రమే కాదని, నిర్మాతగా కూడా బాధ్యతలు నిర్వర్తించారని ఈ సినిమా నిర్మాత, నటుడు రామ్ చరణ్ తెలిపాడు. మీరు కోరుకుంటున్న చిరంజీవిని చూపించేందుకు ఎలాంటి సినిమా అయితే బాగుటుందో అలాంటి సినిమా దొరికిందని, ఈ సినిమాకు పని చేసిన అందరూ న్యాయం చేశారని ఆయన చెప్పారు. నిర్మాతగా తొలిసినిమాకు అందరూ సహకరించారని ఆయన అన్నారు.

వేలెత్తిచూపిన చేతులు, విమర్శించిన నోళ్లు మూతపడతాయి: అల్లు అర్జున్

వేలెత్తిచూపిన చేతులు, విమర్శించిన నోళ్లు మూతపడతాయి: అల్లు అర్జున్

అల్లు అర్జున్ మాట్లాడుతూ....పదేళ్లుగా ఈ రోజు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను. అన్నయ్య మళ్లీ రావాలి, నటించాలి, వేలెత్తిని చేతులు, విమర్శించిన నోళ్లు మూతపడాలని ఎంతో ఆశించానని, తన ఆశ ఇన్నాళ్టికి నెరవేరిందని అన్నాడు. సినిమా విడుదలైన తరువాత వేలెత్తిచూపిన చేతులు, విమర్శించిన నోళ్లు మూతపడతాయని చెప్పాడు.

సూపర్ హిట్టే అన్న వినాయక్

సూపర్ హిట్టే అన్న వినాయక్

అన్నయ్య చిరంజీవి ఒక మంచి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చారని దర్శకుడు వీవీ వినాయక్ అన్నారు. తన తండ్రి తరువాత పెద్దన్నయ్య రూపంలో తన తప్పులు సరిదిద్దినందుకు ఆయనకు ధన్యవాదాలని అన్నారు. అన్నయ్య సినిమా నుంచి ఏం కోరుకుంటారో... అవన్నీ ఈ సినిమాలో ఉంటాయని, అభిమానులందర్నీ ఈ సినిమా అలరిస్తుందని ఆయన చెప్పారు. సినిమా సూపర్ హిట్ అని, అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదన్నారు

2

2

3

5

5

6

ఖైదీ నెం 150 ఫంక్షన్ పూర్తి ఫోటోల కోసం...

ఖైదీ నెం 150 ఫంక్షన్ పూర్తి ఫోటోల కోసం...

క్లిక్ చేయండి

English summary
Chiranjeevi, Kajal Agrawal acted VV Vinayak directed Khaidi No 150 Movie Pre Release event held at Haailand Resorts & Theme Park, Vijayawada, Guntur High way today (07th Jan) evening, Dasari Narayana Rao, Subbirami Reddy, Chiranjeevi, Ram Charan, Kajal, Nagababu, Allau Aravind, Aswini Dutt, Paruchuri Brothers, Raghu Babu, Fight Master Ram, Lakshman, Producer Sarad Marar, Ali, B Gopal, Brahmanandam, Sai Dharam Tej, Allu Arjun, Allu Sirish, Varun Tej, Devi Sri Prasad and others attended the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu