»   » పైరసీ సెల్ ఉన్నా లేనట్లే: శివాజీ

పైరసీ సెల్ ఉన్నా లేనట్లే: శివాజీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎంటర్టైన్మెంట్ టాక్స్ రూపంలో గవర్నమెంట్ కోట్ల రూపాయలు సినీ పరిశ్రమనుంచి సంపాదిస్తోందని అయితే పరిశ్రమను నాశనం చేస్తున్న పైరసినీ అరికట్టలేకపోతోందని ఆరోపించారు. పైరసీ నివారణకు స్క్రిక్ట్ రూల్స్ పెట్టాలని, నిర్మాతలంతా ఈ సమస్య పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. తాజ్ మహల్ సినిమాతో నిర్మాతగా మారిన శివాజి పైరసీ గురించి మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు. అలాగే వచ్చేది వేసవి అని, అనేక సినిమాలు విడుదల అవుతాయని, కాబట్టి పైరసీ పై యుధ్దం ప్రకటించటానికి ఇదే సరైన సమయమని ఆయన అభిప్రాయపడ్డారు. పైరసీ పై పోరుని సలుపుతూ ఆమరణ నిరాహరణ దీక్ష చేస్తున్న నిర్మాతలకు శివాజి సపోర్టు ఇస్తానన్నారు. ఆయన అల్లరి నరేష్ తో కలిసి నటించిన ఆకాశ రామన్న చిత్రం మొన్న శుక్రవారం రిలీజైంది. అలాగే 20 వ తేది తను నటించి,నిర్మించి తాజ్ మహల్ అనే కన్నడ రీమేక్ చిత్రం రిలీజవుతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu