»   »  విచ్చలవిడిగా మహేష్ '1' పైరసీ, చెర్రీ 'ఎవడు' కూడా

విచ్చలవిడిగా మహేష్ '1' పైరసీ, చెర్రీ 'ఎవడు' కూడా

Posted By:
Subscribe to Filmibeat Telugu

విజయవాడ/హైదరాబాద్: పైరసీ రక్కసి చిత్ర నిర్మాతలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన మహేశ్ బాబు '1 నేనొక్కడినే', రామ్ చరణ్ తేజ 'ఎవడు' చిత్రాలకు పైరసీ ఆందోళన కలిగిస్తోంది. విజయవాడలో 1 నేనొక్కడినే చిత్రం పైరసీలను గుర్తించారు.

నిన్నటి నుండి ఈ సినిమా పైరసీ సిడిలు విచ్చలవిడిగా మార్కెట్లుకి వచ్చాయని ఆందోళన చెందుతున్నారు. ఎవడు చిత్రం పైరసీ సిడిలను కూడా మార్కెట్లోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి డౌన్‌లోడ్ పాస్ వర్డ్‌ను కూడా విడుదల చేశారట.

 Piracy films of 1 nenokkadine, yevadu

గతంలో అత్తారింటికి దారేది చిత్రం మూవీ విడుదలకు ముందే బయటకు రావడం సంచలనం సృష్టించింది. బెజవాడ కేంద్రంగా పైరసీ సిడిలు బయటకు వస్తున్నాయంటున్నారు. పైరసీ మాఫియా.. టాప్ హీరోల చిత్రాలు విడుదలైన వెంటనే మార్కెట్లోకి తీసుకు వస్తున్నాయి.

కాగా, రామ్ చరణ్ తేజ హీరాగా నటించిన 'ఎవడు' చిత్రం ఆదివారం విడుదల కాగా, ప్రిన్స్ మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడినే చిత్రం మూడు రోజుల క్రితం విడుదలయింది.

English summary
Piracy mafia is releasing Mahesh Babu's 1 Nenokkadine and Ram Charan Teja yevadu movies piracy CDs into market.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu