»   » ‘లెజెండ్’ బైకుపై మోక్షజ్ఞ...అదరగొట్టాడు (ఫోటోలు)

‘లెజెండ్’ బైకుపై మోక్షజ్ఞ...అదరగొట్టాడు (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ నటవారసుడిగా మోక్షజ్ఞ త్వరలో తెర్రంగేటం చేయబోతున్న సంగతి తెలిసిందే. సినిమాల్లోకి ఇంకా ఎంట్రీ ఇవ్వకముందు నాన్నతో వివిధ సినిమా కార్యక్రమాలకు హాజరవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు మోక్షు. తాజాగా 'లెజెండ్' సినిమాలో బాలకృష్ణ వాడిన బైకుతో ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తున్నాడు. బాలయ్య అభిమానులు.....మోక్షజ్ఞ ఫోటోలు చూసి తెగ సంబర పడిపోతున్నారు.

పరిశ్రమ వర్గాలు చెప్తున్న ప్రకారం మోక్షజ్ఞ ఎంట్రీ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టైనర్మెంట్స్ వారే నిర్మించనున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా మోక్షజ్ఞ లెజండ్ సైట్స్ పైకి వచ్చారని,అప్పుడు నిర్మాతలు ఈ టాపిక్ తెచ్చారని తెలుస్తోంది. అలాగే బాలకృష్ణ పాజిటివ్ గా స్పందించారని చెప్పుకుంటున్నారు.

ఇక ఈ చిత్రానికి 'N' అనే టైటిల్ పెట్టాలని యోచిస్తున్నట్లు బాలకృష్ణకు ఇదే విషయం చెప్పినట్లు సమాచారం. బాలకృష్ణ మాత్రం టైటిల్ బాగున్నా...మరో రెండేళ్ళు అంటే చదువు పూర్తి అయ్యే దాకా తెరపైకి తెచ్చే ఆలోచన లేదని చెప్పినట్లు తెలుస్తోంది.

అభిమానుల ఆసక్తి

అభిమానుల ఆసక్తి

బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి అంతటా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. దానికి తోడు అతని ఎంట్రీపై రోజుకో వార్త వస్తోంది. గతంలో బాలకృష్ణ ఆ విషయంపై క్లారిటీ ఇచ్చారు. తన కుమారుడు మోక్షజ్ఞ ప్రస్తుతం బీబీఎం చదువుతున్నాడని, చదువు పూర్తయ్యాక అతడి ఆసక్తిని బట్టి భవిష్యత్తు నిర్ణయమవుతుందని బాలకృష్ణ చెప్పారు.

బాలయ్య పర్ ఫెక్ట్ ప్లాన్

బాలయ్య పర్ ఫెక్ట్ ప్లాన్

మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు జరిగినా బాలయ్య ప్లాన్ ప్రకారం వెళుతున్నారని అంటున్నారు. తనయుడి ఎంట్రీపై చెప్పక పోయినప్పటికీ ఓ మంచి నిర్మాత, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ చేతిలో తనయుడిని పెట్టేందుకు బాలయ్య చూస్తున్నారని అంటున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. డైరెక్టర్ విషయంలో కూడా బాలయ్య ఆచితూచి అడుగులు వేస్తున్నారని అంటున్నారు.

మోక్షజ్ఞ ట్రైనింగ్

మోక్షజ్ఞ ట్రైనింగ్

ఇప్పటికే మోక్షజ్ఞను లండన్ పంపించి అక్కడ మార్షల్ ఆర్ట్స్, డాన్స్, యాక్టింగులో ట్రైనింగ్ ఇప్పించేందుకు బాలయ్య సన్నాహాలు చేస్తున్నారనే టాక్ వచ్చింది. మోక్షజ్ఞ రెండేళ్ల తర్వాత వచ్చినా, 2014 లో వచ్చినా తనయుడి విషయంలో మాత్రం బాలయ్య ప్లాన్డ్‌గా వెళుతున్నారనే వ్యాఖ్యలు మాత్రం వినిపిస్తున్నాయి.

లెజెండ్

లెజెండ్

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య హీరోగా తెరకెక్కుతున్న ‘లెజెండ్' చిత్రం ఆడియో వేడుక కార్యక్రమం ఈ రోజు(మార్చి 7) శిల్పకళా వేదికలో గ్రాండ్‌గా జరిపేందుకు ప్లాన్ చేసారు.

English summary
Lineage is a big thing in Telugu industry and preparations are underway for yet another hero from Nandamuri’s family to stake claim to the NTR legacy. He is none other than Balakrishna’s son Mokshagna.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu