»   » అక్కినేనితో అలనాటి నటి అంజలీదేవి (పిక్చర్స్)

అక్కినేనితో అలనాటి నటి అంజలీదేవి (పిక్చర్స్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: అలనాటి నటి అంజలీదేవి ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వర రావుతో కలిసి పలు చిత్రాల్లో నటించారు. వారిద్దరు జంటగా నటించిన చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించాయి. అక్కినేని నాగేశ్వర రావుతో కలిసి ఆమె నటించిన సువర్ణ సుందరి, అనార్కలి చిత్రాలు విశేష ప్రజాదరణ పొందాయి.

ఆమె అత్యంత ప్రతిష్టాత్మకమైన రఘుపతి వెంకయ్య అవార్డును కూడా పొందారు. ఆమెను 2007లో ఎఎన్నార్ జాతీయ అవార్డు వరించింది. ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో అక్కినేని నాగేశ్వర రావు అంజలీ దేవి ఎంతో ఆత్మీయంగా మెలిగారు. లవకుశ సినిమాలో ఆమె సీతాదేవిగా తెలుగు ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు.

నిర్మాతగా అంజలీ దేవి సువర్ణ సుందరి, పరదేశి, స్వర్ణమంజరి, చండీప్రియ, సతి సక్కుబాయి చిత్రాలు నిర్మించారు. అంజలీదేవి అంత్యక్రియలు బుధవారం జరుగుతాయి. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో ఆమె నటించారు.

ఎఎన్నార్ అవార్డు అందుకుంటూ..

ఎఎన్నార్ అవార్డు అందుకుంటూ..

అంజలీ దేవి ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వర రావు పేరు మీద పెట్టిన ఎఎన్నార్ జాతీయ అవార్డును అందుకున్నారు.

అక్కినేని పక్కన అంజలీ దేవి

అక్కినేని పక్కన అంజలీ దేవి

అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో అక్కినేని నాగేశ్వ రావు పక్కన అంజలీ దేవి ఇలా కూర్చున్నారు.

ఓ సినిమాలో అక్కినేనితో ఇలా..

ఓ సినిమాలో అక్కినేనితో ఇలా..

ఓ సినిమాలో అక్కినేని నాగేశ్వర రావుతో అంజలీ దేవి ఇలా కనిపించారు. ప్రముఖ సినీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును కూడా చూడవచ్చు.

ఆ ఆత్మీయతలే వేరు..

ఆ ఆత్మీయతలే వేరు..

అలనాటి నటీనటులు కలుసుకున్నప్పుడు ఆ ఆత్మీయతలే వేరుగా ఉంటాయి. సినీ పరిశ్రమ పూర్తిగా వ్యాపారమయం కాని రోజుల్లో కలిసి నటించిన అనుబంధాన్ని ఇలా పంచుకున్నారు.

నాగేశ్వర రావుతో ఇలా అంజలీ దేవి..

నాగేశ్వర రావుతో ఇలా అంజలీ దేవి..

తన హీరో అక్కినేని నాగేశ్వ రావుతో ఆత్మీయతను కలబోసుకుంటూ అంజలీ దేవి ఓ సందర్భంలో ఇలా కనిపించారు.

అక్కినేని హీరోయిన్లతో..

అక్కినేని హీరోయిన్లతో..

అక్కినేని తన సినిమాల్లో నటించిన హీరోయిన్లతో కలిసి ఇలా కెమెరాకు చిక్కారు. హీరోయిన్లందరితో పాటు అంజలీ దేవి కూడా ఉన్నారు.

English summary
Yaester year actress Anjali devi acted in several pictures with Akkineni Nageswar Rao. She recieved ANR Natioanl award.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu