»   »  ఫోటోలు : కూతురుతో శృంగార తార శ్వేతామీనన్

ఫోటోలు : కూతురుతో శృంగార తార శ్వేతామీనన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నయ్ : రాజన్న, రతి నిర్వేదం చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన మళయాల నటి, 2004 మిస్ ఇండియా రన్నరప్ శ్వేతా మీనన్ గత సంవత్సరం సెంబర్ 27న ముంబైలోని నానావతి ఆసుపత్రిలో ఆడ శిశువుకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆమె నటించిన 'కాలి మన్ను' అనే మళయాల చిత్రంలో నటిస్తుండటంతో సహజత్వం కోసం ఆమె రియల్ డెలివరీ సీన్లను కూడా సినిమా కోసం చిత్రీకరించారు.

తాజాగా శ్వేతా మీనన్ తన కూతురుతో కలిసి తొలిసారి పబ్లిక్ లోకి వచ్చింది. ఇటీవల కేరళలోని అల్లెప్పేయ్ లో జరిగిన గ్రీన్ డ్రైవ్(మొక్కలు నాటే కార్యక్రమం)లో ఆమె తన కూతురు సబైనాతో కలసి వచ్చి అందరినీ ఆశ్చర్య పరించింది. సబైనాతో ఆ కార్యక్రమం ప్రారంభింప చేసారు. ఈ సందర్భంగా శ్వేతా మీనన్ మాట్లాడుతూ....మాతృత్వాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తున్నాను అని వెల్లడించారు.

ఒక సినిమా కోసం....డెలివరీ సందర్భంగా చిత్రీకరించిన తొలి పాపగా సబైనా రికార్డు సృష్టించింది. డెలివరీ సమయంలో మహిళ ఎమోషన్స్, ఆమె పరిస్థితి ఎలా ఉంటుందనే విషయాలు సినిమాలో ఉండటం వల్లే సహజత్వం కోసం రియల్ డెలివరీ సీన్ చిత్రీకరించారట.


శ్వేతా మీనన్ కేరళ ప్రభుత్వం నుంచి చలన చిత్ర అవార్డు అందుకున్న సందర్భంగా కూతురు సబైనాతో....


భర్త, కూతురుతో కలిసి కేరళ ప్రభుత్వం సినీ అవార్డుల కార్యక్రమంలో శ్వేతా మీనన్


కేరళ ముఖ్య మంతరి ఉమెన్ చాందీ నుంచి....కూతురుతో కలిసి అవార్డు అందుకుంటున్న శ్వేతా మీనన్


మళయాల నటుడు దిలీప్ శ్వేతా మీనన్ కూతురు సబైనాతో ఆడుకుంటూ ఇలా కెమెరాకు చిక్కారు.


శ్వేతా మీనన్ డెలివరీ చరిత్రలో ఓ రికార్డుగా మిగిలింది. సినిమా కోసం ఆమె డెలివరీ దృశ్యాలను చిత్రీకరించారు. ప్రపంచంలో ఏ నటి కూడా ఇంతకు ముందున్నడూ ఇలాంటి చిత్రీకరణకు ఒప్పుకోలేదు.


శ్వేతా మీనన్ రియల్ డెలివరీ సీన్లను సినిమా కోసం చిత్రీకరించడంపై కేరళ అసెంబ్లీ స్పీకర్ జి. కార్తికేయన్ అభ్యంతం వ్యక్తం చేస్తారు. ఇటీవల ఈ విషయమై స్పందిస్తూ...‘ఆడవారిని కమర్షియల్ యాడ్లలో, సినిమాల్లో అసభ్యంగా చూపిస్తున్నారని పోరాటాలు చేసే మహిళా సంఘాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. మహిళ ప్రసవం ఎంతో పవిత్రమైనది. దాన్ని ఇలా కమర్షియల్‌గా డబ్బులు సంపాదించడానికి సినిమా కోసం వాడుకోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేసారు.

English summary

 Actress Shwetha Menon's daughter Sabaina, whose birth was captured live on camera, was reportedly a surprise guest at a recent public event in Alleppey. Along with her mother, the six-month-old baby was said to have inaugurated a Green Drive in town by planting a tree. With this, Sabaina has hogged the limelight.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X