twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లాఠీఛార్జి,లేటు ప్రారంభం: ‘సరైనోడు’ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైలెట్స్, సైడ్ లైట్స్ (ఫొటోలు)

    By Srikanya
    |

    విశాఖపట్నం : ఎర్రతోలు కదా సైలెంట్‌గా ఉంటాడనుకునేరు... మాస్‌... వూరమాస్‌.. అంటూ స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ చెప్పిన డైలాగ్‌ సాగర తీరంలో
    పడిలేచిన కెరటంలా ధ్వనించింది. ఫ్యాన్స్ కరతాళధ్వనులు, కేరింతలు సముద్ర ఘోషను మించి హోరెత్తాయి. అల్లు అర్జున్‌ హీరోగా నటించిన సరైనోడు ఆడియో విజయోత్సవం సాగర తీరంలో వైభవంగా జరిగింది.

    'సరైనోడు' ఆడియో విజయోత్సవంలో భాగంగా.. ఆర్కేబీచ్‌ పరిసరాలు తారలతో తళుకులీనాయి. చిరంజీవి, అల్లు అర్జున్‌, అల్లు అరవింద్‌, అల్లు శిరీష్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, సాయికుమార్‌, శ్రీకాంత్‌, ఆది పినిశెట్టి, పృథ్వి, అల్లు అరవింద్‌, బోయపాటి శ్రీను, దిల్‌రాజు, హరీష్‌ శంకర్‌, తమన్‌ వంటి సినీ దిగ్గజాలంతా రావడంతో అభిమానుల ఆనందానికి అంతులేకుండా పోయింది.

    కార్యక్రమం సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం కావలసి ఉండగా, మధ్యాహ్నం 3.30 నుంచే అభిమానులు వేదిక వద్దకు చేరారు. కార్యక్రమం రాత్రి 7.30 గంటల వరకు ప్రారంభం కాలేదు. దీంతో వారంతా తీవ్ర ఎండను భరిస్తూ.. రాత్రి వరకు సుమారు నాలుగు గంటల సేపు వేచి చూశారు.

    ఆదివారం రాత్రి విశాఖపట్నంలో జరిగిన 'సరైనోడు' పాటల విజయోత్సవానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అల్లు అర్జున్‌ హీరోగా నటించిన చిత్రమిది. రకుల్‌ప్రీత్‌ సింగ్‌, కేథరిన్‌ హీరోయిన్స్. బోయపాటి శ్రీను దర్శకుడు. అల్లు అరవింద్‌ నిర్మాత. తమన్‌ స్వరాలందించారు.

    ఈ వేడుకను ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించడంలో పోలీసులు విఫలమయ్యారు. మధ్యాహ్నం నుంచి పాస్‌ల్లేని వారిని లోపలకు వదలడంతో.. పాస్‌లు ఉన్నవారు లోనికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు లాఠీచార్జి చేసి చెల్లాచెదురు చేశారు.

    బీచ్‌రోడ్డు అంతా ఖాళీగా వదిలేసి, ఇరుకు ప్రాంతంలో వాహనాలకు పార్కింగ్‌ ఇచ్చారు. ప్రముఖుల రాకపోకల సమయంలో కూడా రద్దీని నియంత్రించడంలో విఫలమయ్యారు. రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు, దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత దిల్‌ రాజు, దర్శకుడు హరీష్‌ శంకర్‌, సంగీత దర్శకుడు తమన్‌, ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి, పాటల రచయిత అనంత శ్రీరామ్‌ తదితరులు పాల్గొన్నారు.

    స్లైడ్ షోలో హైలెట్స్...

    వ్యాఖ్యానం

    వ్యాఖ్యానం

    సుమ వ్యాఖ్యతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో ప్రదర్శించిన నృత్యాలు, పాటలు అభిమానులను ఉర్రూతలూగించాయి.

     బన్నీ మాట్లాడుతూ...

    బన్నీ మాట్లాడుతూ...

    ఆర్య చిత్రం నుంచి విశాఖతో తనకు ఉన్న అనుభూతిని పంచుకున్నారు.

    కల..

    కల..

    ఇక్కడ ఏదైనా ఆడియో వేడుక, సినిమా విజయోత్సవ సభ నిర్వహించాలనేది తన కల అని, అది ఈ విధంగా నెరవేరిందని బన్ని అన్నారు.

    చిరంజీవి మాట్లాడుతూ..

    చిరంజీవి మాట్లాడుతూ..

    విశాఖ ప్రజల మనస్తత్వం ఈ వేడుకకు రప్పించిందన్నారు. రిటైర్మెంట్‌ ఉంటే తాను ఇక్కడే నివాసం ఏర్పరుచుకుంటానని తెలిపారు.

    చిరు కంటిన్యూ చేస్తూ..

    చిరు కంటిన్యూ చేస్తూ..

    రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందాలనేది నా ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్‌ ఫైనాన్షియల్‌ రాజధాని అయిన విశాఖపట్నంలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం తనవంతుగా ముందుకు రావాలి అన్నారు.

    అప్పుడే అభివృద్ది

    అప్పుడే అభివృద్ది

    మాటలు చెప్పడం కాకుండా చేతల్లో చూపించాలి. అప్పుడే ఇక్కడ చిత్ర పరిశ్రమ అభివృద్ధి సాధ్యమవుతుంది.

    కాలనీ కావాలి..

    కాలనీ కావాలి..

    హైదరాబాద్‌ చిత్రపురి కాలనీలాగా ఇక్కడా ఓ కాలనీ ఏర్పాటు చేసి 24 క్రాఫ్ట్స్‌ కార్మికులు ఇక్కడ ఉండేలా చూడలి.

    విన్నపం..

    విన్నపం..

    పరిశ్రమ అభివృద్ధి కోసం మౌలిక సదుపాయాలు కల్పించాలని గంటా శ్రీనివాసరావుగారి ద్వారా ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నా...అన్నారు చిరంజీవి.

    వెనక ఉన్నానని...

    వెనక ఉన్నానని...


    నేను మీ వెనుక ఉన్నానని ఎక్కడా అలసత్వం చూపించొద్దని మా ఇంట్లో హీరోలకు చెబుతుంటాను. అలసత్వం చూపిస్తే వృద్ధి ఆగిపోతుంది. నేను చెప్పిన మాట విని అందరూ విజయవంతంగా ముందుకు సాగుతున్నారు అన్నారు చిరు.

    గర్వంగా..

    గర్వంగా..

    అల్లు అర్జున్‌ విజయాలు చూస్తుంటే గర్వంగా ఉంటుంది. అవకాశాలు రావడం ఒకెత్తు. దాన్ని నిలబెట్టుకోవడం ఇంకో ఎత్తు. బన్నీ వచ్చిన అవకాశాల్ని నిలబెట్టుకొని విజయాలు సాధిస్తున్నాడు అన్నారు చిరంజీవి.

    ఇక్కడే కాదు..

    ఇక్కడే కాదు..

    బన్నీ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు కర్ణాటక, కేరళలోనూ అభిమానుల్ని సంపాదించుకున్నాడు అని చెప్పుకొచ్చారు చిరంజీవి.

    ప్రొఫెషనలిజం

    ప్రొఫెషనలిజం

    బయట సరదాగా, చిలిపిగా ఉండే బన్నీలో హుందాతనం, పక్కా ప్రొఫెషనలిజం కనిపిస్తోంది అని అన్నారు.

    వరసపెట్టి..

    వరసపెట్టి..


    ‘రుద్రమదేవి'లోని గోన గన్నారెడ్డి పాత్రను అద్భుతంగా చేశాడు. ఆ తర్వాత ‘సన్నాఫ్‌ సత్యమూర్తి'లో పరిణితి ఉన్నపాత్ర చేశాడు. ఇప్పుడు ‘సరైనోడు' వూర మాస్‌ అంటూ అలరిస్తాడు అని చెప్పుకొచ్చారు.

    మాస్ మాత్రమే కదాు..

    మాస్ మాత్రమే కదాు..

    బోయపాటి శ్రీను అంటే పక్కా మాస్‌ దర్శకుడే కాదు. సెంటిమెంట్‌, డ్రామా, యాక్షన్‌ సన్నివేశాలు, పంచ్‌ డైలాగ్‌లు.. ఇలా అన్నీ ఉండేలా సినిమా తీయగలుగుతాడు.

    ఆణిముత్యం..

    ఆణిముత్యం..

    తమన్‌ అందించిన ప్రతి పాట ఆణిమత్యం లాంటిదే. ఈ నెల 22న వస్తోన్న ‘సరైనోడు' అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను''అన్నారు.

    సాలిడ్ గా..

    సాలిడ్ గా..


    అల్లు అర్జున్‌ మాట్లాడుతూ ...తమన్‌ ఎంత సాలిడ్‌గా ఉంటాడో పాటలు అంతే. ఈ సినిమాకు సరైన పాటలు అందించిన సరైనోడు తమన్‌.

    అప్పుడే అనుకున్నా

    అప్పుడే అనుకున్నా

    ‘ఆర్య' సినిమా చిత్రీకరణ జరుగుతున్నప్పుడు ఆర్‌.కె.బీచ్‌ దగ్గర నా సినిమా పాటల వేడుకో లేదంటే ఇంకేదైనా కార్యక్రమమో జరగాలనుకున్నాను. ఈ సినిమాతో అది సాధించాను.

    కరాటే..

    కరాటే..

    నేను, ఆది కలసి చిన్నతనంలో కరాటే శిక్షణ తీసుకున్నాం. అలాంటి ఆదితో ఇప్పుడు సినిమా చేయడం ఆనందంగా ఉంది.

    ఆదిపాత్ర నేను చేస్తా...

    ఆదిపాత్ర నేను చేస్తా...

    ఒకవేళ ఈ సినిమా ఇతర భాషలో ఎవరైనా చేస్తే నేను ఆది పాత్ర చేస్తా. అంతగా నచ్చిందా పాత్ర.

    హీరోలని బట్టి..

    హీరోలని బట్టి..

    బోయపాటి శ్రీను హీరోను బట్టి సినిమాలు డిజైన్‌ చేస్తారు. ఈ సినిమా విడుదలయ్యాక ఆయన కేవలం మాస్‌ డైరక్టరే కాదు అన్ని రకాల సినిమాలూ చేయగలరని మరోసారి తెలుస్తుంది.

    చిరు దయే...

    చిరు దయే...

    ఈ రోజు నేనిలా ప్రేక్షకుల ముందు నిలబడ్డాను అంటే అది చిరంజీవిగారి వల్లే. నేనే కాదు పవన్‌ కల్యాణ్‌, రామ్‌చరణ్‌, శిరీష్‌, సాయిధరమ్‌తేజ్‌... ఇలా మా కుటుంబం ఎవరు వచ్చినా అది చిరంజీవిగారు వేసిన దారి వల్లే. ఆయన లేకపోతే మేం లేం'' అన్నారు.

    గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ

    గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ

    ‘‘సినిమా పరిశ్రమ విశాఖకు రావాలని కోరుకుంటున్నాం. దానికి శ్రీకారమే ఈ కార్యక్రమం. బన్నీ తొలి సినిమా నుంచి ఇప్పటివరకు ఎంతో వృద్ధి చెందుతూ వస్తున్నాడు. సినిమా విజయోత్సవమూ ఇక్కడే నిర్వహించాలని కోరుకుంటున్నా'' అన్నారు.

    అల్లు అరవింద్‌ మాట్లాడుతూ...

    అల్లు అరవింద్‌ మాట్లాడుతూ...

    ‘‘బోయపాటి శ్రీను ఈ సినిమా పరిశ్రమకు సరైనోడు అని ఈ సినిమాతో మరోసారి రుజువు చేస్తాడు. తమన్‌ అందించిన పాటలు శ్రోతలకు బాగా నచ్చాయ''అన్నారు.

    తమన్‌ మాట్లాడుతూ ...

    తమన్‌ మాట్లాడుతూ ...


    ‘‘సంగీత దర్శకుడికి మంచి డ్యాన్సర్‌ దొరికితే ఎలా ఉంటుందనడానికి ఈ సినిమా ఓ ఉదాహరణ. నేను అందించిన పాటలకు బన్ని సూపర్‌ స్టెప్పులేశాడు. పాటలు బాగా కుదిరాయి''అన్నారు.

    ఆది పినిశెట్టి మాట్లాడుతూ...

    ఆది పినిశెట్టి మాట్లాడుతూ...

    ‘‘సరైనోడు' యూనిట్ లో అందరూ సరైనోళ్లే. ప్రేక్షకుల నాడి తెలిసిన దర్శకుడు బోయపాటి శ్రీను. బన్నీ ఇంత పెద్ద హీరో అయినా నిత్యం అభిమానులను ఎలా అలరించాలా అనే తపన పడుతుంటాడు''అన్నారు.

    రకుల్‌ప్రీత్‌ సింగ్‌ మాట్లాడుతూ ....

    రకుల్‌ప్రీత్‌ సింగ్‌ మాట్లాడుతూ ....


    ‘‘అల్లు అర్జున్‌ నా అభిమాన నటుడు అని ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పుడూ అదే చెబుతున్నాను. బన్నీతో పని చేయడం మంచి అనుభవము''అన్నారు.

    బోయపాటి శ్రీను మాట్లాడుతూ ....

    బోయపాటి శ్రీను మాట్లాడుతూ ....

    ‘‘న్యాయం నాలుగు కాళ్ల మీద నిలబడాలి... అన్యాయానికి అసలు కాళ్లే ఉండకూడదు అని నమ్మే ఒక కుర్రాడి కథ ఈ సినిమా. కృషి, కసి కలిపితే అది బన్నీ. అంతటి సత్తా ఉన్న వ్యక్తి అతను. ‘అన్నయ్య' సినిమాకు నేను దర్శకత్వ శాఖలో పని చేశాను. ఆ తర్వాత దర్శకుణ్ని అయ్యాను. చిరంజీవిగారిని స్ఫూర్తిగా తీసుకొని అందరూ ముందుకెళ్లాలి. అభిమానులకు నేను చెప్పే విషయం ఒక్కటే ‘గుండె మీద చెయ్యేసుకొని ఈ సినిమా చూడండి'' అన్నారు.

    English summary
    Allu Arjun's Sarrainodu, which is slated to hit screens on 22 April, had its pre-release event in Vizag yesterday. Chiranjeevi Graced the occasion and said that he loves to spend his retirement life in the city.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X