For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అమ్మాయి వెనక ఆటంబాబు...అదే అసలు కథ

  By Srikanya
  |

  హైదరాబాద్ : అమ్మాయి అందంగా ఉంటే సరిపోతుందా...ఆమె ముందు వెనకా మనని ఇబ్బంది పెట్టేవాళ్లు ఎవరూ లేకుండా ఉండాలి. అయితే అది ఎప్పుడో కానీ జరగదు. రొటీన్ గా అందమైన అమ్మాయి వెనక కండలు తిరిగన అన్నయ్యో, తుపాకి పట్టిన తండ్రో ఉంటూంటారు. అలాంటి సిట్యువేషనే మంచు మనోజ్ కి ఎదురైంది. అయితే నిజ జీవితంలో కాదు..ఆయన నటిస్తున్న తాజా చిత్రం కరెంట్ తీగ లో తను ప్రేమించే అమ్మాయి తండ్రి ని చూసి షాకవుతాడు. తండ్రిగా జగపతి బాబు చేస్తూంటే, ఆ కుర్రాడు గా మంచు మనోజ్, ఆ అందాల అమాయి గా... రకుల్ ప్రీతి సింగ్ కనిపించనున్నారు. అదే విషయాన్ని మనోజ్ అన్న ఈ చిత్రం ప్రొడ్యూసర్ మంచు విష్ణు మాటల్లో విందాం.

  మంచు విష్ణు మాట్లాడుతూ... ఎప్పుడూ స్నేహితులు, సినిమాలూ, కోళ్ల పందాలూ, అల్లరి ఆటలూ.... ఆ కుర్రాడి జీవితం ఇంతే! అంతకుమించి ఏం కోరుకోలేదు కూడా. రోజులన్నీ సాఫీగా సాగిపోతుంటే.. తొలి షాక్‌ తగిలింది. ఓ అమ్మాయి రూపంలో. కరెంటుతీగలాంటి కుర్రాడికే షాక్‌ కొట్టిందంటే ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందో వూహించుకోండి. అయితే ఆ అమ్మాయి వెనుక ఓ అణుబాంబు ఉంది. ఆ కరెంటు తీగకీ, తీగలాంటి భామకీ మధ్య ఉన్నదెవరో, ఆ కథేమిటో తెలియాలంటే మా సినిమా చూడండి అంటున్నారు మంచు విష్ణు.

  ఆయన నిర్మించిన చిత్రం 'కరెంటు తీగ'. మంచు మనోజ్‌, రకుల్‌ప్రీత్‌సింగ్‌ జంటగా నటించారు. జగపతిబాబు, సన్నీలియోన్‌ కీలక పాత్రలు పోషించారు. జి.నాగేశ్వరరెడ్డి దర్శకుడు. ఈ చిత్రాన్ని ఈనెల 31న విడుదల చేయబోతున్నారు.

   Pilla Nuvvu Leni Jeevitham Sai Dharam Tej Birthday Special Teaser

  ఈ సందర్భంగా మనోజ్‌ మాట్లాడుతూ ''నిజానికి ఈవారమే ఈ సినిమా రావాల్సింది. హుద్‌ హుద్‌ తుపాను కారణంగా 31న విడుదల చేస్తున్నాం. అచ్చు అందించిన బాణీలు అలరిస్తున్నాయి. సన్నీ పాట ప్రత్యేక ఆకర్షణ'' అన్నారు. వెన్నెల కిషోర్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ మూవీలో హాట్ బ్యూటీ సన్నీ లియోన్ అతిధి పాత్రలో కనిపించనుంటే, శిల్పి శర్మ ఓ ఐటెం సాంగ్ లో కనిపిచనుంది.

  ప్రస్తుతం మనోజ్ దృష్టి మొత్తం ఆయన తాజా చిత్రం కరెంట్‌తీగ పై ఉంది. ఆ చిత్రంలో తన పాత్ర గురించి చెప్తూ... పాండవులు పాండవులు తుమ్మెద తరువాత కరెంట్‌తీగ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. దీనికి జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకు ముందు విష్ణు అన్నయ్యతో దేనికైనా రెడీ వంటి సూపర్‌డూపర్ హిట్టిచ్చారాయన. ఇప్పటి వరకు నేను పనిచేసిన దర్శకుల్లో కరెక్ట్‌గా నా బెండుతీసి నాతో వర్క్ చేయించుకుంటున్నారు. రాఘవేంద్రరావు, చంద్రశేఖర్ ఏలేటిల తరువాత జి.నాగేశ్వరరెడ్డి అంతబాగా అంకిత బావంతో పనిచేస్తున్నారు.

  సినిమా చాలా బాగా వస్తోంది. ఇందులో ఫుల్ ఎనర్జీతో రఫ్ అండ్ టఫ్‌గా వుండే ఓ పల్లెటూరి యువకుడిగా కనిపిస్తాను. దేవుడి దయవల్ల సినిమా బాగా వస్తోంది. ఇందులో జగపతిబాబుగారు కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే ప్రత్యేక పాత్రలో సన్నిలియోన్ నటిస్తోంది. ఆమె పాత్రకున్న ప్రాముఖ్యత ఎలాంటిదో చెప్పడం కంటే సినిమా చూస్తేనే అర్థమవుతుంది అన్నారు.

  English summary
  Manchu Manoj said that his present Movie Current is about a girl and his father atom bomb.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X