»   » మనోజ్‌తో సన్నీ లియోన్ లుంగీ డాన్స్ (ఫోటోలు)

మనోజ్‌తో సన్నీ లియోన్ లుంగీ డాన్స్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మంచు మనోజ్ హీరోగా తెరకెక్కుతున్న 'కరెంటు తీగ' చిత్రంలో మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే సన్నీ లియోన్‌పై ఓ పాట చిత్రీకరణ పూర్తయింది. ఈ సాంగులో మనోజ్, సన్నీ లియోన్ లుంగీ డాన్స్ చేస్తూ అదరగొట్టారు. మాస్ మసాలా అంశాలతో ఈ పాటను తెరకెక్కించారు.

ఈ చిత్రంలో సన్నీ లియోన్ టీచర్ పాత్రలో నటిస్తోంది. సన్నీ లియోన్ ఉంది కదా...ఈ సినిమాలో బూతు సీన్లు ఉంటాయను కుంటే పొరపాటే. ఇందులో సన్నీ లియోన్‌ను చాలా సాంప్రదాయ బద్దంగా చూపించారట. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్లో ఈ పాటను చిత్రీకరించారు.

మోహన్ బాబు సినిమా కంపెనీలో మర్యాదలకు ఏ మాత్రం లోటు ఉండదు. చాలా గౌరవంగా టెక్నిషియన్స్‌ని, ఆర్టిస్టులను ట్రీట్ చేస్తారు. ఇటీవల సన్నీ లియోన్ షూటింగ్ పూర్తయ్యాక మోహన్ బాబు...సన్నిలియోన్, ఆమె భర్త డేనియల్ వెబర్ దంపతులను తనదైన శైలిలో గౌరవించి, సన్మానం తరహాలో జరిపి పంపిచారట.

కరెంటు తీగ చిత్రానికి జి నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా లుంగీ డాన్స్‌కు సంబంధించిన ఫోటోలుకూడా విడుదలయ్యాయి. స్లైడ్ షోలో ఆ ఫోటోలు.....

సన్నీ లియోన్ లుంగీ డాన్స్

సన్నీ లియోన్ లుంగీ డాన్స్

‘కరెంటు తీగ' చిత్రంలో సన్నీ లియోన్, మంచు మనోజ్ కలిసి లుంగీ డాన్స్ చేసారు. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్లో ఈ పాట షూటింగ్ జరిగింది.

సన్నీ లియోన్, డేనియల్ వెబర్

సన్నీ లియోన్, డేనియల్ వెబర్

సన్నీ లియోన్, ఆమె భర్త డేనియల్ వెబర్లను షూటింగ్ పూర్తయిన తర్వాత మోహన్ బాబు ఇలా సత్కరించారు.

అలా ఎంట్రీ ఇచ్చింది...

అలా ఎంట్రీ ఇచ్చింది...

బిగ్ బాస్ షో ద్వారా ఇండియన్ ఎంటర్టెన్మెంట్ రంగంలోకి అడుగు పెట్టిన సన్నీ లియోన్ ‘జిస్మ్ 2' చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

మనోజ్-సన్నీ లియోన్

మనోజ్-సన్నీ లియోన్

జిస్మ్ 2 సినిమాలో సన్నీ లియోన్ అందాల ఆరబోత శృంగార ప్రియులను ఆకట్టుకుంది. ఆ తర్వాత ఆమె పలు బాలీవుడ్ చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంది. తాజాగా తెలుగులో ‘కరెంట్' తీగ చిత్రంలో నటిస్తోంది.

ప్రస్తుతం సన్నీ లియోన్ చేస్తున్న సినిమాలు

ప్రస్తుతం సన్నీ లియోన్ చేస్తున్న సినిమాలు

ప్రస్తుతం సన్నీ లియోన్ టినా అండ్ లోలో, మస్తీ జాదె, పటేల్ రాప్, లీలా తదితర చిత్రాల్లోనటిస్తోంది. దీంతో పాటు ఎంటీవీలో స్పిట్స్ విల్లా అనే రియాల్టీ షోను హోస్ట్ చేస్తోంది. పంజాబీ సింగర్ గిరిక్ అమన్ మ్యూజిక్ ఆల్బం ‘సారీ వాలీ గర్ల్'లో నటిస్తోంది.

తమిళ సినిమాలో ఐటం సాంగ్

తమిళ సినిమాలో ఐటం సాంగ్

ఇటీవల తమిళంలో తెరకెక్కిన ‘వడాకర్రీ' అనే సినిమాలో హీరో జైతో కలిసి ఐటం సాంగు కూడా చేసింది సన్నీ లియోన్.

సన్నీ లియోన్ ర్యాంప్ వాక్

సన్నీ లియోన్ ర్యాంప్ వాక్

ఇండియన్ జ్యువెల్లరీ ఫ్యాషన్ వీక్లో సన్నీ లియోన్ ర్యాంప్ వాక్ చేసి ఆకట్టుకుంది. ఆమె అందంగా మెరిసి పోయింది.

English summary
Bollywood actress Sunny Leone, who is foraying into Tollywood with Current Teega, has recently completed the shooting of mass number for the Telugu movie. Dressed up in a lungi, the Indo-Candian star shook leg with actor Manchu Manoj for the song, which is said to have been inspired from Hindi song 'Lungi dance' in Superstar Shahrukh Khan's hit movie Chennai Express.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu