»   » మెగా యంగ్ హీరోలంతా వచ్చి లాంచ్ చేసారు (‘ఒక మనసు’ఆడియో)

మెగా యంగ్ హీరోలంతా వచ్చి లాంచ్ చేసారు (‘ఒక మనసు’ఆడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :మెగా ఫ్యామిలీ నుంచి ఓ హీరోయిన్ వచ్చింది. నాగబాబు కూతురు నిహారిక హీరోయిన్‌గా పరిచయం చేస్తూ చేసిన సినిమా 'ఒక మనసు'. చిత్రం అనౌన్స్ అయినరోజునుంచే మంచి అంచనాలను రేకెత్తించిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, టీజర్‌తో అందరినీ కట్టిపడేసిన సంగతి తెలిసిందే.

ఓ పూర్తి స్దాయి లవ్ స్టోరీగా రెడీ అయిన ఈ సినిమాకు సంబంధించిన ఆడియో ఆవిష్కరణ వేడుకను నిన్న రాత్రి హైద్రాబాద్‌ శిల్పకళావేదికలో ఘనంగా నిర్వహించారు. తమ ఫ్యామిలీ నుంచి మొట్టమొదటసారి ఓ హీరోయిన్‍ ఎంట్రీ ఇస్తోన్న సినిమా కావడంతో మెగా యంగ్ హీరోలంతా వచ్చి ఈ ఆడియో లాంచింగ్ ఫంక్షన్ ని విజయవంతం చేసారు.


ముఖ్యంగా ఒకే వేదికపై మెగా యంగ్ హీరోలు రామ్ చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ,...ఇలా మెగా హీరోలనంతా మెరవంతో ఓ మెగా లుక్ వచ్చేసింది.


రామ్ చరణ్, బన్నీ, సాయుధరమ్ తేజ్.. అందరూ నిహారిక సినిమాల్లోకి రావడం సంతోషంగా ఉందని తెలియజేస్తూ, విషెష్ తెలిపారు. టీవీ 9 సంస్థతో కలిసి దర్శక నిర్మాత మధుర శ్రీధర్ నిర్మించిన ఈ సినిమాకు 'మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు' లాంటి అందమైన సినిమా తీసిన రామరాజు దర్శకత్వం వహించారు. జూన్‍లో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.


స్లైడ్ షోలో ఆడియో విశేషాలతో, ఫొటోలను చూడవచ్చు.


ఆడియో సీడి ఆవిష్కరణ

ఆడియో సీడి ఆవిష్కరణ

నీహారిక సోదరుడు హీరో రామ్‌చరణ్ ఈ చిత్రం బిగ్ సీడీని ఆవిష్కరించారు.రామ్‌చరణ్ మాట్లాడుతూ...

రామ్‌చరణ్ మాట్లాడుతూ...

''చిరంజీవిగారు వేసిన బాటలో మేం కష్టపడు తున్నాం. నీహా మా కన్నా ఎక్కువ కష్టపడుతోంది. తెలుగు పరిశ్రమకు ఆహ్వానం పలుకుతున్నా. నీహాకు ఎలాంటి కోస్టార్ దొరుకుతాడో అని ఎదురుచూశా. నాగశౌర్య స్వచ్ఛమైన తెలుగబ్బాయిలా ఉంటాడు. నీహాను చూశాక తమ ఇంటి అమ్మాయిలా అందరూ అనుకుంటారు'' అన్నారు.


వరుణ్ తేజ మాట్లాడుతూ..

వరుణ్ తేజ మాట్లాడుతూ..

''నేను 'కంచె' సినిమా చేస్తున్నప్పుడు 'మల్లెల తీరంలో..' చూశాను. మా చెల్లి మంచి దర్శకుని చేతిలో పడిందని హ్యాపీగా ఉంది. ఈ రోజు ఉన్న హీరోల్లో నాగశౌర్య మంచి నటుడు. నీహారికను చిన్నప్పుడు 'ఏమవుతావు' అని అడిగితే ఐఏఎస్, డాక్టర్ అవుతాననేది. ఇప్పుడు మాతో పాటే సినిమాల్లోకి వచ్చేసింది. కొత్తలో తన మీద నమ్మకం ఉండేది కాదు. నెమ్మదిగా నాకు కూడా నమ్మకం కుదిరింది'' అని వరుణ్‌తేజ్ చెప్పారు.


నాగ బాబు మాట్లాడుతూ...

నాగ బాబు మాట్లాడుతూ...

''నీహారికకు మంచి కథ ఇచ్చారు.ఇంతమంది హీరోలున్న ఫ్యామిలీ నుంచి నీహారిక హీరోయిన్‌గా వెళుతుందని చెప్పగానే అందరూ ప్రోత్సహించారు. నీహారిక మాస్ కమ్యూనికేషన్ చేశాక సినిమాల్లోకి ఎంటరవుతానంటూ, 'హీరోలు వస్తున్నప్పుడు ఏమీ మాట్లాడరేం? ఆడపిల్లలు వస్తున్నప్పుడే మాట్లాడతారేం?'అని ప్రశ్నించింది. నన్ను మారు మాటాడకుండా చేసింది. అందుకే నీహారికను తనకు ఇష్టమైన రంగంలోకి పంపించాను.


నాగబాబు కంటిన్యూ చేస్తూ..

నాగబాబు కంటిన్యూ చేస్తూ..

ప్రతి పేరెంట్ కూడా తమ కూతుళ్లు కన్న కలలను సాకారం చేసుకోవడానికి ప్రోత్స హించాలని కోరుతున్నా. ఆడపిల్లలను అబ్బాయిల కన్నా ఎక్కువగా లేక సమానంగా ప్రోత్సహించండి'' అని నాగబాబు చెప్పారు.


నీహారిక మాట్లాడుతూ....

నీహారిక మాట్లాడుతూ....

''రామరాజు గారు స్క్రిప్ట్ నెరేట్ చేస్తుంటే అలా వినాలనిపించింది. నేను ఈ సినిమాలో కొన్ని సీన్స్‌లో బాగా యాక్ట్ చేశానంటే నాగశౌర్య కారణం. అమ్మ ప్రేమను వర్ణించడం ఎవరి తరం కాదు. కానీ, ఈ సినిమా మాత్రం అమ్మ ప్రేమంత స్వచ్ఛంగా ఉంటుంది'' అన్నారు.


నాగశౌర్య మాట్లాడుతూ..

నాగశౌర్య మాట్లాడుతూ..

''రామరాజుగారి వల్లే మేమింత బాగా యాక్ట్ చేయగలిగాం'' అని నాగశౌర్య అన్నారు.ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్‌ మాట్లాడుతూ..

ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్‌ మాట్లాడుతూ..

మెగా ఫ్యామిలీలో ఈ రోజుకు ప్రత్యేకత ఉందన్నారు. తెలుగు అమ్మాయిలను సినీ పరిశ్రమకు తీసుకురావడమే కష్టతరమైన నేపథ్యంలో మెగా వారసురాలిగా నిహారిక సినీ రంగంలోకి అడుగుపెట్టడం అభినందనీయమన్నారు. ఆమెను ప్రోత్సహించినందుకు గాను నాగబాబు దంపతులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు చెప్పారు.


బన్నికి బాగుండేదే అనుకున్నాం

బన్నికి బాగుండేదే అనుకున్నాం

''తెలుగు అమ్మాయిలు హీరోయిన్‌గా దొరకరు. నాగబాబు ధైర్యం చేసి నీహారికను హీరోయిన్‌ని చేశారు. హీరోయిన్ అవు తుందని, కాదని ఇలా ఇంట్లో తర్జనభర్జన జరుగుతున్నప్పుడు నాగశౌర్యతో సినిమా చేస్తోందని మీడియా ద్వారా తెలిసింది. అరె.. బన్నీ సరసన హీరోయిన్‌గా చేస్తే బాగుంటుందనిపిం చింది. సరిగ్గా అప్పుడే 'సరైనోడు' స్టార్ట్ అయింది. ఇది మా ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. ఇప్పుడే అందరికీ చెబుతున్నా'' అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు.


అల్లు అర్జున్ మాట్లాడుతూ..

అల్లు అర్జున్ మాట్లాడుతూ..

నీహారికసాయి ధరమ్ తేజ మాట్లాడుతూ...

సాయి ధరమ్ తేజ మాట్లాడుతూ...

నీహారికకు ఈ సినిమాతో విజయం సాధించాలని విషెష్ తెలియచేసారుఅల్లు అర్జున్ మాట్లాడుతూ..

అల్లు అర్జున్ మాట్లాడుతూ..

''నీహా నువ్వు ఏ పని చేపట్టినా,ఆనందం లభిస్తుందని ఆశిస్తున్నా'' అని నీహారికకు ముందుగా శుభాకాంక్షలు చెప్పారు అల్లు అర్జున్.అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ..

అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ..

నిహారికను స్ఫూర్తిగా తీసుకొని తెలుగు యువతులు చలనచిత్ర పరిశ్రమలోకి రావాలని కోరుకుంటున్నట్లు సినీ దర్శకుడు, నటుడు అవసరాల శ్రీనివాస్‌ అన్నారు.పనిలో పనిగా బన్నీ

పనిలో పనిగా బన్నీ

ఇక ఈ ఆడియో పంక్షన్ లోనే అల్లు అర్జున్ ఇటీవల వచ్చిన చెప్పను బ్రదర్ వివాదం గురించి తన వివరణ కూడా ఇచ్చారు. ఆ మధ్య విజయవాడలో 'సరైనోడు' థ్యాంక్స్ మీట్‌లో ఫ్యాన్స్ 'పవర్ స్టార్.. పవర్ స్టార్' అని అరవడం, 'నేను చెప్పను బ్రదర్' అని బన్నీ అనడం తెలిసిందే. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైన బన్నీ ఈ విషయం గురించి ఆడియో వేడుకలో వివరణ ఇస్తూ మాట్లాడారు.


ఇంకా ఎవరెరు

ఇంకా ఎవరెరు

ఈ వేడుకలో నీహారిక తల్లి పద్మజ, చిరంజీవి కుమార్తె సుస్మిత సైతం పాల్గొన్నారు.English summary
Ram Charan releaseed the audio of "Oka Manasu" as the chief guest. The audio launch event of "Oka Manasu" held at Shilpakala Vedhika in Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu