»   » హార్ట్ ఎటాక్: పూరితో నితిన్ హాట్రిక్ సంబరం (ఫోటోలు)

హార్ట్ ఎటాక్: పూరితో నితిన్ హాట్రిక్ సంబరం (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే చిత్రాలతో వరుస విజయాలు సొంతం చేసుకున్న యంగ్ హీరో నితిన్, తాజాగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'హార్ట్ ఎటాక్' చిత్రంతో హాట్రిక్ విజయం సొంతం చేసుకున్నాడు. 'హార్ట్ ఎటాక్' ఆడియోతో పాటు సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో ప్లాటినమ్ వేడుక ఏర్పాటు చేసారు.

పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్లో నితిన్, అదా శర్మ హీరో హీరోయిన్లుగా తెకకెక్కిన 'హార్ట్ ఎటాక్' చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. భాస్కర భట్ల రాసిన పాటలు సినిమా ఆడియో అద్భుతంగా రావడానికి దోహద పడింది. ఈ ప్లాటినమ్ డిస్క్ వేడుకలో అందరూ అనూప్ రూబెన్స్, భాస్కర భట్ల పని తీరును అభినందించారు.

ఈ కార్యక్రమంలో దర్శకుడు పూరి జగన్నాథ్, నితిన్, అలీ, అనూప్ రూబెన్స్, విక్రమ్ జీత్, భాస్కరభట్ల, శేఖర్, రామ్ లక్ష్మణ్, బ్రహ్మకడలి తదితరులు పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వివరాలు స్లైడ్ షోలో....

ఈ వేడుకకు కారణం ఆ ఇద్దరే...

ఈ వేడుకకు కారణం ఆ ఇద్దరే...


దర్శకుడు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ....ఇపుడు జరుగుతున్న ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్‌కి కారణం అనూప్ రూబెన్స్, భాస్కర్ భట్ల. ఈ ఇద్దరూ మంచి మ్యూజిక్, లిరిక్స్ అందించడం వల్లనే ఆడియో ఇంత పెద్ద హిట్టయింది అన్నారు. భాస్కర భట్ల నా సినిమాలకు ఇంకా మరిన్ని మంచి లిరిక్స్ రాయాలని పెన్ కూడా కొనిచ్చాను అన్నారు.

అందరూ హ్యాపీ అంటున్న నితిన్

అందరూ హ్యాపీ అంటున్న నితిన్


నితిన్ మాట్లాడుతూ....ఈ సినిమా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. సినిమా దర్శక నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. పూరి గారు ఈ సినిమాలో నన్ను కొత్తగా చూపించి మాస్ ఇమేజ్ ఇచ్చారు. అనూప్, భాస్కర భట్ల సంగీతం, సాహిత్యం అద్భుతంగా కుదిరింది అన్నారు.

నాకు ఇది స్పెషల్ సినిమా

నాకు ఇది స్పెషల్ సినిమా


అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ....ఈ చిత్రం నాకు చాలా చాలా స్పెషల్. నితిన్‌తో కలిసి హ్యాట్రిక్ కొట్టాను. భాస్కర భట్ల గారు మంచి సాహిత్యం అందించడం వల్లనే ఇంత బాగా ట్యూన్స్ ఇవ్వగలిగాను. ఆయన ఈ సినిమాకు సింగిల్ కార్డు రాసారు అన్నారు.

భాస్కర భట్ల మాట్లాడుతూ..

భాస్కర భట్ల మాట్లాడుతూ..


పాటల రచయిత భాస్కర భట్ల మాట్లాడుతూ....ఈ సినిమాకు సింగిల్ కార్డు పని చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి అవకాశం ఇచ్చిన పూరిగారికి థాంక్స్. ఆయనకు ఎటువంటి ఇన్ పుట్ కావాలో చెప్పి మరీ నాతో రాయించుకున్నారు. అనూప్ చక్కని ట్యూన్స్ ఇచ్చారు. ఆడియో, సినిమా హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు అన్నారు.

English summary
'Heart Attack' platinum disc function held at Hyderabad. The movie directed and produced by Puri Jagannadh under the Puri Jagannadh Touring Talkies. The film stars Nithiin and Adah Sharma in lead roles. Anoop Rubens composed the soundtrack for the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu