»   »  ఫోటోలు : ఎర్ర చీరలో వెర్రెక్కిస్తున్న హీరోయిన్లు

ఫోటోలు : ఎర్ర చీరలో వెర్రెక్కిస్తున్న హీరోయిన్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఆడవారికి చీరకట్టు లో ఉన్న అందం దేనిలో ఉండదు. ఆ చీరకట్టులో కొందరిని ఎంత సేపుచూసినా అనివి తీరదు. ఆ చీరకట్టు అందం అలాంటిది. ఇక చీరకట్టులో సినిమా హీరోయిన్ల అందాల ప్రదర్శన గురించి ఎంత చెప్పినా తక్కువే. అప్పటిదాకా మెడ్రన్ డ్రస్సుల్లో చూసి ఒక్కసారిగా వారు చీరకట్టులో చూస్తే వర్నించడం కష్టం.

వారిని చీరకట్టులో చూస్తూ ఎక్కడ కనురెప్ప కొడితే ఆ అద్బుద దృశ్యం మిస్సవుతుందేమో అనిపిస్తుంది. వంపు సొంపులను చూపించి చూపించనట్టుండేదే చీరకట్టు. అది కొంత వరకు నిజంకావచ్చు! చీరలో అందాన్ని మన కవులు చాలా విదాలుగా పొగిడారు. చీరకట్టులో కనిపించీ కనిపీంచని నడుము సోయగాలు...ఎదపొంగుల మలయమారుతం ఇలా పొగుడుకుటూ పోతే ఎన్నీ భావాలు వ్యక్తంచేమొచ్చు మరి అది చీరకట్టు అందం మరి.

చీర అందంపై ఎన్నో సినిమా పాటలు కూడా వచ్చాయి. చెంగావి రంగుచీర కట్టుకున్న చిన్నది దీని తస్సదియ్య, అందమంతా చీరలోనె ఉన్నది లాంటి పాటలు సినీ అభిమానులను అలరించాయి. తెలుగు సినిమాల్లో ఎర్రచీరలో అందాలు ఆరబోసిన హీరోయన్ల అందాలను ఫోటో ఫీచర్లో వీక్షిద్దాం...


వేదం చిత్రంలో వేశ్య పాత్రలో నటించిన అనుష్క ఎరుపు చీరలో హాట్ అండ్ సెక్సీగా అందాల విందు చేసింది. అనుష్క ప్రస్తుతం తెలుగులో రుద్రమదేవి, బాహుబలి అనే రెండు భారీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది.


బాద్ షా చిత్రంలో కాజల్ అగర్వాల్ ఇలా ఎరుపు చీరలో ప్రేక్షకుల మదిని దోచించింది. బాద్ షా చిత్రం తర్వాత కాజల్ తెలుగులో సినిమాలేవీ సైన్ చేయలేదు. అయితే రామ్ చరణ్ హీరోగా రూపొందిన ఎవడు చిత్రంలో గెస్ట్ రోల్ చేసింది. ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కాబోతోంది.


సౌతిండియా హాట్ హీరోయిన్లలో ఒకరైన త్రిష ‘వెంటాడు-వేటాడు'లో ఇలా ఎరుపు చీరలో కనువిందు చేసింది. దమ్ము చిత్రం తర్వాత తెలుగులో త్రిష సినిమాలు విడుదల కాలేదు. ప్రస్తుతం ఆమె తెలుగులో రమ్ అనే చిత్రం చేస్తోంది. ఈచిత్రానికి ఎంఎస్ రాజు దర్శకుడు.


నాయక్ చిత్రంలో హీరోయిన్ అమలా పాల్ ఎరుపు చీరలో ఇలా సెక్సీగా దర్శనం ఇచ్చింది. అమలా పాల్ ఈ సంవత్సరం తెలుగులో నాయక్, ఇద్దరమ్మాయిలతో చిత్రాలు చేసింది. ప్రస్తుతం ఆమె తెలుగులో జెండాపై కపిరాజు చిత్రం చేస్తోంది.


హీరోయిన్ తాప్సీ ఇటీవల నటించిన మొగుడు చిత్రంలో ఎరుపు రంగు చీరలో ఇలా కనిపించింది. తాప్సీ నటించిన సాహసం చిత్రం ఈ నెల 12న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రం తర్వాత ఆమె లారెన్స్ కు జోడీగా ముని 3 చిత్రంలో నటిస్తోంది.


దక్షిణాది సెక్సీ హీరోయిన్లలో ఒకరైన నయనతార పలు సందర్భాల్లో ఎర్ర చీరలో అందంగా కనిపించింది. గ్రీకు వీరుడు తర్వాత నయనతార తెలుగులో అనామిక చిత్రంలో నటిస్తోంది. అదే విధంగా తమిళంలో వేలై, రాజారాణి, మరో తమిళ చిత్రంలో నటిస్తోంది.


