For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఎన్నడూ లేనంత హాట్ గా,అందంగా... (ఫొటో ఫీచర్)

  By Srikanya
  |

  ముంబై: సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా నర్గీస్ ఫక్రీ గురించి పరిచయం చేయనక్కర్లేదు. ఎప్పుడూ ఏదో ఒక స్టేట్ మెంట్ తోనో లేక తన అందాల ఆరబోతతోనే వార్తల్లో ఉంటూంటుంది. తాజాగా ఆమె హార్పర్ బజార్ మ్యాగజైన్ కు పెళ్లికూతురుగా ఫొటో షూట్ చేయించుకుని కవర్ పేజీకి ఎక్కింది. డిసెంబర్ ఇష్యూలో ఆమె ఇలా ఎన్నడూ లేనంత అందంగా కనిపించింది.

  ఫేస్‌బుక్ ద్వారా అన్ని అప్‌డేట్స్ పొందండి

  ఈ పత్రికలో ఆమె హాట్ ఫోజులుతో పాటు... తన పర్శనల్ లైఫ్ కు సంభందించిన ఎన్నో విషయాలు చర్చించింది. ఆ ఫొటోలను మీకు ఎక్సక్లూజివ్ గా అందిస్తున్నాం. వాటిని చూసి ఎంజాయ్ చెయ్యండి. ఆమె తన నచ్చిన మగాడు గురించి మాట్లాడుతూ...నాకంటూ నా పార్టనర్ విషయంలో కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఇంటలిజెంట్ గా, ఫన్నీగా ఉండాలి. అలాగే మ్యానర్స్ బాగుండాలి...ఎక్కువ ప్రయాణాలు చేయగలిగి ఉండాలి. అందరనీ సమానంగా చూడగలిగి ఉండాలి అంటూ చెప్పుకొచ్చింది.

  బాలీవుడ్ లవర్ బాయ్ రణబీర్ కపూర్, అమెరికన్ మోడల్ నర్గీస్ ఫక్రి కలిసి నటించిన చిత్రం ‘రాక్ స్టార్'. ఈ చిత్రంలో ఇద్దరి మధ్య హాట్ హాట్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. దీంతో వీరి మధ్య ఎఫైర్ ఉందని ఆ మధ్య గుసగుసలు వినిపించాయి. నర్గీస్ ఫక్రీ అందాలకు రణబీర్ పడి పోయాడని, ఆమెతో చాటు మాటుగా ఎఫైర్ నడిపిస్తున్నాడని మీడియాలో కూడా వార్తలు గుప్పుమన్నాయి.

  బాలీవుడ్‌లో 'రాక్‌స్టార్‌' తరవాత సూజిత్‌ సర్కార్‌ 'మద్రాస్‌ కేఫ్‌'లో కనిపించిన నర్గీస్‌ 'ఫటా పోస్టర్‌ నిక్లా హీరో' సినిమాలో ఓ ప్రత్యేక గీతానికి నర్తించింది. డేవిడ్‌ ధావన్‌ దర్శకత్వంలో రూపొందిన 'మై తేరా హీరో'లో ఓ హీరోయిన్ గా నటించింది.

  స్లైడ్ షోలో ఆమె ఫొటోలు చూస్తూ ఆమె గురించి చదవండి...

  నిజమే..

  నిజమే..

  కుటుంబ సభ్యులెవరూ లేకపోయినా ఇండియాలో నర్గీస్‌ ఫఖ్రి ఎలా ఉండగలుగుతోందనేది చాలా మంది మనసులను తొలుస్తున్న సందేహం. న్యూయార్క్‌ నుంచి భారత్‌ వచ్చిన తొలినాళ్లలో ఈ బాలీవుడ్‌ బ్యూటీ ఒంటరితనం ఫీలయిన మాట నిజమని అంటోంది.

  నర్గీస్ మాట్లాడుతూ...

  నర్గీస్ మాట్లాడుతూ...

  ‘‘ఇక్కడకు వచ్చాక మా అమ్మనూ, క్లోజ్‌ ఫ్రెండ్స్‌నూ మిస్సయ్యాను. అయితే ‘స్కైప్‌', ‘ఫేస్‌టైమ్‌' ఉండటం వల్ల వాళ్లను కంప్యూటర్‌ తెరమీద చూస్తూ మాట్లాడగలుతున్నా. కానీ డిజిటల్‌గా వాళ్లతో కనెక్టవుతున్నా వాళ్లు నాకు సన్నిహితం అవుతున్న భావన కలగదు.‌'' అని చెప్పింది నర్గీస్‌.

  అన్నీ ఆమే ఎరేంజ్ చేస్తోంది..

  అన్నీ ఆమే ఎరేంజ్ చేస్తోంది..

  కావాలనుకున్నప్పుడు అమ్మను కావలించుకోలేను. ఒకే టేబుల్‌పై అమ్మతో, స్నేహితులతో కలిసి భోజనం చెయ్యలేను. అలాంటి అనుభూతులకు దూరమవుతున్నా. అవి తప్ప నాకు ఏం కావాలన్నా మా మేనేజర్‌ అరేంజ్‌ చేస్తోంది. ఇప్పుడు ఆమే నా ఫ్రెండ్

  తమిళంలో చేస్తోంది...

  తమిళంలో చేస్తోంది...

  ‘రాక్‌స్టార్‌' ఫేమ్‌ నర్గీస్‌ ఫఖ్రి తొలిసారిగా దక్షిణాదిలో అడుగుపెట్టి ఓ తమిళ చిత్రంలో ఐటమ్‌ సాంగ్‌ చేస్తోంది. ఆ సినిమా ‘సాహసమ్‌'. త్యాగరాజన్‌ డైరెక్ట్‌ చేస్తున్న ఈ చిత్రంలో ప్రశాంత్‌ హీరో. ఇప్పటికే ప్రశాంత్‌, నర్గీస్‌పై ‘కారదిల్‌ కారదిల్‌' అంటూ సాగే పాటను చిత్రీకరించారు.

  నర్గీస్ మాట్లాడుతూ..

  నర్గీస్ మాట్లాడుతూ..

  ‘‘ఈ పాట కోసం త్యాగరాజన్‌ నన్ను సంప్రదించగానే నేను కాదనలేకపోయా. ఎందుకంటే అది చాలా పెద్ద సినిమా. పైగా దక్షిణాదిన ఇదే నాకు మొదటి చిత్రం. ఒక ఐటమ్‌ సాంగ్‌తో ఇక్కడ పరిచయం కావడంపై నాకేం ఇబ్బందిగా లేదు. పైగా ఈ పాట డాన్స్‌ మూమెంట్స్‌ నాకు బాగా కిక్కిచ్చాయి. బాలీవుడ్‌తో పోలిస్తే ఇక్కడి డాన్స్‌ భిన్నంగా ఉంది'' అని చెప్పింది నర్గీస్‌.

  ఇదివరకే ....

  ఇదివరకే ....

  ‘ఫటా పోస్టర్‌ నిక్లా హీరో'లో షాహిద్‌కపూర్‌తో, ‘కిక్‌'లో సల్మాన్‌ఖాన్‌తో ఐటమ్‌ సాంగ్స్‌ చేసారామె.

   నర్గీస్ డాన్స్ లపై స్పందిస్తూ..

  నర్గీస్ డాన్స్ లపై స్పందిస్తూ..

  ‘‘నాకు డాన్సంటే ఇష్టం. మొదటగా షాహిద్‌తో ఐటమ్‌ సాంగ్‌ చేసే అవకాశం వచ్చినప్పుడు నేను మరో ఆలోచన లేకుండా అంగీకరించా. అలాగే సల్మాన్‌తో పనిచేసే అవకాశాన్ని మిస్‌ చేసుకోకూడదనే ఉద్దేశంతో ఆయనతో ఐటమ్‌ చేశాను. అయితే రాబోయే రోజుల్లో నేను ఐటమ్‌ సాంగ్స్‌ కంటే కేరక్టర్లకే ప్రాధాన్యం ఇస్తా'' అని వివరించింది.

  కొత్త ఆఫర్స్ కోసం....

  కొత్త ఆఫర్స్ కోసం....

  తను ఎప్పుడూ కొత్త పాత్రలు, ఆఫర్స్ కోసం చూస్తూంటానని అంటోంది. రొటీన్ గా చేసినవే చెయ్యాలంటే బోర్ అంటోంది.

  బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌కి

  బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌కి

  హిందీలో 'రాక్‌స్టార్‌'తో పరిచయం అయిన నర్గీస్‌ ఫక్రి అతి తక్కువ కాలంలోనే హాలీవుడ్‌ దర్శకుడి కంట్లో పడింది. 'బ్రైడ్స్‌మెయిడ్స్‌' సినిమాతో ఆస్కార్‌కి నామినేట్‌ అయిన దర్శకుడు పాల్‌ ఫెగ్‌ రూపొందించబోతున్న తాజా చిత్రంలో ఆమె ఎంపికైంది.

  సీక్రెట్ ఏంజెట్ గా..

  సీక్రెట్ ఏంజెట్ గా..

  రహస్య ఏజెంటు పాత్రలో నర్గీస్‌ కనిపించబోతోంది. 'ట్రాన్స్‌పోర్టర్‌' చిత్రంతో పేరు తెచ్చుకొన్న జాసన్‌ స్టాథమ్‌ ఇందులో కథానాయకుడు. 'ది హీట్‌' సినిమాలో కనిపించిన మెలిస్సా మెక్‌కార్తీ కూడా ఓ కీలక పాత్రధారి.

  ఎంతసేపు ఉంటుంది..

  ఎంతసేపు ఉంటుంది..

  నర్గీస్‌ పాత్ర ఈ చిత్రంలో ఎంతసేపు ఉంటుంది? ఎప్పట్నుంచి చిత్రీకరణ మొదలుపెడతారు? అనేది తెలియాల్సి ఉంది. అయితే ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ అని చెప్తున్నారు.

  మహేష్ తో ...

  మహేష్ తో ...

  " నాకు తెలుగులో నటించాలని ఉంది. నన్ను ఎవరైనా ఎప్రోచ్ అవుతే తప్పకుండా ఆలోచిస్తాను..నాకు మహేష్, రానా దగ్గుపాటిలతో పనిచేయటం అంటే ఇష్టం. నిజాయితీగా చెప్పాలంటే తెలుగు నుంచి నాకు ఆ ఇద్దరు మాత్రమే తెలుసు," అంటూ చెప్పుకొచ్చింది నగ్రీస్ ఫక్రీ.

  ఎఫైర్..

  ఎఫైర్..

  ఉదయ్ చోప్రాతో ఆమెకు రిలేషన్ ఉందంటూ చాలా కాలంగా వినిపిస్తున్నా ఆమె పట్టించుకోవటం లేదు. ఆమె వాటిని చిరునవ్వుతో కొట్టిపారేస్తూ మరింత అనుమానాలకు తావిస్తూంటుంది.

   స్పై తో...

  స్పై తో...

  హాలీవుడ్ స్పై చిత్రంతో రంగ ప్రవేశం చేసిన ఫక్రీ...బాలీవుడ్ లో నటించటమే తనకు చాలా బాగుందుంది అంటోంది.

  అలవాటు పడ్డా..

  అలవాటు పడ్డా..

  నేను హాలీవుడ్ నుంచి వచ్చినా మరో చోట నుంచి వచ్చినా ఇక్కడ పద్దతులకు అలవాటుపడిపోయా. ఇక్కడే చాలా బాగుంది..దర్శక,నిర్మాతలు నన్ను ఎంకరేజ్ చేస్తున్నారని చెప్తోంది.

  ఇక్కడే దృష్టి...

  ఇక్కడే దృష్టి...

  ముఖ్యంగా తనకు సంగీతం, డాన్స్ అంటే ఇష్టమని చెప్పే ఈ భామ...ఇండియా అంటే తనకు ఇష్టమని ఇక్కడే పూర్తి దృష్టి పెడతానని అంటోంది. దేవుని ఆశీర్వాదం వలనే పెద్ద నటులతో నటించే అవకాశాలు వస్తున్నాయని అంటోంది. ఇక్కడ తనకు ఎటువంటి ఇబ్బంది లేదని అంటోంది.

  కేక పెట్టిస్తోంది..

  కేక పెట్టిస్తోంది..

  బాలీవుడ్ సెక్సీ బ్యూటీ నర్గీస్ ఫక్రి 35వ వడిలోకి అడుగు పెట్టిన అదరకొడుతోంది. ఈ వయసులోనూ అమ్ముడు 20ల్లో భామలా ఆకట్టుకుంటోంది.

  పెద్ద పేరు రాలేదు..

  పెద్ద పేరు రాలేదు..

  ‘రాక్ స్టార్' తర్వాత తర్వాత నర్గీస్ హీరోయిన్‌గా నటించిన 'మద్రాస్ కేఫ్' సినిమా విడుదలైనా ఆమెకు పెద్దగా పేరు రాలేదనే చెప్పాలి.

  హిట్ తో వరస పెట్టింది..

  హిట్ తో వరస పెట్టింది..

  ఆ తర్వాత పతా పోస్టర్ నిక్లా హీరో అనే చిత్రంలో గెస్ట్ రోల్ చేసింది. అయితే ఆ సినిమా ప్లాప్ అయింది. కానీ తర్వాత విడుదలైన 'మే తేరా హీరో' చిత్రం హిట్ కావడం అమ్మడుకి కలిసొచ్చింది.

  కిక్ ఇచ్చింది..

  కిక్ ఇచ్చింది..

  సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన ‘కిక్' సినిమాలో నర్గీస్ చేసిన ఐటం సాంగుకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆమె కెరీర్ కు కిక్ ఇచ్చింది సాంగ్.

  English summary
  Gorgeous actress Nargis Fakhri features on the bridal cover of Harper's Bazaar magazine, the December issue. The actress looks beautiful posing on the cover dressed in an Alexander McQueen creation in the beautiful locales of Mauritius.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X