»   » పూరి జగన్నాథ్ వదిలిన 'పిశాచి' ఇది (వీడియో)

పూరి జగన్నాథ్ వదిలిన 'పిశాచి' ఇది (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :తమిళంలో విజయవంతమైన 'పిశాసు' చిత్రానికి అనువాద రూపమిది. మిస్కిన్‌ దర్శకుడు. నాగ, ప్రయాగ మార్టిన్‌, రాధారవి, రాజ్‌కుమార్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 27న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. బుధవారం హైదరాబాద్‌లో ప్రచార చిత్రాల్ని ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ విడుదల చేశారు. ఆ ట్రైలర్ మీరూ చూడండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

తెరపై కనిపించే కొన్ని దెయ్యాలు భయపెడుతుంటాయి, మరికొన్ని ప్రాణాలు తీస్తుంటాయి. కానీ ఇక్కడ దెయ్యం మాత్రం అంతా మంచే చేస్తుంది. చెడ్డవాళ్లను మంచివాళ్లుగా మార్చేస్తుంటుంది. ఆ మంచి దెయ్యం కథేమిటో తెలియాలంటే 'పిశాచి' చూడాల్సిందే.

చిత్ర నిర్మాత సి.కల్యాణ్‌ మాట్లాడుతూ ''పెద్ద చిత్రాలతో పోటీపడి విజయం సాధించిన చిత్రమిది. ఇదొక మంచి దెయ్యం కథ. ప్రముఖ దర్శకుడు బాల ఈ చిత్రాన్ని నిర్మించారు. పేరుకు పిశాచి అయినా ఇందులో ఒక విభిన్నమైన ప్రేమకథ ఉంది. 'చంద్రకళ' తర్వాత మా సంస్థ నుంచి వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకుల్ని తప్పకుండా అలరి స్తుంది'' అన్నారు.

Pisachi Horror Movie Trailer

పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ ''నేను దెయ్యం సినిమాలు చూడను. మంచి దెయ్యం అన్నారు కాబట్టి ఈ సినిమా చూస్తా. 'చంద్రకళ' కంటే పెద్ద విజయం ఈ చిత్రంలో లభిస్తుంది'' అన్నారు.

నిర్మాతల్లో ఒకరైన సి.కల్యాణ్‌ మాట్లాడుతూ ''మనసుల్ని దోచుకొనే దెయ్యం కథతో రూపొందిన చిత్రమిది. తమిళంలో ప్రముఖ దర్శకుడు బాల నిర్మించారు. అక్కడ ఘన విజయం సాధించింది. తెలుగు ప్రేక్షకుల్ని కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి'' అన్నారు.

‘చంద్రకళ' సినిమా తరువాత మరో తమిళ సూపర్‌హిట్‌ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు సి.కళ్యాణ్‌. మిస్కిన్‌ దర్శకత్వంలో తమిళ దర్శకుడు బాల నిర్మించిన ‘పిశాచి' సినిమాను సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. పతాకంపై సి.కల్యాన్‌, కల్పన అదే టైటిల్‌తో తెలుగులోకి అనువదిస్తున్నారు. బాల ఈ చిత్రానికి సమర్పకులు.

నిర్మాత సి.కల్యాణ్‌ మాట్లాడుతూ ‘‘మిస్కిన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ నెల 18న విడుదలై పెద్ద హిట్‌ అయింది. మనసుల్ని దోచుకునే ఓ దెయ్యం కథ ఇది. ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించిన బాలా అంతా కొత్తవారితో ఈ సినిమా నిర్మించారు. రొమాంటిక్‌ హారర్‌గా రూపొందిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుదన్న నమ్మకం ఉంది. పెద్ద పోటీ మధ్య ఈ సినిమా రైట్స్‌ దక్కించుకున్నాను. .'' అని తెలిపారు.

ఈ చిత్రం డబ్బింగ్ రైట్స్ ని 25 లక్షలు చెల్లించి సొంతం చేసుకున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఇప్పటికే ఈ చిత్రం తెలుగు డబ్బింగ్ వెర్షన్ బిజినెస్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: రవిరాయ్‌, సంగీతం: ఎ.కె., మాటలు: శశాంక్‌.

English summary
Nag, Prayaga Martin, Radha Ravi, Harish Uttaman's kollywood flick ‘Pisachu’ is releasing in Telugu as ‘Pisachi’. Filmmakers celebrated the teaser launch yesterday in Hyderabad. Puri Jagannath released the film and wished the film huge success.
Please Wait while comments are loading...