»   » బ్యూటీఫుల్ :సింగర్ సునీత...ఐర్లాండు ట్రిప్ (ఫొటోలు)

బ్యూటీఫుల్ :సింగర్ సునీత...ఐర్లాండు ట్రిప్ (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :తన గాన మాధుర్యంతో పాటు, ఆకట్టుకునే రూపంతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెదరని ముద్ర వేసుకుంది ప్లే బ్యాక్ సింగర్ సునీత. ఆమె పాడిన పాటలు నచ్చని వారు తెలుగు గడ్డపై ఉండరంటే అతిశయోక్తి కాదేమో? మరి అంతటి గుర్తింపు తెచ్చుకుందామె.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

కోకిల లాంటి స్వరంతో పాటు మైమరిపించే రూపం...ఆమె ఎక్కడికెళ్లినా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తూ ఉంటుంది. ఆమె రీసెంట్ గా ఐర్లాండు వెళ్లింది. అక్కడ ఆమె గడిపిన క్షణాలను కెమెరాలో బంధించారు. అవే మీరు ఇక్కడ చూడబోతోంది.

సింగర్ గా, అప్పుడప్పుడు కొంతమందికి డబ్బింగ్ చెబుతూ మంచి పేరు తెచ్చుకున్న సింగర్ సునీత ఆ మథ్యన రూటు మార్చింది. ఈ బ్యూటిఫుల్ సింగర్ ఇప్పటి వరకూ కేవలం టీవీలలో మాత్రమే కనిపించింది. కానీ ఈ సారి రూటు మార్చి శేఖర్ కమ్ముల చేసిన ‘అనామిక' సినిమాలో కనిపించింది. శేఖర్ కమ్ముల ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఓ వీడియో ని ప్లాన్ చేసారు. అందులో ఆమె కనిపించింది.

పూర్తి పేరు

పూర్తి పేరు

ఈమె పూర్తి పేరు సునీత ఉపద్రష్ట

 ఆ ఫొటోలు ఆమెకు చెందిన వేశేషాలతో...ఇక్కడ స్లైడ్ షోలో..

ఆ ఫొటోలు ఆమెకు చెందిన వేశేషాలతో...ఇక్కడ స్లైడ్ షోలో..

ఈమె 8 సంవత్సరాల కాలంలో సుమారు 500 సినిమాలకు డబ్బింగ్ కళాకారిణిగా పనిచేసింది.

విద్యాభ్యాసం

విద్యాభ్యాసం

ఈమె విద్యాభ్యాసం తన సొంత ఊరు గుంటూరు లోను, మరికొంత కాలం విజయవాడలోను చేసింది.

వివాహం..

వివాహం..


ఈమెకు 19 సంవత్సరాల వయసులో కిరణ్ తో వివాహమైనది.

పిల్లలు

పిల్లలు

వీరికి ఇద్దరు పిల్లలు: అబ్బాయి ఆకాష్ మరియు అమ్మాయి శ్రేయ.

ఇప్పటివరకూ..

ఇప్పటివరకూ..

సునీత తమన్నా, అనుష్క, సౌందర్య, జెనీలియా, శ్రియ, జ్యోతిక, ఛార్మి, నయనతార , సదా, త్రిష, భూమిక లకు గాత్రదానం (వాయిస్ ఓవర్) ఇచ్చారు.

అలాగే..

అలాగే..

మీరా జాస్మిన్, లైలా, స్నేహ, సోనాలి బింద్రె, కమలినీ ముఖర్జీ, కత్రినా కైఫ్ మొదలైనటువంటి వివిధ కళాకారులు కోసం గాత్రదానం (వాయిస్ ఓవర్) ఇచ్చారు.

చిన్నవయస్సులోనే..

చిన్నవయస్సులోనే..


ఈమె 15 సంవత్సరాల వయసులో మొదటిసారిగా సినిమాలలో నేపధ్యగాయనిగా ప్రవేశించింది.

తొలిపాట

తొలిపాట


శశి ప్రీతం సంగీత దర్శకత్వంలో గులాబి సినిమా కోసం సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన "ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావు" అనే పాట పాడింది. ఈ పాట సూపర్ హిట్ అయ్యింది.

ఇప్పటివరకూ

ఇప్పటివరకూ


తరువాత ఈమె తెలుగు, కన్నడ, తమిళ మరియు మలయాళ భాషలలో సుమారు 3,000 సినిమా పాటలు పైగా పాడింది

వియన్ ఆదిత్యతో రూమర్స్ పై...

వియన్ ఆదిత్యతో రూమర్స్ పై...

రూమర్స్ వస్తున్నాయని కట్ చేసుకునే ప్రెండ్ షిప్ కాదు మాది. ఒక మెచ్యుర్డ్ లెవిల్ కి ఎదిగాక, కుటుంబంలో ఇంతమందిని ఇంత జాగ్రత్తగా చూసుకున్నాక..కష్టపడి ఇంత గౌరవాన్ని సంపాదించుకున్నాక...ఆ మాత్రం ఆలోచించనా చెప్పండి..చూడండి, ఎవరి సంస్కారాన్ని బట్టి వాళ్ళు మాట్లాడతారు..వదిలేయటమే అని చెప్పుకొచ్చింది.

సింగిల్ మదర్ గా..

సింగిల్ మదర్ గా..


విడాకులు తీసుకుని సింగిల్ మదర్ గా వారిని సాకాలని ఆమె ఆలోచిస్తునట్లు చెప్తున్నారు.

చిన్నతనంలోనే నేషనల్ అవార్డు

చిన్నతనంలోనే నేషనల్ అవార్డు

15 సంవత్సరాల వయస్సులో 1994 సంవత్సరములో లలిత సంగీతం విభాగంలో ఆల్ ఇండియా రేడియో (All India Radio) నుండి నేషనల్ అవార్డు అందుకున్నారామె

ఇప్పటివరకు...

ఇప్పటివరకు...

దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో (AIR), ఈ టివి (ETV), జెమిని టివి, మరియు మా టివి లాంటి సంస్థలకు 500 వివిధ అనేక కార్యక్రమాలు పైగా ఇచ్చింది.

టీవీ పోగ్రామ్ లు..

టీవీ పోగ్రామ్ లు..

జెమిని టివిలో నవరాగం , ఈ టివిలో ఝుమ్మంది నాదం, సప్తస్వరాలు మరియు పాడుతా తీయగా, అదేవిధంగా జీ సరిగమ లాంటి వివిధ సీరియల్ కార్యక్రమములకు ఒక నిర్వాహకురాలిగా, న్యాయమూర్తిగా అనేక రూపాలలో తన పాత్రను నిర్వహించింది.

Read more about: singer, sunitha, ireland
English summary
Singer Sunitha said... "Leaving this beautiful country(Ireland) with lots of memories...enjoyed every single second here. My sincere thanks to those who made my trip most memorable and thanks to each and everyone who listens to my music and love me endlessly .. I am blessed to have you people in my life"
Please Wait while comments are loading...