»   » ఆమె గర్భం దాల్చడానికి కారణం ఎవరు?

ఆమె గర్భం దాల్చడానికి కారణం ఎవరు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ తరహాలో విభిన్నమైన తరహా ప్రాజెక్టులు టాలీవుడ్లోనూ క్రమ క్రమంగా మొదలువుతున్నాయి. అలాంటి చిత్రమే పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పిల్-ఎ' మూవీ. ధన్య బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈచిత్రం ట్రైలర్ తాజాగా రిలీజైంది.

'పిల్-ఎ' మూవీ 20 ఏళ్ల వయసున్న యువతి కథ. ఫ్రెండ్స్, పార్టీలు, పబ్బులు అని తిరిగే ఆ అమ్మాయి అనుకోకుండా గర్భం దాలుస్తుంది. ఎంతో మంది బాయ్ ఫ్రెండ్స్ ఉండటం వల్ల తనకు గర్భం రావడానికి కారణం ఎవరు? తాగిన మత్తులో ఆ రాత్రి ఏం జరిగింది? అనేది ఆమెకు సరిగా గుర్తుండదు.


తనకు గర్భం రావడానికి కారణమైన వాడిని కనుక్కోవడానికి ఆ యువతి ఏం చేసింది? అనే అంశానికి ఎంటర్టెన్మెంట్ జోడించి తెరకెక్కించారు. తాజాగా రిలీజైన్ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఆ ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి.
PILL A Official Trailer

విఐయూ మరియు అన్నపూర్ణ స్టూడియో సంయుక్తంగా తమడ మీడియా సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

English summary
VIU and Annapurna Studios in association with Tamada Media present PILL-A. Check out the official trailer of PillA ft Dhanya Balakrishna, directed by Pavan Sadineni, exclusively on VIU. Pill A is the story of a sweet, fun 20-something urban girl who discovers she is accidentally pregnant and what she unravels as she traces back her memory of a party night to figure out who the father is.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu