For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  వేశ్యలుగా మారిన హీరోయిన్లు!(ఫోటో ఫీచర్)

  By Bojja Kumar
  |

  హైదరాబాద్ : చాలా మంది యువతులు రంగుల సినీ ప్రపంచంలోకి అడుగు పెట్టి నెం.1 హీరోయిన్ కావాలని కలలుగంటూ రావడం....అవకాశాలు దొరక్క చివరకు బ్రతుకు దెరువు కోసం నిజ జీవితంలో వ్యబిచారంలోకి దిగడం మన చూస్తూనే ఉన్నాం. వాళ్ల సంగతి పక్కన పెడితే పలువురు తారలు హీరోయిన్స్‌గా సక్సెస్ అయి రీల్ లైఫ్ లో వేశ్య పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించారు.

  హీరోయిన్ సంగీత 2008లో వచ్చిన ‘ధనం' చిత్రంలో వేశ్య పాత్రలో నటించింది. తమిళంలో రూపొందిన ఈచిత్రాన్ని తెలుగులోనూ అదే పేరుతో విడుదల చేసారు. ఈ చిత్రంలో సంగీత నటనకు మంచి పేరు వచ్చింది. అయితే సినిమా మాత్రం బాక్సాఫీసు వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకుంది.

  2010లో వచ్చిన వేదం చిత్రంలో అనుష్క వేశ్య పాత్రలో నటించింది. ఇందులో అనుష్క పోషించిన సరోజ పాత్ర విమర్శకుల ప్రశంసలు అందుకుంది. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ఈచిత్రంలో అల్లు అర్జున్, మనోజ్ ముఖ్య పాత్రలు పోషించారు.

  ఆవకాయ్ బిర్యానీ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం అయిన తెలుగు నటి బింధు మాధవి 2011లో వచ్చిన గౌతం మీనన్ చిత్రం ‘సెగ'లో వేశ్య పాత్ర పోషించింది. సినిమా పెద్దగా ఆడక పోయినా బింధుమాధవికి మాత్రం మంచి మార్కులు పడ్డాయి.

  హీరోయిన్ చార్మి త్వరలో తెరపై వేశ్యగా కనిపించబోతోంది. టెన్త్ క్లాస్, నోట్ బుక్ చిత్రాల దర్శకుడు చందు ఈ సినిమాకు దర్శకుడు. బేబి హ్యాపీ సమర్పణలో డి. వెంకట సురేష్, కె. సూర్య శ్రీకాంత్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.

  దేవస్థానం ఫేం జనార్ధన మహర్షి ‘పవిత్ర' పేరుతో ఓ సినిమా చేయబోతున్నారు. ఆమె ఓ పవిత్ర అనేది ట్యాగ్ లైన్. ఈచిత్రంలో శ్రీయ వేశ్య పాత్రలో నటించనున్నట్లు సమాచారం. అలాగే ఓ బెంగాళీ చిత్రంలోనూ వేశ్యగా నటిచేందుకు రెడీ అవుతోంది ఈ భామ.

  టాలీవుడ్లో చాలా మంది ఫిల్మ్ మేకర్స్ పెద్ద హీరోలను పెట్టి కమర్షియల్ సినిమాలు చేయడానికే ఆసక్తి చూపుతుంటారు. సినిమా హిట్టయినా ఎక్కువ పేరొచ్చేది హీరోకే. లేడి ఓరియెంటెడ్ సినిమాలు వచ్చి హిట్టయితే తప్ప హీరోయిన్లకు సరైన గుర్తింపు ఉండదు. అయితే ఈ మధ్య టాప్ హీరోయిన్లు సినిమాల్లో వేశ్య పాత్రలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించడమే కాదు...తమ నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు.

  వేశ్య పాత్రలు చేయడం అంటే అంత ఆశామాషీ కాదు. అలాంటి పాత్రలు ఒప్పుకోవడం ఒక సాహసం అయితే...ఇలాంటి పాత్రలు చేసి మంచి పేరు తెచ్చుకోవడం అంటే నిజంగా హీరోయిన్లకు గడ్డు పరీక్షే. వేశ్య పాత్రలో ఉండే భావోద్వేగాలను, మానసిక సంఘర్షణలను దర్శకుడు సమర్థవంతంగా తెరకెక్కించగలిగితే, ఆ పాత్ర ఎవరు పోషించినా అది వారి కెరీర్‌లోనే ది బెస్ట్ కేరక్టర్ అవుతుంది.

  English summary
  Several young and beautiful girls, who debut in films and TV serials dreaming to become No 1 heroines, are ending up as prostitutes in the market in real life. But not many actress in Telugu film industry have taken up a challenge of playing a call girl in reel life. In recent times, only a few actresses like Anushka Shetty, Sangeetha and Bindu Madhavi have made some bold attempts. Tollywood is ruled by actors and actresses are merely used as glam dolls. Most of Tollywood filmmakers are busy working on commercial subject with big stars. And the industry completely lacks on female-centric and experimental movies. A director says that a story of a prostitute or flesh trade can be a best subject, but it needs a popular heroine to meet its commercial success. He adds that the biggest problem is that hardly any big actress will come forward to do such an experimental movie.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more