లీడర్ చిత్రంలో హీరోయిన్ రీచా గంగోపాధ్యాయ్ ఎరుపు చీరలో ఎంతో అందంగా ఉంది కదూ. మిర్చి చిత్రం తర్వాత రీచా కేవలం నాగార్జున హీరోగా రూపొందుతున్న ‘భాయ్' చిత్రంలో మాత్రమే నటిస్తోంది.


అందాల చార్మి...చీరకడితే మరింత అందంగా కనిపిస్తుంది. ఇక ఎరుపు చీరలో ఆమె అందాలు మరింత హాట్ గా ఉంటాయి. ప్రస్తుతం చార్మికి తెలుగులో పెద్దగా అవకాశాలు లేవు. కొన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాల అవకాశాలు మాత్రం వస్తున్నాయి. త్వరలో చార్మి నటించిన ప్రేమ మైకం చిత్రం విడుదల కాబోతోంది.


మోడ్రన్ డ్రెస్సుల్లోనే కాదు...చీరకట్టులోనూ సమంత యమ సెక్సీగా ఉంటుంది. అందుకు ఈ ఫోటోయే నిదర్శనం. తెలుగు సినీ పరిశ్రమలో బాగా డిమాండ్ ఉన్న హీరోయిన్లలో సమంత ఒరకగ. ప్రస్తుతం ఆమె పవన్ కళ్యాణ్‌తో ‘అత్తారింటికి దారేది', జూ ఎన్టీఆర్‌తో రామయ్యా వస్తావయ్యా సినిమాలతో పాటు ఈ సంవత్సరం 8 సినిమాల్లో నటిస్తోంది.


ఇటీవల పవిత్ర సినిమాలో వేశ్య పాత్రలో నటించిన శ్రీయ...ఎరుపు అందాలతో వెర్రెక్కించింది. ప్రస్తుతం శ్రీయ అక్కినేని ఫ్యామిలీలోని మూడు తరాల హీరోలతో రూపొందుతున్న ‘మనం' చిత్రం చేస్తోంది. ఈచిత్రంతో ఆమె నాగార్జునకు జోడీగా నటించింది.


దేవదాసు చిత్రంలో హీరోయిన్ ఇలియానా ఇలా ఎరుపు చీరలో కనిపించింది. ప్రస్తుతం ఇలియానా సౌత్ సినిమాలు చేయడం లేదు. ఆమె నటించిన తొలి బాలీవుడ్ మూవీ బర్ఫీ హిట్ కావడంతో తన పూర్తి దృష్టి బాలీవుడ్ పైనే పెట్టింది.


ఇటీవల విడుదలైన సంథింగ్ సంథింగ్ చిత్రంలో హీరోయిన్ హన్సిక ఎరుపు చీరలో మరింత అందంగా కనిపించింది. తమిళ, తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న హీరోయిన్ హన్సిక. ఆమె నటించిన ‘సంథింగ్ సంథింగ్' చిత్ర ఇటు తెలుగుతో పాటు, అటు తమిళంలోనూ విడుదలైంది. ఈ సంవత్సరం ఆమె శ్రీవాస్ దర్శకత్వంలో వచ్చే సినిమాతో పాటు, హలో బ్రదర్ రీమేక్ లో నటించబోతోంది.


ఎరుపు రంగు చీరలో ప్రణీత ఎంత బాగుందో కదూ. ప్రణీత ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న ‘అత్తారింటికి దారేది' చిత్రంలో నటిస్తోంది. హీరోయిన్ గా పెద్దగా పాపులారిటీ లేని ప్రణీత పవన్ సినిమాలో చాన్స్ కొట్టేయడం విశేషం.


హీరోయిన్ అసిన్ ఎరుపు రంగు చీర లుక్. సౌతిండియా నుంచి బాలీవుడ్ స్థాయికి ఎదిగిన ఆసిన్ తనను ఈ స్థాయికి తెచ్చిన సౌత్ పరిశ్రమను పూర్తిగా మరిచి పోయింది. బాలీవుడ్ సినిమాలు తప్ప వేరే సినిమాలు చేయడం లేదు.


కార్తీక నాయర్ ఎరుపు రంగు చీరలో ఎంతో సెక్సీగా ఉంది కదూ. 'జోష్' సినిమాతో వెండితెరకు పరిచయం అయిన రాధా కుమార్తె కార్తీకకు మొదటి సినిమా నిరాశపరిచింది. తర్వాత 'రంగం' సినిమా మంచి విజయం సాధించడంతో కార్తీక గాడినపడిందని అందరూ అనుకున్నారు. కానీ 'దమ్ము' సినిమా కార్తీకాకు అనుకున్నంత పేరు రాకపోవడంతో ఈ భామ కోలీవుడ్‌పై దృష్టి పెట్టింది. ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగా ఉంది.

English summary
Red is a sign of danger, but when it comes to dress, this colour symbolises sensuousness and it peps up a boring outfit instantly. Especially, red saree has a predominant role in Indian tradition. Red sarees are the traditional garment choice for brides in Indian culture. However, it has become hot fetish on screen and many actress have opted for this hot costume to enhance their glam quotient on screen.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu