»   »  ‘నాన్నకు ప్రేమతో’ సినిమా రెవెన్యూ దెబ్బతీస్తున్నారు!

‘నాన్నకు ప్రేమతో’ సినిమా రెవెన్యూ దెబ్బతీస్తున్నారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నాన్నకు ప్రేమతో' చిత్రం సంక్రాంతికి విడుదలై భారీ విజయం సాధించింది. ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. దాదాపు రూ. 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం తొలి మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్ రూ. 30 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది. ఈ సంక్రాంతి బరిలో ‘నాన్నకు ప్రేమతో' చిత్రమే కలెక్షన్స్ పరంగా టాప్ లో నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ టాక్.

సక్సెస్ ఆనందం ఒక వైపు అయితే.... పైరసీ దారులు రెచ్చి పోవడం నిర్మాతలను, బయ్యర్లను ఆందోళనకు గురి చేస్తోంది. నాన్నకు ప్రేమతో చిత్రం ఆస్ట్రేలియన్ పైరేట్స్ చేతికి చిక్కిందని, విదేశాల్లో ఈ చిత్రం పైరసీ సీడీలు జోరుగా స్ప్రెడ్ అయ్యాయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీని వల్ల సినిమా రెవెన్యూ మీద తీవ్రమైన ప్రభావం పడుతుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది.


 Piracy shocks Nannaku Prematho team

సంక్రాంతికి విడుదలైన నాలుగు సినిమాలు సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. అయితే ఎక్కువ మంది నెం.1 చాయిస్ ‘నాన్నకు ప్రేమతో' సినిమానే కావడంతో పైరసీ దారులు ఈ చిత్రాన్ని ఎక్కువ పైరసీ చేస్తున్నారట. ఎన్టీఆర్ గత సినిమాలై టెంపర్, బాద్ షా కాంబోతో ‘నాన్నకు ప్రేమతో' సీడీలు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే విదేశాల్లో పైరసీ కావడంతో నిర్మాతలు ఏమీ చేయలేక పోతున్నారు.


అయితే ఇండియాలో ఈ పైరసీని అడ్డుకునేందుకు నిర్మాతలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంటర్నెట్ లో ఈ సినిమా పైరసీ లింక్స్ ఎక్కడ కనిపించినా బ్లాక్ చేయిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ టీం పని చేస్తున్నట్లు సమాచారం.

English summary
Nannaku Prematho has fell in the hands of Australian pirates who are circulating the DVDs of Nannaku Prematho along with NTR's previous films, Temper and Baadshah.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu