»   » ఎఫైర్ నిజమే, అంతా రహస్యంగా... పెళ్లైన హీరోతో హీరోయిన్ ప్రేమపెళ్లి (ఫోటోస్)

ఎఫైర్ నిజమే, అంతా రహస్యంగా... పెళ్లైన హీరోతో హీరోయిన్ ప్రేమపెళ్లి (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొచ్చి: సినిమా రంగానికి చెందిన హీరోలు, హీరోయిన్లపై తరచూ ఏదో ఒక రూమర్ చర్కర్లు కొడుతూనే ఉంటుంది. అందులో వారి ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు కూడా వినిపిస్తుంటాయి. కొన్ని సార్లు ఈ రూమర్స్ నిజం అవుతుంటాయి కూడా.

మలయాళం స్టార్ దిలీప్, హీరోయిన్ కావ్య మాధవన్ మధ్య ఎఫైర్ కొనసాగుతుందంటూ కొంత కాలంగా మలయాళ మీడియాలో గాసిప్స్ వినిపిస్తూనే ఉన్నాయి. కావ్యతో ఎఫైర్ వల్లనే దిలీప్ మొదటి భార్యతో విడాకులు అయ్యాయనే టాక్న. అయితే వారెప్పుడూ ఈ గాసిప్స్ మీద స్పందించలేదు.

తాజాగా ఆ గాసిప్స్ నిజం చేస్తూ.... దిలీప్-కావ్య మాధవన్ ప్రేమ వివాహం చేసుకున్నారు.

వివాహం

వివాహం

ఈ రోజు (నవంబర్ 25) కొచ్చిలోని స్టార్ హోటల్‌లో కొన్ని మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగింది.

అంతా రహస్యం

అంతా రహస్యం

అయితే తమ పెళ్లి విషయం గురించి మీడియాకు తెలియకుండా ముందు నుండి జాగ్రత్త పడుతూ వచ్చిన ఈ జంట.... పెళ్లి దుస్తులతో మీడియా ముందుకు వచ్చి ఆశ్చర్యపరిచారు.

దిలీప్‌కు ఆల్రెడీ పెళ్లి కావడం వల్లే... అంతా సీక్రెట్ గా

దిలీప్‌కు ఆల్రెడీ పెళ్లి కావడం వల్లే... అంతా సీక్రెట్ గా

దిలీప్ కు ఆల్రెడీ పెళ్లయింది. ఓ కూతురు కూడా ఉంది. దిలీప్ కుటుంబంలో కొంతకాలంగా అలజడి నెలకొంది. దీనికి కారణం కావ్యతో దిలీప్ ఎఫైరే అనే వార్తలు కూడా మలయాళ మీడియాలో వినిపించాయి.

ఇద్దరి మధ్య ప్రేమ అలా మొదలైంది

ఇద్దరి మధ్య ప్రేమ అలా మొదలైంది

దిలీప్‌, కావ్య కలిసి 23 చిత్రాల్లో నటించారు... ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లాడారు.

మీడియాకు దిలీప్ వివరణ ఇస్తూ

మీడియాకు దిలీప్ వివరణ ఇస్తూ

వివాహం అనంతరం దిలీప్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘నా కుటుంబ సమస్యలకు కావ్యకు ఎలాంటి సంబంధం లేదు, వాటికి ఆమె కారణం ఏమాత్రం కాదు. నా కుటుంబ సభ్యులతో, కూతురు చర్చించి వారి అంగీకారంతోనే కావ్యను వివాహం చేసుకున్నాను' అన్నారు.

మీడియా వారికి విన్నపం

మీడియా వారికి విన్నపం

అయితే తమ పెళ్లి విషయం, కుటుంబానికి సంబంధించిన విషయాలు పూర్తిగా తమ వ్యక్తిగతం అని, ఈ విషయాన్ని మీడియా మళ్లీ వివాదాస్పదం చేయవద్దని, తమకు ప్రైవసీ ఇవ్వాలని విజ్ఞప్తి చేసారు.

దీలీప్ మొదటి భార్య వివరాలు

దీలీప్ మొదటి భార్య వివరాలు

దిలీప్‌ మొదటి వివాహం 1998లో మంజు అనే నటితో జరిగింది. వీరి ఓ కుమార్త కూడా ఉంది. అయితే తర్వాత ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో 2014లో విడిపోయారు. కావ్యతో ఎఫైరే వీరు విడిపోవడానికి ప్రధాన కారణమనే రూమర్స్ కూడా ఉన్నాయి.

కావ్యకు కూడా రెండో వివాహమే

కావ్యకు కూడా రెండో వివాహమే

కావ్య గతంలో నిషాల్‌ చంద్ర అనే నటుడ్ని వివాహం చేసకున్నారు. కానీ వీరి కాపురం ఎక్కువ కాలం నిలవలేదు. పరస్పర అంగీకారంతో ఇద్దరూ విడిపోయారు.

English summary
Dileep and Kavya Madhavan, the most celebrated star pair of Mollywood, are finally getting married. As per the official reports, Dileep and Kavya tied the knot today, at a private hotel in Kochi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu