»   » ఫోటోలు : 2013 టాప్ 5 అసాధారణ సినిమాలు

ఫోటోలు : 2013 టాప్ 5 అసాధారణ సినిమాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : టాలీవుడ్ చిత్ర సీమ నుంచి 2013 ప్రథమార్థంలోని ఆరు నెలల్లో దాదాపు 50 వరకు సినిమాలు ప్రొడ్యూసర్ అయ్యాయి. ఇందులో ఎక్కువ శాతం సినిమాలు రొమాన్స్, యాక్షన్, కామెడీ, ఫాంటసీ, సస్పెన్స్ అండ్ ఫ్యామిలీ డ్రామా లాంటి కమర్షియ్ అంశాలతో రూపొందినవే. నాయక్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మిర్చి లాంటి చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలవడంతో పాటు పలు రికార్డులు నెలకొల్పాయి.

ఆసక్తికర విషయం ఏమిటంటే...ఈ సంవత్సరం టాలీవుడ్ నుంచి కొన్ని అసాధారణ చిత్రాలు వచ్చాయి. ఈ చిత్రాలు వెరీ క్రియేటివ్, అరుదైన సబ్జెక్టుతో రూపొందడం గమనార్హం. ఈ చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి కూడా. ఈ చిత్రాలు సినీ విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాయి. తెలుగు ప్రేక్షకులకు కావాల్సింది కేవలం రొటీన్ మసాలా సినిమాలు మాత్రమే కాదు, ఇలాంటి విభిన్నమైన సినిమాలు కూడా వారు కోరుకుంటున్నారని నిరూపించాయి.

మరి ఈ సంవత్సరం ప్రథమార్థంలో వచ్చిన టాప్ 5 అసాధారణ సినిమాలు ఏమిటి? ఆ చిత్రాల వివరాలు, ఫోటోలను స్లైడ్ షోలో వీక్షించండి...

ఈ సంవత్సరం వచ్చిన అసాధారణమైన సినిమాల్లో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం ఒకటి. భారీ బడ్జెట్ మల్టీస్టారర్ సినిమా ఇది. డబుల్ మీనింగ్ పంచ్ డైలాగులు, కమర్షియల్ ఎలిమెంట్స్, అశ్లీల ఐటం సాంగులు లాంటివి ఈ సినిమాలో మచ్చుకైనా కనిపించవు. ఒక సాధారణ సబ్జెక్టుతో మహేష్ బాబు-వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో భారీబడ్జెట్‌తో సాహసోపేతంగా నిర్మించిన సినిమా ఇది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం, స్క్రీన్ ప్లే ఈచిత్రాన్ని బెస్ట్ ఫ్యామిలీ డ్రామాగా నిలిపాయి. మిక్కీ జే మేయర్ అందించిన వినసొంపైన సంగీతం సినిమాకు మరింత ప్లస్సయింది.

ఈ సంవత్సరం తెలుగులో వచ్చిన అసాధారణమైన సినిమాల్లో ‘కేస్ నెం. 666/2013' ఒకటి. వెంకట్ సిద్ధార్థరెడ్డి, పూర్ణేష్ కొణతాల సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం....తెలుగు మూస సినిమాలకు చాలా విభిన్నమైనది. హారర్, థ్రిలర్ నేపథ్యంలో సాగిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఉత్కంఠభరిత అంచుల వరకు తీసుకెళ్లింది. అయితే తెలుగులో ఇలాంటి సినిమాలకు ఆదరణ లేకపోడం సినిమాకు కలిసి రాలేదు.

సంవత్సరం వచ్చిన లోబడ్జెట్ సినిమాల్లో ‘స్వామి రారా' మూవీ ఒకటి. ఊహించని విధంగా ప్రేక్షకాదరణ పొందిన ఈచిత్రం మంచి విజయం సాధించింది. సాధారణ సబ్జెక్టును వినోదాత్మకంగా, ప్రేక్షకరంజకంగా తెరకెక్కించాడు దర్శకుడు. నిఖిల్, స్వాతి పాత్రలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సుధీర్ వర్మ ఈచిత్రానికి దర్శకత్వం వహించారు.

ఈ సంవత్సరం వచ్చిన అసాధారణ చిత్రాల్లో గుండెజారి గల్లంతయ్యిందే చిత్రం ఒకటి. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఈచిత్రం బాక్సాఫీసు వద్ద తన తడాఖా చూపించి మంచి వసూళ్లు సాధించింది. మంచి హాస్యము, రొమాన్స్ తో కూడిన కథ కావడంతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. నితిన్, నిత్య మరోసారి హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్నారు. విజయ్ కుమార్ కొండ ఈచిత్రానికి దర్శకత్వం వహించారు.

చిన్న బడ్జెట్ చిత్రాల్లో అద్భుతం సృష్టించిన చిత్రం ‘ప్రేమకథా చిత్రమ్'. హారర్, కామెడీ, లవ్ స్టోరీ నేపథ్యంలో సాగిన ఈచిత్రం ఊహించని రీతిలో విజయం సాధించి నిర్మాతకు పదిరెట్ల లాభాలను తెచ్చిపెట్టింది. మారుతి మరోసారి తన సత్తా చాటాడు. సుధీర్ బాబు, నందిత ఈ చిత్రంలో హీరో హీరోయిన్లు.

English summary

 Interestingly, Tollywood has released some of very unusual films in this year. These films have very creative and rare subjects, which have been treats for Telugu audiences, who have always given thumbs up for masala movies. They have managed to impress audiences and critics.
Please Wait while comments are loading...